
తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కోనసీమలోని కొత్తపేటకు పది మైళ్ళ దూరానగల ర్యాలి అనే ఊర్లో జగన్మోహినీ కేశవస్వామి తప్పక చూడ దగ్గ గుడి. అధ్యాత్మక చింతనకు కళ తోడైతే ఎంత అద్భుతంగా వుంటుందో అన్నదానికి ఈ ఆలయమే సాక్షి. ఐదు అడుగుల ఎత్తుగల జగన్మోహినీ విగ్రహం నిగనిగ లాడుతూ నల్లటి శిలతో...