దామెర్ల మెమోరియల్ ఆర్ట్ గాలరీ, రాజమండ్రి
ఆంధ్రదేశ చిత్రకళావైభవానికి వన్నెతెచ్చిన చిత్రకారుల్లో దామెర్ల రామారావు ఒకరు.
అంతటి కళాకారుడు జీవించినది అతి కొద్ది కాలమైనా ( ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు
లోనే ఆయన అకాలమరణం చెందారు).ఆ కొద్ది కాలంలోనే చిత్రకళకు ఆయన చేసిన సేవ
మరువలేనిది. గోదావరి రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఆనంకళాకేంద్రం వెనుక శ్రీ రామారావు
పేరు మీద ఓ ఆర్ట్ గాలరీ నిర్మించారు. శ్రీ రామారావు 1887 మార్చి 8వ తేదీన రాజమండ్రి
లో జన్మించారు. అతి పిన్న వయసులోనే ఆయన పెన్సిలు తో బొమ్మలు వేస్తుండేవారట.
పదేళ్ళ వయసులో వారి మేనమామ బహుకరించిన వాటర్ కలర్స్ తో ఆయన చిత్రకళా
ప్రతిభ దినదినాభివృద్ధి మానమయింది. ఆయన కుంచె నుంచి జాలువారిన రంగుల చిత్రాలు
కొన్ని ఇక్కడ మీకోసం. మీరెప్పుడైనా రాజమండ్రి వస్తే దామెర్ల రామారావు గారి చిత్రాలను
చూడటం మరచిపోకండి.ఈ ఆర్ట్ గాలరీ ప్రభుత్వ నిర్వహణలో వుంది కాబట్టి సందర్శకులు
చూడటానికి నిర్ణయించిన టైమ్ మాత్రం అంత సదుపాయంగా లేదనే చెప్పాలి. ఆఫీస్ టైముల్లా
ఉదయం 9-00 గంటల నుంచి మధ్యహ్నం 12-00 గంటల వరకు తిరిగి 2-00 గంటల నుంచి
సాయంత్రం 5-00 గంటల దాకా అనుమతించడం బాగుండలేదు. శుక్రవారం సెలవుతో ఆదివారం
తెరచి వుంచడం మాత్రం కాస్త ఊరట కలిగించే విషయం.
ఒక సారి నేనక్కడికి వెళ్ళే సరికి సాయంత్రం ఆఱయి మూసివేసుంది। కానీ దాని ప్రక్కనే వున్న 'ఆయనెవరిదో' జానపద గ్రంథాలయం వుంది। అదీను చాలా ఆసక్తికరమైన చోటు కానీ నిర్వాహణ అంత సరిగా లేదాయె। డిజిటీకరిస్తే బాగుణ్ణు।
ReplyDeleteసార్, ఆ గ్యాలరీ ఫోన్ నెంబరు మీ దగ్గర వున్నట్టయితే యివ్వగలరా?
ReplyDelete