RSS
Facebook
Twitter

Saturday, 24 October 2009

బాపూ రమణీయం

బాపు రమణ గార్ల తో నా పరిచయం




నాకు కార్టూన్లను గీయాలనే అభిలాషను,హాస్య రచనలు చదవటం,హాస్యంగా మాట్లాడటం నేర్పింది ఇద్దరు మహానుభావులు! వారు ఒకరేమో శ్రీ లక్ష్మీనారాయణ,మరొకరు శ్రీ వెంకటరమణ.1956 నవంబరు నుంచి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర వార పత్రికలో వచ్చిన "బుడుగు-చిచ్చుల పిడుగు" (అప్పుడు నాకు 15 ఏళ్ళు)నా లాంటి అశేష పార్ఠకులను విశేషంగా ఆకర్షించింది.బుడుగు సీరియల్ పూర్తయ్యే వరకు ఛదువరులెవరికీ రచయిత ఎవరో తెలియదు! ముగింపు లో ఇది రాసి పెట్టినవాడి పేరు ముళ్లపూడి వెంకట రమణ, బొమ్మలు వేసినవాడి పేరు బాపు అని వేసారు. ఆ నాటి నుంచే బాపురమణల అభిమానిగా మారి పోయాను. రమణగారి పుస్తకాలన్నీ మా నాన్న గారి చేత కొనిపించుకొనే వాడిని.మా నాన్న గారు కూడా పుస్తకాలను అభిమానించేవారే కావటం నేను చేసుకున్న అదృష్టం! 2005 లో రమణగారి పుట్టిన రోజుకి స్వంతంగా తయారు చేసిన జన్మదిన శుభాకాంక్షలు పంపాను.అందగానే ఆయన దగ్గర నుంచి ఫోనొచ్చింది.





మా పెద్దమ్మాయి మాధురి అత్తవారివూరు చెన్నై కాబట్టి ఈ సారి వచ్చినప్పుడు కలుస్తానని ఆనందంగా చెప్పాను.అక్టోబర్లో ఆయన ఇంటికి మా అమ్మాయితో కలసి మొదటి సారి వెళ్ళాను. బాపు ,రమణగార్లను అలా ప్రత్యక్క్షంగా కలవడం,నేనేనాడో చేసుకున్న పుణ్యంగా భావించాను.ఆ నాటి నుంచి ప్రతి ఏడాది రెండు సార్లు కల్సి వస్తూనే వున్నాను.మొదటి సారి వెళ్ళినప్పుడు కొద్ది సేపయిన తరువాత బాపుగారు వర్కు చేసుకోవాలని క్రిందకు వెళ్ళారు. నేను శ్రీ రమణ గారి సంతకం ముళ్లపూడి సాహితీ సర్వస్వం పుస్తకం మీద తీసుకుంటూ "బాపు గారి సంతకం తీసుకోవటం మరచిపోయా" అని అనగానే పుస్తకం తీసుకొని అచ్చు బాపు గారిలా సంతకం చేసి క్రింద బ్రాకెట్ లో 'ఆధరైజ్డ్ ఫోర్జరీ' అని వ్రాయటం కొసమెరుపు!! కొంచెం పేరు రాగానే ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళనే ఏదో కొత్త ముఖాన్ని ఛూస్తున్నట్లు ప్రవర్తించే ఈరోజుల్లో బాపు రమణ లాంటి మంచి మనసున్న మనుషులున్నందుకు ఆ భగవానునికి నమోవాకాలు. వారి తో నా మరికొన్ని అనుభూతులు మరోసారి!!

2 comments:

  1. గురువుగారూ,

    ఇప్పుడు మీరు వ్రాస్తున్న జ్ఞాపకాలతో వచ్చింది మీ బ్లాగ్గుకి అందం.

    ReplyDelete
  2. సురేఖ గారూ !
    అపూర్వమైన ఫొటోలు. పది కాలాల పాటు పదిల పరదు కోవలసినవి . మీ అనుమతి లేకుండా చిన్న కలర్ కరెక్షన్ చేసాను. క్రింది లింక్ నుండి డౌనులోడు చేసుకుని చూడండి. నచ్చకపో్తే క్షమించేయ్యండి.
    http://www.telugu.org.in/photo/albums/surekha-with-bapu-and-ramana

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About