నేను నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను,అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లొ దొరుకుతాయి కాబట్టి, అలానే నా పాత పుస్తకాలు కూడా ఎవ్వరికీ ఇవ్వను! ఏమంటే అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి అనే నా మాటలు ఛాలా మంది మిత్రులకు కోపంతెప్పిచ్చాయి! అయినా నేను నా మాటకే కట్టుబడి ఉంటున్నాను . అదే మాట పుస్తకప్రియులందరు పాటించాలని నా కోరిక
నేను చాలా కాలం క్రిందట 1941 సం" ఆంధ్రపత్రిక దినపత్రిక (నే పుట్టిన ఏడాది) సంపాదించాను. ఒక బ్యాంకు మితృడు మా ఇంట్లో అది చూసి చదివి ఇస్తానని తీసుకొని ఇవ్వలేదు సరికదా నే పేపర్ కోసం అడిగినప్పుడల్లా "ఏమిటి?తాతల్నాటి పేపర్ కోసం గొడవ చేస్తున్నావు, నిన్నటి పేపర్కు ఈ రోజు విలువ లేదు.పాత పేపర్లతో బాటు మా వాళ్ళు అమ్మేసారు, సారీ" అన్నాడు.అప్పటి నుంచి ఎవ్వరికి నా పుస్తకం కానీ పత్రికలు కానీ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పంటారా?
నా దగ్గర 1914 "ది ప్రాక్టీస్ ఆఫ్ ఆయిల్ పెయింటింగ్ ", 1928లో ప్రచురించిన స్టడీస్ ఇన్ ది సైకాలజీ ఆఫ్ సెక్స్ ,ఆంధ్రగ్రంధమాల (ఆంధ్రపత్రిక,1951) కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో తెలుగు సూరంపూడి సీతారాం అనువాదం, 1953 నుంచి చందమామలు, 1955 లో వెలువడిన విచిత్రకవలలు సీరియల్ నవల,బాపురమణ గార్ల పుస్తకాలు, ఆర్కేలక్ష్మన్, బాపు, జయదేవ్, ఈనాడు శ్రీధర్, సరసి, రాగతిపండరి కార్టూన్ పుస్తకాలు, 1944 రీడర్స్ డైజస్ట్ (మా నాన్నగారు మొదటి సారికొన్న ఆయన అభిమాన పత్రిక) 1954 ఆంధ్ర వార పత్రిక (దసరా పిల్లల ప్రత్యేక సంచిక,ఇందులో మా చెల్లి కస్తూరి వేసిన "నేను మా సంగీతం మేస్టారు" బొమ్మకు బహుమతి వచ్చింది),బుక్ ఆఫ్ నాలెడ్జ్ పుస్తకాలు ఎన్నో వున్నాయి.
ఎరువువెళ్ళిన పుస్తకం తమాషా: ... అమెరికాలో లొరెజొ బురోస్ 1849లో పార్లమెంట్ సభ్యుడుగా వుండగా ఒక పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకొన్నాడట! ఆయన వారసులు 140 ఏళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని జాగ్రత్త గా లైబ్రరీ కి చేర్చారట! ఎంత మంచి వాళ్ళో!!
>>>నేను చాలా కాలం క్రిందట 1941 సం" ఆంధ్రపత్రిక దినపత్రిక (నే పుట్టిన ఏడాది) సంపాదించాను. ఒక బ్యాంకు మితృడు మా ఇంట్లో అది చూసి చదివి ఇస్తానని తీసుకొని ఇవ్వలేదు సరికదా నే పేపర్ కోసం అడిగినప్పుడల్లా "ఏమిటి?తాతల్నాటి పేపర్ కోసం గొడవ చేస్తున్నావు, నిన్నటి పేపర్కు ఈ రోజు విలువ లేదు.పాత పేపర్లతో బాటు మా వాళ్ళు అమ్మేసారు, సారీ" అన్నాడు.అప్పటి నుంచి ఎవ్వరికి నా పుస్తకం కానీ పత్రికలు కానీ ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. తప్పంటారా?
ReplyDeleteఅస్సలు తప్పులేదు.
మొహమాటానికి పోయి చాలా విలువైన పుస్తకాలు, సీడీలు పోగొట్టుకున్నాను. మొహమాటాన్ని వదులుకోలేక పుస్తకాలు కొనే అలవాటుని తగ్గించుకున్నాను. మీ నిర్ణయంలో ఏమీ తప్పులేదు. అంత ధృఢంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. ఏమైనా మీ అభిరుచికి అభినందనలు.
ReplyDeleteమీ లైబ్రరీ చాలా బాగుందండి.
ReplyDeleteI completely support you Guruvugaroo.
ReplyDelete