RSS
Facebook
Twitter

Tuesday, 24 July 2012

చందమామ కు 66 ఏళ్ళు !!


                         


               ఈ నెలతో చందమామకు  65 ఏళ్ళు నిండి 66 ఏట అడుగుపెడుతుంది.
               మా ఇంట్లో చందమామను మొదటి సంచిక నుంచి కొంటున్నా జాగ్రత్త
               చేసుకున్నది మాత్రం 1953 నుంచే. అప్పటికి నావయసు పన్నేండేళ్ళు.
               మా నాన్నగారికి పుస్తకాలన్నా , పత్రికలన్నా ఇష్టం కాబట్టి అమ్మా,నాన్న
               కొనే పత్రికలతో బాటు మాకు "బాల", చందమామ" పత్రికలను కొనేవారు.
                     1953 నుంచి ప్రతి ఏడాది చందమామలను నాన్నగారు బైండింగు 
               చేయించారు. అప్పటి నుంచి వాల్యుములుగా నా దగ్గర వున్నాయి.


                        మహావీర్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ కుమారి ఐ. పద్మావతి నా దగ్గర ఉన్న
              చందమామల్తొ ప్రదర్శన ఏర్పాటు చేస్తాము అనగానే నేను అనందించాను
              కానీ ఎన్నో ఏళ్ళ క్రితం పుస్తకాలు ప్రదర్శనలో పెడితే చూడటానికి వచ్చిన
              పిల్లల్తో  వచ్చిన పెద్దలు పేజీలు తిరగేస్తుంటే ఎక్కడ చిరుగుతాయోననే
              భయంతో వద్దులెండి అన్నాను. అందుకు పద్మావతిగారు వాటిని గాజు
              తలుపులున్న అద్దాల పెట్టెలలో పెట్టి తాళాలు వేస్తాము అని హామీ ఇవ్వటం
              తో సరేనన్నాను. పిల్లల కంటే ఆ రోజు ఆ ప్రదర్శనను పెద్దలే ఆనందించారు.
              ఎందుకంటే ఈ కాలం పిల్లలవి కాన్వెంట్ చదువులు కాబట్టి చాలామందికి
              చందమామ తెలుగులో వున్నట్లే తెలియదు! ఆనాటి ప్రదర్శనను ప్రముఖ
              కధారచయిత శ్రీ పోరంకి దక్షిణామూర్తి ప్రారంభించారు. శ్రీ వేదగిరి రాంబాబు
              శ్రీ ఎండ్లూరి సుధాకర్ మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు.



                             చందమామకు నాటి అందాలు చిత్రా, యం.టీ.వీ. ఆచార్య, శ్రీ శంకర్ గారి
                             చిత్రాలే. అటుతరువాత చిత్రకారుల బృందంలో శ్రీ వడ్డాది పాపయ్య చేరారు.
                             ప్రారంభ సంచికకు శ్రీ చిత్రా బొమ్మ గీయగా అటుతర్వాత శ్రీ యంటీవీ.
                             ఆచార్య (భాగవత కధలు) శ్రీ శంకర్, వడ్డాది ముఖచిత్రాలు వేశారు.
                             చందమామ ఆర్ట్ బుక్ పేరున రెండు వాల్యూములుగా (Rs.1500/-)
                             ఆనాటి చిత్రకారుల వివరాలతో , వారు గీసిన వర్ణ చిత్రాలతో చందమామ
                             సంస్థ పుస్తకాలను విడుదల చేసింది. శ్రీ నాగిరెడ్డి, చక్రపాణి ల అభిమాన
                             ప(పు)త్రిక ఈనాడు బొంబాయి ప్రచురుణకర్తల చేతిలోకి వెళ్ళిపోయింది.
                             చందమామ ప్రియులందరికీ 66 వసంతాల పుట్టినరోజు శుభాకాంక్షలు. 

3 comments:

  1. అప్పటి ఆబాలలోకాన్నీ చంద్రుడిపై నెల నెలా విహరింపజేసిన మన తెలుగు నేలపై వెలసిన చందమామకు 66 వ పుట్టినరోజు శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. దొరికిన(వ)న్ని సంచికలు పదిలపరచిన మీకు బోలెడు అభినందనలు!

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About