RSS
Facebook
Twitter

Sunday, 25 October 2009

నిప్పుకోడి -సిరాబుడ్డి





ఇది నిప్పుకోడి బొమ్మ కాదు సుమా! పాత కాలంనాటి సిరా బుడ్డి!!

ఈ నిప్పుకోడి బొమ్మచూసారా! మొదటి బొమ్మ రెక్క మూసి ఉంచినప్పుడు మామూలు బొమ్మగా అగుపిస్తున్నది. రెక్కని పైకి తీస్తే నిప్పుకోడి బొమ్మ కడుపులో సిరా పోసుకోవచ్చన్న మాట!. కలం పెట్టుకోడానికి చిన్న స్టాండు వుంచబడింది. ఈ బొమ్మ మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి వుంది.మా నాన్న గారు అప్పటి ఇంపీరియల్ బ్యాంకు లో(ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) యూరోపియన్ ఏజెంట్ మర్ఫీ దగ్గర టైపిస్ట్ గా పని చేసినప్పుడు ఆయన ఇంగ్లాండు తిరిగి వెళ్ళేటప్పుడు బహుమతి గా ఇచ్చారట! మా నాన్నగారు (యంవీ.సుబ్బారావు గారు) స్టేట్ బ్యాంక్ లో 1959 లొ పదవీవిరమణ చేసి 1981 లోకీర్తిశేషులయ్యారు. పుస్తక పఠనం, సంగీతం, స్టాంప్, నాణేల సేకరణ, ఆయన హాబీలు. మానాన్న గారి బుక్ కలెక్షన్, నా కలెక్షన్ తో నా దగ్గర మంచి హోమ్ లైబ్రరరీ వుంది.


ఇక నా పుస్తకాల గురించి, " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికి ఇవ్వను!
అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లో దొరుకుతున్నాయి కనుక!

నా పాత పుస్తకాలు ఎవ్వరికి ఇవ్వను.
అవి ఇప్పుడు నాకు ఎక్కడా దొరకవు కనుక!!"

తప్పుగా అనుకోవద్దు.. ..కాని నా లైబ్రరీ విశేషాలను మీతో పంచుకుంటాను.

Saturday, 24 October 2009

బాపూ రమణీయం

బాపు రమణ గార్ల తో నా పరిచయం




నాకు కార్టూన్లను గీయాలనే అభిలాషను,హాస్య రచనలు చదవటం,హాస్యంగా మాట్లాడటం నేర్పింది ఇద్దరు మహానుభావులు! వారు ఒకరేమో శ్రీ లక్ష్మీనారాయణ,మరొకరు శ్రీ వెంకటరమణ.1956 నవంబరు నుంచి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర వార పత్రికలో వచ్చిన "బుడుగు-చిచ్చుల పిడుగు" (అప్పుడు నాకు 15 ఏళ్ళు)నా లాంటి అశేష పార్ఠకులను విశేషంగా ఆకర్షించింది.బుడుగు సీరియల్ పూర్తయ్యే వరకు ఛదువరులెవరికీ రచయిత ఎవరో తెలియదు! ముగింపు లో ఇది రాసి పెట్టినవాడి పేరు ముళ్లపూడి వెంకట రమణ, బొమ్మలు వేసినవాడి పేరు బాపు అని వేసారు. ఆ నాటి నుంచే బాపురమణల అభిమానిగా మారి పోయాను. రమణగారి పుస్తకాలన్నీ మా నాన్న గారి చేత కొనిపించుకొనే వాడిని.మా నాన్న గారు కూడా పుస్తకాలను అభిమానించేవారే కావటం నేను చేసుకున్న అదృష్టం! 2005 లో రమణగారి పుట్టిన రోజుకి స్వంతంగా తయారు చేసిన జన్మదిన శుభాకాంక్షలు పంపాను.అందగానే ఆయన దగ్గర నుంచి ఫోనొచ్చింది.





