ఇలా కోడికధ చెప్పడానికి కారణం ఈ సంక్రాంతి పండుగ పేరు చెప్పి మన
తెలుగు న్యూస్ చానళ్ళన్నీ కోడి కబుర్లే చెప్పాయి. అదేనండి కోడి పందాల
గురించి ఒక చానెల్ కు పోటీగా పందేలుకట్టి మరీ చూపించాయి. నాకు
పకోడీలంటే తినడానికి ఇష్టం , కోళ్ళంటే మాత్రం చూడటానికి ఇష్టం. అన్ని
జంతు పక్షి జాతుల్లాగే మొగ కోళ్ళు మెరిసిపోయే రంగుల్తో, తలమీద
ఓ కిరీటం మెడకో నెక్ టైలాటి ఎర్రటి అలంకారంతో చూడటానికి చాలా
అందంగా వుంటాయి. ఎత్తైన పాకలు , పందిల్లు ఎక్కి కొక్కురోకో అంటూ
మెడను చాచి ఒంచుతూ అరుస్తూమానవుల్ని మేలుకొలుపుతాయి.
అదేమిటో పాపం పుట్టక ముందే ఆ జనాలకు ఆహారమయ్యే జీవికూడా
ఆ కోడే ! ఉదయాన్నే, ఇప్పటిలా అలారం టైంపీసులు లేనప్పుడు (ఇప్పుడు
అలారానికీ సెల్ ఫోన్లే) కోడే దిక్కు ! అందుకే ఆకాలంలో వెకువనే లేవడం
అని చెప్పటానికి కోడికూయగానే లేస్తాము అని చెప్పేవారు. ఇంద్రుడు అలా
కోడి రూపమెత్తి తెల్లారకముందే కూసి తన బ్రతుకును శాపంతో తెల్లారించు
కున్నాడు.
కోడి పేరు చెప్పగానే మేం చిన్నప్పుడు చందమామలో చదువుకున్న"ఎందుకో
తెలుసా ? " అన్న శీర్షికలో కోడి అస్తమానం కాళ్ళతో నేలను కెలుకుతుంది
ఎందుకో తెలుసా ? అన్నకధ జ్ఞాపకం వచ్చింది. అసలు గద్దలూ కోళ్ళూ చాలా
స్నేహంగా వుండేవట ! ఒకసారి కోడి గద్దతో "మీరు ఎంతో ఎత్తుకు ఎగిర
గలరు. మీతో షికారుగా ఎగరాలంటే మాకు రెక్కలున్నా ఎగరలేము"
అందట. అప్పుడు గద్ద కొన్ని ఈకలు, ఓ సూది ఇచ్చి "వీటితో ఈ ఈకలను
మీ రెక్కలుకు కుట్టుకోండి. అప్పుడు మీరూ మాలాగే ఎగరగలరు" అంది.
సరే అని తీసుకొని కోడి సూదిని ఎక్కడో పారేసుకుంది. సూదికోసం వచ్చిన
గద్ద సూదిపోయిందని తెలుసుకొని అప్పటి నుంచి కోళ్ళపై విరోధం పెంచు
కొన్నాయట. అప్పటినుంచి ఇప్పటి దాకా సూది వెతికి గద్దలకిచ్చేద్దామని
నేలను కోళ్ళు కెలికుతూ వెతుకుతుంటాయట!
నాన్ వెజ్లు కలిపి హోటల్లు వుంటున్నాయి కానీ మా చిన్నప్పుడు నాన్ వెజ్
హోటళ్ళు సెపరేటుగా వుండెవి. వాటికి మిలట్రీ హోటల్ అనీ , రాజుల
హోటళ్లనీ పేర్లుండేవి.
. ఒక సారి మా మితృణ్ణి కోడి జాయింటు భోజనం అంటుంటారు.
, అంటే ప్రక్క కోడిని కూర్చోబెట్టి దాంతో పాటు మనకీ భోజనం
పెడతారా అని నవ్వుతూ అడిగా ! ఇంకేం అలా కార్టూనేసేయ్ అన్నాడు.V
కూసింది, కొక్కొరోకో కన్నె కోడి, కోడి ఒక కోనలో పుంజుఒక కోనలో,
బంగారు కోడిపెట్ట, ఇక "దొంగరాముడు "సినిమాలో సావిత్రి, విలన్ ఆర్.
నాగేశ్వరరావుతో పాడిన " రావోయి మాఇంటికి... నంజుకోను అరకోడి
కూరన్నది" అన్న పాట, అన్నీ హిట్లే !!కోళ్లని కుక్కుటాలు అని కూడా
అంటారు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో కుక్కుటేశ్వర ఆలయం
వుంది కుక్కుటేశ్వరుడు స్వయంభూలింగము. ఈ లింగము కుక్కుటాకారంగా
వుంటుంది ! ఈ శివ లింగానికి రెండు వైపులా రెక్కలు స్పష్ఠంగా అగుపిస్తాయి.!
ఇంత సేపూ కోడిమీద వ్రాస్తుంటె పాపం కదలకుండా కూర్చుంది. ఇంకా
వదలకపొతే జీవహింసవుతుంది !!
సూది ఎప్పుడు దొరికేనో???
ReplyDeleteకెలుకుడు ఎప్పుడు ఆగునో?:-)
అప్పారావుగారూ,
ReplyDeleteనమస్కారం. ఈ టపా పడి పక్షం దాటిపోతోంది. మీ బ్లాగు మొదలుపెట్టినప్పట్నుంచి ఇంత విరామం ఎప్పుడూ చూడలేదు. అంతా బాగే కదా?
భవదీయుడు
వర్మ
డివియస్.అబ్బులుగారికి, మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఈ మధ్య కొంత బిజీ, మరికొంత సోమరితనం జోడుగా వచ్చిబ్లాగుకు నన్ను
ReplyDeleteదూరం చేశాయి. ఇకనుండి మీముందుకు తరచు రా(య)వడానికి ప్రయత్నిస్తాను