




గత ఏడాది హాస్య రచయితగా శక్తి ఎవార్డును అందుకొన్న మితృలు
శ్రీ ఎమ్బీయస్.ప్రసాద్ గారి గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తాను..
రచయితగా ఆయన రచనలు చాలా మంది సాహిత్యప్రియులు
చదివేవుంటారు. వరల్డ్ స్పేస్ ( ఓ మంచి రేడియో గత ఏడాదే
నష్టాలతో కనుమరుగయింది) రేడియోలో పడకకుర్చీ కబుర్ల ద్వారా
ఆయన గళాన్ని వినే వుంటారు. "ఇదీ అసలు కధ" అంటూ వనిత
టీవీ లో మన సినిమాలు, ఇతర భాషల్లో తీసిన వాటి మాతృకల
గురించి, వాటి వీడీయోలు చూపిస్తూ రెండింటి చిత్రీకరణలో చేసిన
మార్పులగురించి చెప్పిన శ్రీ ప్రసాద్ గారిని టీవీలోచూసేవుంటారు. ఈ
అపురూప కార్యక్రమానికి ఉత్తమ టీవీ కార్యక్రమ ఎవార్డూ వచ్చింది.
ఆయనతో నాకు పరిచయం కలిగించింది ఒక విధంగా శ్రీ బాపూ
గారనే చెప్పాలి. శ్రీ ప్రసాద్ "హాసం" పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ గా
వున్నప్పుడు "హాసం"లో" బాపూ రమణీయం" అనే శీర్షిక వచ్చేది.
ఆ శీర్షికకు నేను బాపు గారు ఆంధ్రసచిత్రవారపత్రికకు 1960 లో
గీసిన ముఖచిత్రం పంపాను. అందుకున్న వేంటనే శ్రీ ప్రసాద్
గారి దగ్గర నుంచి పోనొచ్చింది. అలా ప్రారంభమైన స్నేహం
మా హాసం క్లబ్ ప్రారంభోత్సవానికి ఆయన రాజమండ్రి వచ్చి
మా ఇంటికి రావటం, అలా అలా ఆయన మా కుటుంబ మిత్రులయ్యారు.
ఆయన ఎన్నో నవలలను , కధలను వ్రాసారు. వూఢ్ హౌస్ నవలలు
"అచలపతి కధలు" గా అవి అచ్చు తెలుగు వాతావరణంలో తిరిగి
వ్రాశారు. ఆయన కలం నుంచి తెలుగులో, ఇంగ్లీషులో డైరెక్ట్ కధలు,
అనువాదాలు వచ్చాయి చరిత్ర, కళ, రాజకీయాలపై ఎన్నో వ్యాసాలు,
ఫీచర్సు ప్రముఖపత్రికలలో వ్రాసారు.
ఈ తరం వారికోసం ముళ్లపూడి వెంకట రమణగారి సమగ్ర సాహిత్యాన్ని
ఎనిమిది సంపుటాలుగా ఏర్చి కూర్చారు ( బుడుగుతో సహా)!.350
పైగా వైవిధ్యభరితమైన రచనలు అందించారు. శ్రీ ప్రసాద్ రచించిన
వివిధ విషయాలపై "పడకకుర్చీ కబుర్లు" పేరిట 14 సంపుటాలు,,
38 కాలిబర్ పేరిట మపైఎనిమిది ధ్రిల్లింగ్ కధలు, ప్రసిద్ధ ఘట్టాలు, కొందరు
ప్రఖ్యాత వ్యక్తుల జీవితాల గురించి "హిస్టరీ మేడీజీ" అనే పుస్తకం,
కాగితాల బొత్తి పేరిట వివిధ పత్రికలలో ప్రచురించిన కధల సంపుటి,
జంతువులతో మాట్లాడే డాక్టర్ కధ డాక్టర్ డూలిటిల్ ( ఈ సిన్మా పిల్లల్ని
పెద్దల్ని అలరించింది) రచన చేసారు. శ్రీ ప్రసాద్ గారి శ్రీమతి స్వాతిగారు
కూడా మంచి రచయిత్రి.
శ్రీ ప్రసాద్ వారి కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్ గురించి వ్రాస్తూ ఆయనకు హాస్య
ReplyDeleteరచయితగా కీర్తి అవార్డు అని వ్రాయడానికి బదులు శక్తి
అవార్డు అని వ్రాశాను. తప్పుకు మన్నించమని ప్రసాద్
గారిని, బ్లాగరు మితృలను కోరుకుంటున్నాను.
ప్రసాద్ గారు శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి మనుమడని సాహితీ మిత్రుల ద్వారా తెలుసుకున్నాను.
ReplyDeleteఅందుకే ఆ హాస్య ఛాయలు వంశపారంపర్యంగా పలకరిస్తుంటాయన్నమాట!.
అచలపతి కథలకంటే పడక్కుర్చీ కబుర్లు బాగుంటాయి నాకు!
ఎమ్బీయస్ ప్రసాద్ గారి థ్రిల్లింగ్ కథలు చదివాను. సస్పెన్స్ తో చాలా పఠనీయంగా ఉంటాయి. మళ్ళపూడి సాహితీ సర్వస్వం కూర్పులో ఆయన కృషి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది.
ReplyDelete