మీరు పత్రికలలో కార్టున్లు చూసినప్పుడు నాకూ బొమ్మలు వేయటం
వస్తే ఎంత బాగుండును అనిపిస్తుంటుంది కదూ? మీకు వచ్చినా బాపూ
గారిలా జీవం వుట్టిపడేటట్టు నా బొమ్మలూ లేవే అని అనిపుస్తూ వుండొచ్చు.
కార్టూను గీయాలనే ఆశక్తి వున్న చాలామంది కోసం బాపూగారు "బొమ్మలు
గీయండి" అనే సచిత్ర పుస్తకాన్ని వ్రాసారు. ఎమెస్కో విజయకుమార్ గారు
అందంగా ప్రచురించారు. కార్టూనిస్టులు, కార్టూన్ ఇస్టులూ తప్పక దగ్గర వుంచు
కోవలసిన మంచి పుస్తకం. ఎమెస్కో విజయకుమార్ గారు ఇలా అంటారు.
"ఇంత మంచి పుస్తకాన్ని మీకు అందించమని నాకు ఇచ్చిన బాపుగారికి
నమస్కారం పెడుతూ మీరు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకుంటారని
ఆశిస్తున్నాను. మీకు బొమ్మలేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి
ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది"
గురువుగారు శ్రీ బాపు తన పుస్తకంలో ఇలా వ్రాసారు. "నా దగ్గర ఎప్పుడూ స్కెచింగ్
పుస్తకం వుండేది. బీచికి వెళ్ళినప్పుడు-కాలేజీకి వెళ్తున్నప్పుడు, ట్రాంబండిలోనూ-
ప్రతి వేసంగి శలవులకీ మా నాన్నగారు మా పల్లెటూరికి తీసుకొని వెళ్ళినప్పుడు
ప్రయాణం చేసే రైలులో మనుషుల్నీ కబుర్లు చెప్పుకునే వాళ్ళనీ,పై బెర్తు మీద
పడుకున్న వాళ్ళనీ ,కాలక్షేపం బఠానీలు అమ్ముకునే వాడినీ, నీలాటి రేవుల
వద్ద కూర్చొని నీళ్ళుతెచ్చుకునే ఇల్లాళ్ళను,అందంగా నడుం వంచి బిందె ఆనించి
తలమీంచి చెయ్యివేసి పైన పట్టుకునే సొగసూ, కాళ్ళ పారాణీ, పట్టాలు,కడియాలు,
లోలాకులు,జడగంటలూ ఇలా అన్నీ వేసుకునే వాణ్ణి. ఇవన్నీ దరిమిలా పత్రికలకు
బొమ్మలేసినపుడు పనికొచ్చేవి."
ఈ పుస్తకంలో బిల్ వాటర్సన్, పీటర్ ఆర్నో, అహ్మద్, గోపులు,,హోకూసాయ్,
డెడినీ, హైనెస్,.ఆర్కే లక్ష్మణ్, ఎడ్మండ్ డులాక్,,హెర్గే( టిన్ టిన్), హాగర్త్ (టార్జాన్)
మొదలైన ప్రముఖ దేశ్ విదేశీ చిత్రకారుల చిత్ర రచనా శైలిని, తన కుంచె తో వేసి
చూపించారు.ప్రతి పేజీ వెనుకవైపు ఆ బొమ్మలను టిన్ట్ లో ముద్రించి పెన్సిల్ తో
అభ్యాసం చేసుకోవడానికి వీలు కలగించారు. ఎమెస్కో విజయవాడ వారు
ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఈ రోజే సొంతం చేసుకోండి.
అంధ్ర ప్రదేశ్ బాలల అకాడెమీ వారు ప్రచురించిన పుస్తకం అనుకుంటా - ఎ.వి.బి.ఎస్ ఆనంద్ అనే ఆయన వ్రాసిన "బొమ్మలు వెయ్యడం ఎలా" పుస్తకం ఒకటి ఉండేది...కానీ చాలా చిన్న పుస్తకం అది....అందులో మాటలు ఎక్కువ ఇలస్ట్రేషన్స్ తక్కువగా ఉన్నట్టు గుర్తు..., దానికి తోడు పాటలు కూడ ఉన్నాయి....మరి ఎమెస్కో - బాపు గారి ఈ పుస్తకమెలా ఉందో ఓ సారి వివరించండి సురేఖ గారు, మీకు సమయం దొరికినప్పుడే...
ReplyDeleteవంశీ మోహన్ గారు, బాపు గారి పుస్తకం గురించి విపులంగా
ReplyDeleteచెప్పాను. దాదాపు 255 పేజీలకు పైగా, పెద్ద సైజులో వున్న
ఈ పుస్తకం ప్రతి పేజీలోనూ వివరంగా బొమ్మలతో బాపూగారి
దస్తూరితో ప్రచురించారు. పుస్తకం ధర 160/-రూపాయలు.
emescobooks@yahoo.com కు వ్రాసి పుస్తకం తెప్పించు
కోవచ్చు.