పత్రికల పేజీలను తిప్పగానే ఎక్కువమంది పాఠకుల దృష్టి
పడేది మొదట కార్టున్లమీదే. ఆంధ్రపత్రిక కార్టూనిస్టులకు
మొదటి నుంచీ మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. 1931లోనే
తెలుగులో మొదటి కార్టూనిస్ట్ కీ"శే"తలిశెట్టి రామారావు
గారి బొమ్మలు ప్రచురించడం ప్రారంభించింది. శ్రీ బాపు,
శ్రీబాబు( కొలను వెంకట దుర్గాప్రసాద్), శ్రీ శంకు, శ్రీ బి.వి.
సత్యమూర్తి,శ్రీ జయదేవ్ మొదలైన ప్రముఖుల కార్టూన్లు
ఆంధ్ర సచిత్ర వార పత్రికలో పాఠకులను అలరించాయి.
ఈ రోజుల్లో సెల్లులో సొల్లు కబుర్లు బైటకూడా సభ్యత
పాటించకుండా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఎన్నె
ఎన్ని ప్రమాదాలు తెచ్చుకుంటున్నారో మనం ప్రతి
రోజూ చూస్తున్నాం. శ్రీ జయదేవ్ ఈ కార్టును లో
ఒకాయన ఇంటిల్లిపాదికీ సెల్ ఒకటి కొనిచ్చి తనకు
అడ్డులేకుండా పేకాట ఆడుతుండటం చక్కగా గీతల్లో
చూపించారు. శ్రీ సరసి, సెల్లో గట్టిగా మాట్లాడుతూ
తను ఊర్లో ఓ నాలుగు రోజులు ఉండటం లేదన్న
విషయాన్ని రోడ్డు మీదున్న ఓ దొంగ వినేటట్లు
అరవటం ఎంత తెలివి తక్కువ తనమో " మనమీదే
నర్రోయ్" లో నవ్విస్తూ హెచ్చరించారు.
స్వాతిలో సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ బాబు ( శ్రీ కొలను
వెంకట దుర్గాప్రసాద్) తెలుగులో ఇప్పుడు తరచుగా
వాడని బండి ర అక్షరంతో ఎంతో చక్కని కార్టూన్
వేశారో చూడండి. శ్రీ బాపు గారు ఆనందం పట్టలేక
" కార్టూనంటే ఎలా వుండాలి అంటే ఇలాగ ! బాబు
గారూ జోహార్ ! " అన్నారు.
శంకు గారు గీసిన టీవీ న్యూస్ రీడర్ కార్టూన్ ఎంత
బాగుందో చూడండి. శంకుగారి శ్రీమతి ఏఐఆర్ లో
న్యూస్ రీడరుగా పనిచేశారని గుర్తు. అలాగే ఇక్కడ
మీరు బ్నిం గారు కొత్త ఏడాదిలో శ్రీమతి నిర్ణయం,,
శ్రీ M.S.రామకృష్ణగారి లైబ్రరిలో పెద్దాయన దొంగాట,
కుమారి రాగతి పండరిగారు, శ్రీ చంద్రగారు చూపించిన
బద్దకిస్టు దంపతులు, మిడ్ నైట్ మసలా చూస్తూ
నిద్రపోయిన అమ్మానాన్నలను సీరియల్ ఐపోతుంది
లేవండి అంటున్న బుడతడు మనల్ని కిసుక్కున
నవ్విస్తాయి. ఇక ఆఖరుది ఆంద్రపత్రిక వీక్లీలోని నా
మొదటి కార్టూన్, ఈ కార్టూన్ నవ్వించిందో లేదో కాని
వాడు మాత్రం సుత్తి దెబ్బతో కెవ్వు మంటున్నాడు.
కార్టూనిస్టులకు, వాటిని ప్రచురించిన పత్రికలకు
కృతజ్ఞలతో.

కార్టూనులు నవ్వించడానికే కాదు ఈ నాడు కట్నాల
పేరిట సాగుతున్న దురాచారాలపై కూడా సున్నితంగా
చురకలు అంటిస్తాయనడానికి శ్రీ బాపు, శ్రీ బాలి గీసిన
ఈ కార్టూన్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి కదా
ఈ రోజుల్లో సెల్లులో సొల్లు కబుర్లు బైటకూడా సభ్యత
పాటించకుండా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఎన్నె
ఎన్ని ప్రమాదాలు తెచ్చుకుంటున్నారో మనం ప్రతి
రోజూ చూస్తున్నాం. శ్రీ జయదేవ్ ఈ కార్టును లో
ఒకాయన ఇంటిల్లిపాదికీ సెల్ ఒకటి కొనిచ్చి తనకు
అడ్డులేకుండా పేకాట ఆడుతుండటం చక్కగా గీతల్లో
చూపించారు. శ్రీ సరసి, సెల్లో గట్టిగా మాట్లాడుతూ
తను ఊర్లో ఓ నాలుగు రోజులు ఉండటం లేదన్న
విషయాన్ని రోడ్డు మీదున్న ఓ దొంగ వినేటట్లు
అరవటం ఎంత తెలివి తక్కువ తనమో " మనమీదే
నర్రోయ్" లో నవ్విస్తూ హెచ్చరించారు.
స్వాతిలో సీనియర్ కార్టూనిస్ట్ శ్రీ బాబు ( శ్రీ కొలను
వెంకట దుర్గాప్రసాద్) తెలుగులో ఇప్పుడు తరచుగా
వాడని బండి ర అక్షరంతో ఎంతో చక్కని కార్టూన్
వేశారో చూడండి. శ్రీ బాపు గారు ఆనందం పట్టలేక
" కార్టూనంటే ఎలా వుండాలి అంటే ఇలాగ ! బాబు
గారూ జోహార్ ! " అన్నారు.
శంకు గారు గీసిన టీవీ న్యూస్ రీడర్ కార్టూన్ ఎంత
బాగుందో చూడండి. శంకుగారి శ్రీమతి ఏఐఆర్ లో
న్యూస్ రీడరుగా పనిచేశారని గుర్తు. అలాగే ఇక్కడ
మీరు బ్నిం గారు కొత్త ఏడాదిలో శ్రీమతి నిర్ణయం,,
శ్రీ M.S.రామకృష్ణగారి లైబ్రరిలో పెద్దాయన దొంగాట,
కుమారి రాగతి పండరిగారు, శ్రీ చంద్రగారు చూపించిన
బద్దకిస్టు దంపతులు, మిడ్ నైట్ మసలా చూస్తూ
నిద్రపోయిన అమ్మానాన్నలను సీరియల్ ఐపోతుంది
లేవండి అంటున్న బుడతడు మనల్ని కిసుక్కున
నవ్విస్తాయి. ఇక ఆఖరుది ఆంద్రపత్రిక వీక్లీలోని నా
మొదటి కార్టూన్, ఈ కార్టూన్ నవ్వించిందో లేదో కాని
వాడు మాత్రం సుత్తి దెబ్బతో కెవ్వు మంటున్నాడు.
కార్టూనిస్టులకు, వాటిని ప్రచురించిన పత్రికలకు
కృతజ్ఞలతో.
ఒక వ్యాసంలో చెప్పే విషయాన్ని ...... ఒక చిన్న కార్టూన్ ద్వారా చక్కగా నవ్విస్తూ చెప్పవచ్చు.
ReplyDeleteచక్కటి పోస్టును అందించిన మీకు ధన్యవాదాలండి.