ఏవిటో మన పండగలకీ పెద్దరికాలుంటాయి. మనకి ఎన్నో పండగలున్నా వరుసగా
ఓ మూడ్రోజులు సందడిగా సాగే పండగ ఇంగ్లీషువాళ్ళ కొత్త ఏడాదిలో వచ్చే సంక్రాంతే!
అందుకే ఈ పండగను పెద్దపండుగ అంటారు. పల్లెళ్ళో ,పట్టణాల్లో సరదాగా సాగే ఈ
పండుగే పండుగ ! కొత్త అళ్ళుల్లు అత్తవారింటికి వచ్చేది , ప్రతి ఇల్లూ ముంగిట ముత్యాల
ముగ్గుల (చిత్ర)కళలతో కలకలలాడే పండుగ !
శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు "ఇద్దరమ్మాయిలూ-ముగ్గురబ్బాయిలు" కధలో
సంకురాత్రి గురించి ఇలాఆ పండగంత అందంగా చెప్పారు.
" తెల్లవారిందనే దురభిప్రాయంతో కోడికూసింది.కాకులు మేలుకున్నాయి.ఈగలు
డ్యూటీకి బయలుదేరాయి.దోమలు విశ్రాంతికి ఉపక్రమించాయి.
దాలిగుంటలో పిల్లులు
బద్దకంగా లేచి వళ్ళు విరుచుకొని బయటకు నడిచాయి. ఆవులు అంబా అన్నాయి.
పువ్వులు వికసించాయి. నవ్వడం అలవాటయిన పిల్లలు చక్కగా నవ్వారు. ఉత్తి
పుణ్యానికి ఏడవటం వృత్తిగా గల పిల్లలు చక్కగా ఏడవటం మొదలు పెట్టారు.కొద్దో
గొప్పో పాడిగల ఇళ్ళలో అమ్మమ్మలూ, బామ్మలూ భూపాల రాగచ్చాయలో "అమ్మా
గుమ్మడేడే " అని పాడుతూ మజ్జిగ చిలుకుతున్నారు. ముద్దబంతి పూలలా బొద్దుగా
పచ్చగా ఉన్న అమ్మాయిలు పంచకళ్యాణి గుర్రాలకుమల్లే శోభిస్తూ కళ్ళు నులుపు
కుంటూ, అమ్మల చేతా, బామల చేతా సున్నితంగా చీవాట్లు తింటూ యిళ్ళు కల
కలలాడేలా తిరుగుతున్నారు. కొందరు గుమ్మాలలో పేడనీళ్ళు చల్లి, సంక్రాంతి
ముగ్గులు తీర్చిదిద్దుతూ, ముగ్గులంత సజీవంగా నవ్వుతున్నారు "
!
చదువుతుంటే ఓ మాంచి బాపు సినిమా తెరపై చూస్తున్నట్లు వుంది కదూ !!
పూర్వం పట్టణాల్లో కూడా గంగిరెద్దులూ, హరిదాసులూ అగుపించేవారు. ఇప్పుడు
అపార్టుమెంటాలిటీ వచ్చాక ఇంటికి ఒకటే ముగ్గు ! అదీ కాపలాదారు భార్యామణికి
వస్తేనే ! ఈ ఏడాది స్టారు హోటల్ల వాళ్ళు(మా రాజమండ్రిలో కూడా) ఇలా సంకురాత్రి
సంబరాలను న్యూఇయర్ ఈవ్ లా ఏర్పాటు చేయడం, గంగిరెద్దులు, హరిదాసులతో
సంక్రాంతి వాతావరణాన్ని సృష్టించడం హర్షదాయకమే ! మన వాళ్ళు పుణ్యక్షేత్రలకు
వెళ్ళి ఎంతెంతో ఖర్చు చేస్తుంటారు కాని ఏడాదికోసారి వచ్చే హరిదాసులకు ఓ
గుప్పెడు బియ్యాన్ని దానం చేయలేకపోతున్నారు. చేయాలని వున్నా ఎక్కడో
ఏ ఏడో అంతస్ఠులో వున్న ఇల్లాలు దిగొచ్చి వెయ్యడం కష్టమేకదా ! అందుకే ఆ
హరిదాసులూ కనలేమురా అంటూ కనుమరుగయ్యారు.
భోగి పండుగనాడు ముఖ్యమయింది భగవంతునికి సమర్పించే నైవేద్యము.
రైతులింటికి చేరిన మొదటి పంటను పొంగలిగా భగవానునికి అర్పించుకుంటారు.
భోగినాడు వేకువనే కర్రలను మంటలరూపంలోఆహుతిరూపంగా దానంచేస్తే
మంచి జరుగుతుందని చెబుతారు. అలానే ఇళ్లల్లో పేరుకుపోయిన పాతకర్ర
సామాను అలా వదిలించుకునేవీలు. ఆవు పేడతోచేసినపిడకలతో కూర్చిన
దండలను ఆ మంటల్లోకాలిస్తే వచ్చే పొగ ఆరోగ్యానికి మంచిదని ఈ సాంప్రదాయం
వచ్చింది. మంచి భర్త లభించాలని అమ్మాయిలు గొబ్బిళ్ళు పేడతో పెడతారు.
భోగి మంటలు చలిని పోగొడుతూ చీకట్లను తరిమేస్తూ మన జీవితాల్లొ
కొత్త వెలుగులు నింపుతుంది. ఆ రోజుల్లో ఇలా భోగి మంటలు వేయడానికి
కొద్దిగానైనా మట్టి వున్న స్థలం వుండేది. ఈనాడు అంతా తారు, సిమెంట్ రోడ్లు.
అసలే అంతంత మాత్రంగా తారు, సిమెంటు తక్కువగా అవినీతి ఎక్కువగా
వేసిన రోడ్లు ఈ భోగిమంటలతొ మరింత గుంటలు పడిపోతున్నాయ్ ! పిల్లలకు
మంచి భవిష్యత్తుకలగాలని భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఈ పండుగదే.
అడుగడుగునా మన సాంప్రదాయాల్ని గుర్తు చెసే పెద్ద పండుగ సంక్రాంతి.
చిత్రాలు బాపుగారి "హరివిల్లు" సౌజన్యంతో

0 comments:
Post a Comment