గోదావరి అందాలు ఒక్కో చోట ఒక్కోలా అందాలు కురిపిస్తాయి.
బాపు రమణగార్ల చిన్ననాటి ఆప్త మిత్రుడు శ్రీ బివి.యస్
రామారావు గారు ( ఆయన్ని మిత్రులిద్దరు సీతారాముడుఅని
ఆప్యాయంగా పిలుచుకుంటారు) " గోదావరి తీరం ఆలంబనగా
అందమైన 13 కధలు ఆయన ఆంధ్రజ్యోతి లో వ్రాసారు..అవి
" గోదావరి కధలు " పేరిట పుస్తక రూపంలో మన ముందుకు
వచ్చాయి.
శ్రీ ముళ్లపూడి వెంకటరమణ ముందు మాట వ్రాస్తూ ఒక చోట
ఇలా అంటారు. " ధవళేశ్వరంలో ఇంజనీరుగా పనిచేస్తూ ఒక
సారి బురదలా కనిపించిన ఊబిలోకి దూకేసి రెండు ప్రాణాలు
కాపాడి - తను ఖర్చుకాబోయాడు. ఈకధలు రాయటం కోసం
ఆ తల్లి వీడిని ఒడ్డెక్కించింది. ఈకధలు గోదారికి అక్షరాను
వాదాలు. ఇవి బాల గోదారిలా పరవళ్ళు తొక్కుతాయి.పడుచు
గోదారిలా ప్రేమను పంచి పెడతాయి.": చివరగా ఇలా అంటారు.
"నాకు వీడంటే అసూయ-----
టెలుగు మాత్రం తెలిసిన వారికి - ఆంగ్లంలో ఐయాం
జెలస్ "
గుండెల్లో గోదావరి కధలో అప్పుడే పెళ్ళయిన నూతన వధూ
వరులు ఒక్కసారిగా వచ్చి ముంచెత్తిన గోదారిలో ఎలా కొట్టుకు
పోతూ దగ్గరయ్యారో చదివితే మనమూ ఆకధలో పూర్తిగా
వారితో బాటు మునిగి తేలుతాం. ఎసరూ అత్తెసరూ కధలో
వర్ధనమ్మ బామ్మగారు వరదగోదారిలో పుల్లలు ఏరుకొచ్చే
సత్తిగాడు పుల్లలకోసం వెళ్ళి ఎంతకీ రాక పోయేసరికి
ఆవిడ ప్రాణం ఎంత తల్లడిల్లిందో, చివరికి వాడిని చూసిన
తరువాత వాడికోసం బెంగ పడి ప్రాణాన్ని ఎలా వదిలిందో
సీతారాముడు గారి కధ చదివితే కళ్ళు చెమరుస్తాయి
అద్దరి ఇద్దరి కధలో ఫారెస్ట్ ఆఫీసరు చేసిన నిర్వాకం రాత్రి
ఇంటికి తిరిగొచ్చిన తరువాత జరిగిన సంఘటన మన కళ్ళను
అతని కళ్ళతో బాటు చెమ్మగిల్లేలా చేస్తాయి. ఇలా ప్రతి ఒక్క
కధా పాఠకుల్ని మైమరపిస్తాయి గత నెల జూన్ 30 న
హైద్రాబాదు హాసం క్లబ్ నూరవ కార్యక్రమం శ్రీ ముళ్లపూడికి
అంకితం చేసిన సంధర్భంలో శ్రీ బివియస్ రామారావుగారిని
సత్కరించారు. ఆనాటి సభలోవారిని కలుసుకొని నేను
తయారు చేసిన బాపు రమణగార్ల ఆల్బమ్స్ లో ఒకటి
చూపించే అదృష్టం కలిగింది. ఎమెస్కో ప్రచురించిన ఈ
గోదావరి కధలు కధాప్రియులంతా తప్పక చదవాలి.
మంచి పుస్తకం గురించి తెలిపారు, బాపు గారు ఎంతో సింపుల్ గా గీసిన ఆ బొమ్మలు గోదావరిని కొన్ని గీతల్లోనే చూపిస్తున్నాయి, అది ఆయనగారికే చెల్లు...
ReplyDeletenice post
ReplyDelete