RSS
Facebook
Twitter

Sunday, 28 February 2010

డాక్టర్-పేషెంట్




హాసం క్లబ్: డాక్టర్-పేషెంట్ : లఘు హాస్య నాటికలో నేను. యమ్.డి.ఖాదర్ ఖాన్


డా.ఖాన్: రండి రండి, అప్పారావుగారు,ఎలా ఉన్నారు? మీ చెవి నొప్పికి నేనిచ్చిన మాత్రలు
మూడు రోజులు మూడు పూట్లా వేసుకున్నారనుకుంటాను. ఇప్పుడు నొప్పి ఎలా వుంది?

అప్పారావు: తగ్గడమా?! పైగా నొప్పి భరించలేనంత ఎక్కువైయిందండీ బాబూ!

డా.ఖాన్ : ఏదీ,చెవి చూడనివ్వండి! ఇదేమిటి? చెవిలో ఏమిటో తెల్లగా కుప్పలు కుప్పలుగా
ఉన్నాయి?!

అప్పారావు: ఏమిటా? భలే వారండి! అవి మీరిచ్చిన మాత్రలు!!

డా.ఖాన్ : ఏవిటీ, మీ అసాధ్యం కూలా! మాత్రలు చెవిలో వేసుకున్నారా? మీరెక్కడ దొరికారండీ?

అప్పారావు: చెవిలో వేసుకోక ఇంకెక్కడ వేసుకోవాలి.మొన్న నాకు నోటి పూత వస్తే మాత్రలు నోట్లో
వేసుకున్నాను.తగ్గింది.ఇప్పుడు చెవి నొప్పివచ్చినప్పుడు చెవిలో వేసుకోక నోట్లో వేసుకుంటామా?
ఐనా ఆ విషయం మీరు ముందుగా చెప్పాల్సింది.

డా.ఖాన్ : సరేలెండి. ఇన్జెక్షన్ చేస్తా. నొప్పి వెంటనే తగ్గుతుంది.

అప్పారావు: డాక్టర్ గారు.నే ఇంజక్షన్ చేయించుకోవడం ఇదే మొదటి సారి.నొప్పి లేకుండా చేస్తారు కదూ?

డా.ఖాన్ : భలే వారండి.నేను 35 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా,తెలుసా!!

అప్పారావు: అమ్మ బాబోయ్! ఇంజక్షన్ చేయడం అన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇంకా మీ కనుభవం
రాలేదన్న మాట. వద్దు లెండి. మాత్రలే ఇవ్వండి.ఈ సారి నోట్లోనే వేసుకుంటా.

3 comments:

  1. మీరు రాజమండ్రి బ్లాగరేకదా, దామెర్ల రామారావుగారి గాలరీ గురించి ఫోటోలు, సమాచారంతో ఒక టపా రాయమని మనవి.

    థాంక్స్
    రమణ

    ReplyDelete
  2. రమణ గారు, దామెర్ల ఆర్ట్ గాలరీ గురించి వ్రాయటానికి
    తప్పక ప్రయత్నిస్తాను................సురేఖ**

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About