మన తెలుగు భాషంటే మన తెలుగువాళ్ళు కొందరు నామోషీ పడుతుంటారు
కానీ ఈ భాషలో ఒక్కో పదానికి ఎన్నెన్నో అర్ధాలు, పెడర్ధాలున్నాయి. అందుకే
మా కార్టూనిస్టులకు చేతినిండా పని. ఇలా పెడార్దాలతో వివిధ పత్రికలలొ పడిన
కార్టూన్లను వాఖ్యలను మరో భాషలోకి అనువిదించి చెప్పడం అంత సులువు
కాదు. తెలుగులో పెడార్ధాల మాటల్లో" పడటం" ఒకటి. ఇప్పుడుఆ మాటకు అర్ధం
చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. క్రింద కాలు జారి పడటం, అలా పడిన మనల్ని
చూసిఆప్తులు భయపడటం, మన గురించి బెంగపడటం , ఇలా ఎన్నో పడటాలు!!.
కొన్ని వస్తువులు తింటే మనకు పడవు. రచయితలున్నారా, వాళ్ల కధలు
పత్రికల్లో అచ్చయితే "ఇదిగోనండి, నాకధ ఫలానా పత్రికలో పడింది, చూశారా "
అంటారు. ఇంకో విషయం. ఒకాయన "నిన్న రాత్రి మా ఇంట్లో దొగలు పడ్డారు"
అని విచార పడుతూఅంటే అది విన్న ఓ జాలిగుండె పెద్దమనిషి " అయ్యో ఎంతపని
జరిగింది ? కొంపదీసి వాళ్లకు దెబ్బలేమైనా తగల్లేదు కదా ?! " అంటూ జాలి
పడ్డాడట!!
పడక పడక పడుతుంటాము !!
ఈమధ్యే మా హాసం మితృడు హనుమంతరావు చీకటితో వాకింగుకు (చీకటి
అంటే నిజంగా చీకటే ) ఒంటరిగా వెళుతూ వేగనిరోధకం తగిలి ( అంత వేగంగా
నడవట మెందుకో నేనడగలే) పడి , పడిలేచిన తరంగం మల్లే మళ్ళీలేచి ధైర్యంగా
ఇంటికి నెత్తురు కార్చుకుంటూ తురంగంలా ఇంటికొచ్చి పడ్దాడు.మళ్ళీ పడలేదు,
ఇక్కడ పడటమంటే ఇంటికి చేరాడన్నమాట. ఇది జరిగినప్పుడు నేను ఎక్కడో
దూరంగా బొంబాయిలో వుండి పోయాను. లేకుంటే అందరిలా పడి పడిఇంటికి
వెళ్ళి ఎలా పడ్డాడో ఓ సారి నటించి ( మా హనుమంతరావుకు మంచి నాటకానుభవం
వుంది లెండి) చూపించమని అడిగి వుండేవాడిని. ఓదార్పుయాత్రకు వచ్చిన
ప్రతి వాడూ ఎట్టా పడ్డారూ అని అడిగిన వాడే కాని అతను పడినాక గాయంతో
పడుతున్న బాధ వాళ్లకు పడదుకదా !! అందుకే ప్రతివాళ్ళూ ఇలా వాకింగుకు
వెళుతున్నపుడు వెంట మరోకరిని తీసుకొనివెళ్ళి (వీడియో కెమెరాతో) ఇలాటి
పడటాలు మూవీగా బాగా పడేట్లు తీస్తే మనం ఎలా పడ్డామో ఓదార్పుగాళ్లకి
చూపిస్తే తృప్తి పడతారు ! కొందరు షాపింగ్ చేస్తూ ఓ వస్తువును చూపించి ఇది
ఎంత పడుతుందని అడుగుతుంటారు. ఇక్కడ పడటమంటే ధరన్న మాట.!!
ఇంకా ఇలా పడటం మీద వ్రాస్తూ పోతుంటే ఇకచాల్లే, పడక పడక మా వెంట
పడక అనే ప్రమాదం వుందని భయపడుతూ ఆపేస్తున్నా, మీరు ఆనంద పడితే
నేను సంతోష పడతా కాబట్టి !
(బాపుగారి కార్టూన్ కొంటెబొమ్మల బాపు సౌజన్యంతో)
మమ్మల్ని బాగా పడేశారు
ReplyDeleteహాయిగా నవ్వుకున్నాను...బాగున్నాయండి!
ReplyDeleteThe hallmark of your cartoons is using the words with different meanings. As you said translating such words into other language is impossible.
ReplyDeleteWell written and I enjoyed every word of it.
నా పడటం కధ మీ అందరికీ నచ్చి ఆనందపడిపోయి నాకు చెప్పినందుకు ఎంత సంతోష పడిపోయానో ! మితృలు శ్రీ శివరామ ప్రసాద్ గారితో
ReplyDeleteసహా ఇతర మితృలందరికీ శుభాభినందనలు.
బావున్నాయండి సురేఖ గారూ మీ కార్టూన్లు ,బ్లాగూ
ReplyDeleteనా శరీరం పడడం మీ వంటికి బాగా పడిందన్నమాట.. సంతోషం. జెర్రీకి చెలగాటం టామ్ కి ప్రాణ సంకటం...( పేర్లు తప్పయితే సర్దుకోండి)
ReplyDeleteఅవునూ !హనుమంతరావుగారూ ! మీరు చెప్పాపెట్టకుండా హైద్రాబాదు వచ్చి పడ్డారన్నమాట. ఇక్కడ వున్నంతకాలం బిజీ బిజీ, అక్కడైనా "శాంతి"గా కాలక్షేపం చేయండి.
ReplyDeleteమీ పడటం చదివాక నాకూ రాయాలని మనసు పడింది దగ్గు జలుబుతో జబ్బు పడ్డాక ఇప్పుడు బాగు పడ్డాను.
ఇంతమంది ఇలా పడిపోతే తట్టుకోలేక నేను పడి పడి నవ్వు లో పడి పోయాను.
ReplyDeleteరావు గారు,
ReplyDeleteనా కామెంటు పడిందాండీ ??
చీర్స్
జిలేబి.