RSS
Facebook
Twitter

Wednesday, 3 August 2011


అప్పుమీద రమణగారి మరికొన్ని చమత్కారాలు అప్పుగా ఇస్తున్నాను. మీరు
మీకు తెలిసినవాళ్ళకి అప్పిచ్చేయండి.
"జీవితమే పెద్ద అప్పు"
" అప్పడక్క పోతే వాడేవడో మనమెవడో
అడిగితేనే ఇవ్వడం, ఇస్తేనే పుచ్చుకోవడం
పుచ్చుకుంటేనే మళ్ళీ ఇవ్వడం ఈ మూడూ
లేకపోతే జీవితం బోరు కొట్టెయ్యదూ "
<><><><><><><><>
"చంద్రుడు" సూర్యుడి దగ్గర నుంచి కాంతిని అప్పు తీసుకుంటాడు.
అందుకే ఋణ కిరణుడయ్యాడు. సూర్యుడు కాంతిని ఎక్కడా
అప్పుచ్చుకోలేదు. అందుకే అఋణకిరణుడయ్యాడు"
ఈ ప్రాధమిక సత్యంతో "ఋణానందలహరి" మొదలవుతుంది
మనం పంచతంత్రం కధలు, ఈసప్ కధలు చదివాం.రమణగారు తన
"ఋణానందలహరి"లో కాకుల చేత , చీమల చేత, పాములచేత వాళ్ల
భాషలోనే మాట్లాడించారు.కాకులవి కావు కేకలు,కావులింతలు,చీమలవి
చిమ చిమ నవ్వులు, ఇక పాములవి "దోబుస"లు, గాలి బోంచేసి "బుస్సు"న
తేన్చటాలు వినిపిస్తారు!! ఇక వీటికి తగ్గ సామెతలూ, మాటలూ చెప్పారు.
పాము: "కోటికి పడగెత్తి పుట్టింది
కాకులు: "రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళు
పెద్ద కాకి చిన్న కాకితో కోపంగా " కాకమ్మ కబుర్లు చెప్పొద్దు" అని
కావు కేకలు వేసింది.
ఈటీవీ శ్రీ బాపు దర్శకత్వంలో నిర్మాణం చేసిన శ్రీ భాగవతం లో రమణ గీతాలలో
కూడా రమణగారి మార్కు అగుపిస్తుంది. కార్తవీర్యుని జలక్రీడ ఘట్టానికి ఆయన
గీత రచన సొగసులు చూడండి.
గలగల పారెడు నది - యిది
కిల కిల నవ్వించు నది-ఈ
వలపుల కౌగిలి మ-నది
అలానే రామకధ దృశ్యాలలో
ఆ లంకలో నున్న వనము సుందరము
ఆ లంకలో సీత మనము సుందరము
ఆ వనములో హనుమ రణము సుందరము
మనిషి మంచి చెడ్డల గురించి బాపురమణలు తీసిన మొదటి సినిమా "సాక్షి" లో
హీరోయిన్ చుక్క చేత రమణగారు పలికించిన మేలుపలుకులు:
"మంచోళ్ళు సెడ్డోళ్ళు అంటూ యిడిగా వుండరు మావా! మంచి చెడ్డా
కలిస్తేనే మడిసి."
ఇందులో నేను మీకు చెప్పిన విశేషాలు అన్నీ రమణగారి పుస్తకాలనుంచి , కీ"శే"
ఎమ్వీయల్ ముళ్లపూడి సాహిత్యంపై "కానుక" పేరిట వ్రాసిన సమగ్ర పరిశోధనా
పుస్తకం నుంచి అప్పుతీసుకొని వ్రాసినవి. కాపీరైట్ మీద రమణగారు ఇలా అన్నారు.
"అసలు కాపిరైటు అన్న మాటలోనే కాపీ చాలా రైటన్నపని అనీన్నీ, కాపీ ఒక
రైటు (హక్కు) అనిన్నీ, తాత్పర్యాలు దాంకుని ఉన్నాయి అనీ, పెద్దల క్రిటికా
తాత్పర్యాలు ఘోషిస్తున్నాయి.అందువల్లనే ఇరుగు పొరుగు కధలూ పాటలూ
కాపీ కొట్టడం జరుగుతుంది.!"
అప్పారావు దొంగేడుపు కార్టూన్ కూడా బాపుగారి దగ్గర అప్పుతీసుకున్న
కాపీరైటు !! నా పేరే అప్పారావు.!!నా పేరు రమణగారు అప్పుతీసుకున్నారు!!

3 comments:

  1. ముగింపు చాలాబాగుంది

    ReplyDelete
  2. chala bavundi. abhinandanalu appu ararao garu :P

    ReplyDelete
  3. అప్పారావు పేరెట్టేసారు కనుక అప్పు చేయకపోతే బాగోదేమోనని అప్పు చేస్తున్నారు కాని మీరే స్వంతంగా ఇంకోళ్ళకు అప్పిచ్చేయగల గుర్నాథం గారు...కాదా చెప్పండి...ముళ్లపూడి వారి రత్నాలతోపాటు మీ వజ్రాలు కూడ పంచ్ తే ...అడక్కండి మేమంథా హేపీసే హేపీసు.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About