ఉ(త్త)మ సలహాలు
మనము ఇష్టపడి ఏదైనా వస్తువుకొనుక్కొని ఇంటికి వచ్చిన ఏ మిత్రుడికో
చూపించామనుకోండి, "ఆ! ఇది కొన్నావా? మాకు తెలిసినవాళ్ళు ఇదే కొన్నారు.
రెండు రొజుల్లో పాడైపోయింది" అంటూ కామెంట్ చేస్తుంటారు.మనకు వెంటనే
మనసు చివుక్కు మంటుంది. ఒక వేళ కొనేముందు అలాటి సలహాలు (నిజమై
తేనే ) ఇవ్వచ్ఛు కాని ఎంతో ఉత్సాహంగా కొన్న వస్తువు చూపించినప్పుడు
ఇలాటి ఉత్త సలహాలు ఇచ్చే అలవాటు వున్నవాళ్ళు మానుకుంటే మంచిదని
నా అభిప్రాయం.మీరేమంటారు!
మీరు చెప్పినది నిజమ౦డీ
ReplyDeleteమీరెప్పుడూ బాగానే చెప్తారండి గురువుగారూ. ఈ జాబితాలో, వాస్తు పిచ్చిగాళ్ళను కూడ చేర్చాలి. స్నేహితుడనో, బంధువనో మనం గృహప్రవేశానికి పిలిస్తే వచ్చి మన్ని ఆశీర్వదించి మనతో పాటు ఆ సంరంభంలో పాలుపంచుకోకుండా కొందరు మనం కొత్తగా కట్టుకున్న ఇల్లంతా కలియతిరిగి వాస్తు ప్రకారం (అటే వాడికి తెలుసు అనుకుంటున్నది అన్నమాట) ఇది ఇక్కడ ఉండకూడదు, ఈ మూల కొంచెం వదలాలి అని ప్రవచిచటం మొదలుపెడతారు. మనం ఏమైపోవాలని వాళ్ళ ఉద్దేశ్యమో తెలియదు. ఆ మర్నాడే ఇల్లంతా పగలగొట్టి వాడు చెప్పిన ప్రకారం మార్పులు చెయ్యాలని వారి అభిప్రాయమేమో!! మరి తెలియదు.
ReplyDeleteమీరు చెప్పినట్టుగా, కొంతమంది తరహానే అంత. విని ఊరుకోవటం తప్ప మరేమీ చెయ్యలేము.