అవునండి ! ఇలా ఏటా తగుదునమ్మా అంటూ మరో ఏడాది వచ్చేస్తుంది
ఏవేవో ఎన్నెన్నో కొత్త ఆశలు పుట్టిస్తూ. ఈ జనవరి ఒకటి అనగానే కొత్త
ఉత్సాహం. అర్ధరాత్రి పన్నెండవగానే కేకలు,కేరింతలూ, మత్తులూ దాంతో
చేసే గ "మ్మత్తు" లూ ! చాలా కాలం క్రితం కొత్త ఏడాది అనగానే కేలండర్
సేకరణ ప్రారంభించేవారు. ఇప్పుడు ఆమోజు తగ్గిందనిపిస్తుంది. మత్తు
మందుల కంపెనీల వాళ్ళు మత్తెక్కించే భామల ఫొటోలతో విడుదల చేసే
కాలెండర్లకు భలే గిరాకీ. మా చిన్నతనంలో CIBA కంపెనీ వాళ్ళు రవి
వర్మ దేముడు బొమ్మలతో పెద్ద సైజు కాలెండర్లు వేసేవారు. శ్రీ భమిడిపాటి
రాధాకృష్ణ గారు (ప్రఖ్యాత నాటక, సినీ రచయిత) 45 B.C. నుంచి
5555 A.D వరకు కాలెండరును తయారుచేశారు. ఈ అద్భుతమైన
పుస్తకంలో 45BC నుంచి మనకు ఏ ఏడాదిలోనైనా ఆనాటి నుంచి ఈనాటి
తరువాత కాలం వరకు అంటే 5555 AD వరకు రోజును, వారాన్ని సరిగ్గా
తెలుసుకోవచ్చు.
కాలెండరులోని తేదీల కంటే బొమ్మకే మనవాళ్ళు ఎక్కువ ప్రాధాన్యమిస్తారని
చెబుతూ బాపుగారు కార్టూన్లు గీశారు. ఈ రోజు రోడ్డు మీదకు రాగానే ప్రతి
ఒక్కరూ హాపీ న్యూ ఇయరంటూ పలకరిస్తూనే వుంటారు. ఇక ఈరోజు
అధికార్ల ఇళ్లన్నీ పళ్లతో, పూలతో నిండిపోతాయి నేను శ్రీకాకుళం ఎస్బీఐ
లో 1963లో ఉద్యోగంలో చేరినప్పటి కొత్తలో మాకు బ్రాంచి మేనేజరుగా
గౌరీనాధశాస్త్రి గారనే వారుండే వారు. ఆయన ఇంటికి కస్టమర్లు ఒకటవ
తేదీ పూలూ, ఫలాలు తీసుకొని వెళ్తే ," నాకు తెచ్చారు, అసలు కౌంటరులో
మీకు పనిచేసిపెట్టేది స్టాప్ కదా వాళ్ళకీ ఇచ్చారా? " అని అడిగే వారు. ఈ రోజుళ్ళొ
అలాటి వ్యక్తులు చాలా అరుదు. మరునాడు ఆయనకు వచ్చిన పళ్ళన్నిటిని
బ్యాంకుకు తెచ్చి స్టాఫందరికీ పంచె పెట్టేవారు. ఇది నాకుఈనాటికీ బాగా
గుర్తుండి పోయింది.
ఎప్పుడో దొరలనాటి ఈ కొత్త సంవత్సరం ఆచారం మనం ఇంకా పాటించడం
చిత్రమే ! ఈరోజు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు, గుళ్ళూ కిటకిటలాడుతూ
ఉంటాయి. అసలు మన సంప్రదాయం ప్రకారం మన కొత్త సంవత్సరం
శ్రీ నందననామ సంవత్సరం మార్చి 23 తేదీన మొదలవుతుంది. ఆకాలంలో
వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. లేత మామిడి చిగుల్లు తింటూ
కోకిలలు కుహూ కుహూ రావాలుచేస్తాయి. ఆనాడు తినే తీపి చేదు పులుపు
ఇలా అన్ని రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడి ఆరోగ్యదాయకం. మరి
మనం జనవరిలో చేసుకొనే కొత్తసంవత్సరం నిద్రలేకుండా అర్ధరాత్రివరకూ
రోడ్లపై చలిలో తిరుగుతూ,(నిద్ర) మత్తులో తూగుతూ కేకల్తో నిద్రపొయేవాళ్ళకు
నిద్రాభంగం చేస్తూ, ఇంటికి పొద్దుపోయినా తిరిగిరాని పిల్లలకోసం ఆతృతగా
ఎదురుచూసే పెద్దలను భయపెడుతూ గడిపే కొత్త సంవత్సరం ! కానీ మనం
ఒక విధంగా అదృష్టవంతులం. మనం రెండు కొత్త సంవత్సర పండుగలను
చేసుకుంటున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కోయిలా పాడవే, కేలండరు కార్టూన్లు శ్రీ బాపుగారి సౌజన్యంతో.
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteఅప్పారావు గారూ !
ReplyDeleteమంచి విశేషాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
నూతనోత్సాహం ( శిరాకదంబం )
గురువుగారూ...
ReplyDeleteమీరు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. యుగాది గురించి తెలీదు కానీ మనం ఆంగ్ల వత్సరాదికి చెలరేగిపోతాం.
ఏది ఏమైనా కానీ... కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకోక తప్పదు కదా.
happy new year
ReplyDeleteబాగా చెప్పారండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteHappy new year andi...
ReplyDeletehappy new year
ReplyDeleteఅందరికీ (విదేశీ)నూతన సంవత్సర శుభాకాంక్షలు !
ReplyDelete