ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని 1956 లో చేసినా ,ప్రెస్ కౌన్సిల్
నిజానికి మొదలయింది నవంబరు 16,1966. అందుకే
ఈ రోజును నేషనల్ ప్రెస్ డే గా జరుపుకుంటున్నాం.
కొంతవరకైనా ప్రజాప్రతినిధులు భయపడుతున్నారంటే
దానికి కారణం మన పత్రికలే! ఆనాటి బోఫర్స్ కుంభ
కోణం నుంచి ఈ నాటి కామన్వెల్త్ గేమ్స్ వరకు పత్రికలు
ఎన్నెన్నో చీకటి విషయాలు ప్రజల ముందు ఉంచాయి.
ఏదైనా ఒక దేశంలో ప్రజాసామ్య వ్యవస్త ఎట్లా పనిచేస్తుందో
తెలియాలంటే పత్రికలదే ప్రధాన పాత్ర. అందుకే ఎమర్జన్సీ
చీకటి రోజుల్లొ పత్రికల గొంతు నొక్కేయటానికి అప్పటి
ప్రభుత్వం చేయరాని ప్రయత్నం లేదు. అట్లాఅని పత్రికా
స్వాతంత్ర్యాన్ని దుర్నియోగం చేసిన సంధర్భాలూ కొన్ని
వుండొచ్చు. అందుకే ప్రెస్ కౌన్సిల్ ఏర్పడింది. స్వాతంత్ర
ఉద్యమంలో ఆంధ్రపత్రిక లాంటి పత్రికలు పోషించిన ప్రముఖ
పాత్ర ఎట్లా మరచిపోగలం? ఆ రోజుల్లో నాయకులు పత్రికలలో
తమపై వచ్చే విమర్శలను,అభిప్రాయాల గురించి విజ్ఞతతో
ఆలొచించే వారు. జవహరలాల్ నెహ్రూజీ శంకర్శ్ వీక్లీలో
శ్రీ శంకర్ వారం వారం తనపై వేసే కార్టూన్లను చూసి
అమితంగా ఆనందించే వారట! ఒక వేళ ఏ వారమైనా తనపై
కార్టూన్ లేక పోతే శంకర్ గారికి ఫోన్ చేసేవారట! విచిత్ర మేమంటే
ఆయన కుమార్తె రోజులొచ్చేటప్పటికి ఆ మంచి పత్రిక మూల
పడింది. అంతెందుకు, మన రాష్ట్రం లోనే ఒక ముఖ్యమంత్రి దిన
పత్రికలలో వచ్చిన కార్టూన్లను చూసి అసెంబ్లీలోనే తన అసహనాన్ని
వెలిబుచ్చడం మనం అందరం చూశాము కదా!
పండిట్ నెహ్రూ పత్రికలు మన సమాజానికి కళ్ళూ,నోరు
అని అనే వారు. మహత్మా గాంధీ సంపాదకత్వంలో "యంగ్ ఇండియా",
"హరిజన్" పత్రికలను నడిపే వారు. "నేషనల్ హెరాల్డ్" పత్రికను
నెహ్రూజీ స్థాపించారు. తిలక్, లాలా లజ్పతి రాయ్ పత్రికలను
స్థాపించారు. ముట్నూరి కృష్ణారావు "కృష్ణాపత్రిక", విశ్వదాత
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు "ఆంధ్ర పత్రిక" నడిపారు.
ఆ నాటి "ఆంధ్రపత్రిక", ఆంధ్ర సచిత్రవార పత్రిక విశేషాలు, శ్రీ కాశీనాధుని
నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకోడానికి "ఆంధ్రపత్రిక" చరిత్ర
అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, హైద్రాబాదు వారు
పచురించారు. ప్రతి తెలుగు వారు తప్పక చదవవలసిన పుస్తకం.
Chalaa vishayalu chepparu. Mee daggar manchi collection vundi sir.
ReplyDeleteKalasagar
నిర్మొహమాటంగా ఉన్నదున్నట్టు వ్రాసి జాతిలో చైతన్యం రగిలించిన ఆనాటి పత్రికలకు నేటి పత్రికలకు పొంతనే లేదు.ఇప్పుడంతా వ్యాపరమయం,సెన్సెషనలిజం అయిపోయింది.ఏ పత్రిక నిజం చెబుతుందో,ఏ పత్రిక అబద్ధం చెబుతుందో తెలియదు.ఒకే వార్త నాలుగు వార్తాపత్రికలలో నాలుగురకాలుగా ఉంటుంది. జనహితం వదిలేసి నాయకుల పక్షం వహించే స్థాయికి పత్రికలు దిగజారిపోయాయి. కొన్ని పార్టీలు ఇంకొకడుగు ముందుకేసి తమ అజెండా వినిపించడం కోసం పత్రికల్ని స్థాపిస్తున్నాయి. అవాంచనీయమైన ఈ ట్రెండు కొనసాగి ప్రతి రాజకీయ పార్టీ తన వాణి వినిపించటం కోసమంటూ ఒక పత్రిక పెడితే జనం తికమకపడిపొయి పిచ్చివాళ్ళైపోవటం ఖాయం.
ReplyDeleteసురేఖ -గారూ!నా నాలోకం బ్లాగులో సరసి గారి మీది మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు కూడా తక్కువ వారు కాదు.మీ బ్లాగ్ కి నేను నిత్య పాఠకుడిని.మీరు చిన్న చిన్న గల్పికలలో రకరకాల విషయాలమీద కొండొకోచో హాస్యంగా కొండొ కొచో వ్యంగ్యంగా రాసే తీరు , పాత విషయాలని కొత్త తరానికి చెప్పే శైలికి నేను ముగ్ధుడినయిన మాట నిజం.మూడ్ బాగాలేనప్పుడల్లా మీ బ్లాగ్ లోకి వెళితే చాలు మనసు తేలికయిపోతుంది. ఈ మంచి ముక్కలు మీకు వినిపించే అవకాశం నాకు ఇప్పటికీ దక్కినందుకు ఎంతో సంతోషంగా కూడా వుంది.మీ రచనలను నేను ఎప్పుడయినా నా బ్లాగ్ లో ఒకసారి పెట్టుకోవచ్చా ! తెలుపగలరు! నా ఈమెయిలు :karlapalem2001@yahoo.co.in
ReplyDelete