మా పెద్దమ్మాయి మాధురి అత్తవారివూరు చెన్నై కాబట్టి ఈ సారి వచ్చినప్పుడు కలుస్తానని ఆనందంగా చెప్పాను.అక్టోబర్లో ఆయన ఇంటికి మా అమ్మాయితో కలసి మొదటి సారి వెళ్ళాను. బాపు ,రమణగార్లను అలా ప్రత్యక్క్షంగా కలవడం,నేనేనాడో చేసుకున్న పుణ్యంగా భావించాను.ఆ నాటి నుంచి ప్రతి ఏడాది రెండు సార్లు కల్సి వస్తూనే వున్నాను.మొదటి సారి వెళ్ళినప్పుడు కొద్ది సేపయిన తరువాత బాపుగారు వర్కు చేసుకోవాలని క్రిందకు వెళ్ళారు. నేను శ్రీ రమణ గారి సంతకం ముళ్లపూడి సాహితీ సర్వస్వం పుస్తకం మీద తీసుకుంటూ "బాపు గారి సంతకం తీసుకోవటం మరచిపోయా" అని అనగానే పుస్తకం తీసుకొని అచ్చు బాపు గారిలా సంతకం చేసి క్రింద బ్రాకెట్ లో 'ఆధరైజ్డ్ ఫోర్జరీ' అని వ్రాయటం కొసమెరుపు!! కొంచెం పేరు రాగానే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళనే ఏదో కొత్త ముఖాన్ని ఛూస్తున్నట్లు ప్రవర్తించే ఈరోజుల్లో బాపు రమణ లాంటి మంచి మనసున్న మనుషులున్నందుకు ఆ భగవానునికి నమోవాకాలు. వారి తో నా మరికొన్ని అనుభూతులు మరోసారి!!

Thursday, 22 October 2009





ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ బాబు గారితో నా మొదటి పరిచయం రాజమండ్రిలో
1980 మే నెలలో.అప్పుడు ఆయన బాపుగారి తో "వంశవృక్క్షం"షూటింగ్ కోసం రాజమండ్రి
వచ్చి నాకు ఉత్తరం ఇలా వ్రాసారు."నేను మీ ఊళ్ళోనే వున్నాను.మిమ్మల్ని కలిసే అవకాశం
నాకివ్వండి" అప్పటికే ఆయన జూయాలజీ ప్రొఫ్ఫెస్స్రర్ చెస్తూ కార్టూనిస్ట్ గా ఉన్నత స్తానం లో
వున్నారు.ఈనాటికీ ఆయన నిగర్వి.స్నేహానికి ఎంతో విలివనిస్తారు.కార్టూన్లు గీయటంలో నా
లాంటి వాళ్ళకు ఎన్నో మెలుకవలు చెప్పారు,నేర్పారు.వెంటనే ఆ సాయంత్రం హోటల్ మేడూరి
లో మా అమ్మాయి మాధురి తో వెళ్ళి కలిసాను.అప్పుడు దాని వయసు 15 ఏళ్ళు. తిరిగి ఇన్నాళ్ళ
కు ఛెన్నై లొ మాధురితో కలసి మనవళ్ళు చి.నృపేష్,చి.హ్రితేష్ తో 29 ఏళ్ళతరువాత ఆగస్టు 5వ
తేదిన కలిసాను.ఆప్పుడు చి.నృపేష్ మా ఇద్దరికి తీసిన ఫొటొ ఇది.

Wednesday, 21 October 2009

మంచి మాట



ఉ(త్త)మ సలహాలు

మనము ఇష్టపడి ఏదైనా వస్తువుకొనుక్కొని ఇంటికి వచ్చిన ఏ మిత్రుడికో
చూపించామనుకోండి, "ఆ! ఇది కొన్నావా? మాకు తెలిసినవాళ్ళు ఇదే కొన్నారు.
రెండు రొజుల్లో పాడైపోయింది" అంటూ కామెంట్ చేస్తుంటారు.మనకు వెంటనే
మనసు చివుక్కు మంటుంది. ఒక వేళ కొనేముందు అలాటి సలహాలు (నిజమై
తేనే ) ఇవ్వచ్ఛు కాని ఎంతో ఉత్సాహంగా కొన్న వస్తువు చూపించినప్పుడు
ఇలాటి ఉత్త సలహాలు ఇచ్చే అలవాటు వున్నవాళ్ళు మానుకుంటే మంచిదని
నా అభిప్రాయం.మీరేమంటారు!

Monday, 19 October 2009

చోద్యం కాకపొతే ...



























మా అళ్ళుల్లు మా అమ్మాయి ల మాటలు చక్కగా వింటారు! మా వెధవే వాళ్ళావిడ ఎంత చెబితే అంత!!


కార్టూనిస్ట్ శ్ర్ జయదేవ్ గారు మెచ్చిన నా కార్టూన్.
  • Blogger news

  • Blogroll

  • About