RSS
Facebook
Twitter

Tuesday, 18 May 2010

" మండే " ఎండలు !!


ఈ ఎండాకాలం ఎప్పుడు ఎండవుతుందో ! అంటూ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళూ రోజులు
లెక్కపెట్టుకుంటున్నారు. ఐనా మనకు ఏ కాలం నచ్చుతుంది చెప్పండి. వర్షాకాలం
వచ్చాక, పాడు వర్షాలు ఇంట్లోంచి కదలటానికి లేదు. ఆ ఎండాకాలమే నయం. హాయిగా
ఉక్కపోసి చమట పట్టినా షవరుక్రింద స్నానం ఎన్నిసార్లు చేసినా ఎంతో’ హాయిగా వుండేది.
కరెంట్ కోతతో ఉక్కపోతతో వళ్ళంతా తడిసిపోయాక కరెంట్ వచ్చి ఫాను తిరుగుతుంటే
ఆ హాయే హాయి అని అనుకుంటాం. రాజకీయనాయకుల్లా క్షణాల్లో మాట మార్చేస్తాం !
ఇప్పుడు వార్తల్లో ఎండకు ఇంతమంది పరలోక యాత్ర అని వేస్తున్నట్లే వానాకాలంలో
రోడ్లన్నీ వర్షంనీళ్ళతో నిండి డ్రయనేజ్ కన్నాల్లో పడి కొట్టుకుపోయారని వార్తలు స్క్రోలింగ్లో
చూస్తాం. ఐనా పాపం ఆ సూరీడు ( మాజీ సీయం. ఆప్తుడువిషయం కాదండోయ్) తన పేరేగల ఆది
వారంకూడా రెస్ట్ తీసుకోకుండా పూర్తిగా తన ప్రతాపం చూపిస్తాడు. పోనీ మరునాడైన "మండే"
నాడు సెలవు తీసుకోకుండా మరింత "మండి" పొతాడు ! ’మండే’ రోజుగదా మరి ! ఆయన్ని
పాపం ఏమనలేం. పైగా ఇవి అయనకు ప్రతి వారాలూ మండేలే గదా ! "ఫ్రై" డే నాడైతే మరింత "ఫ్రై" చేస్తాడు
మనకు కావాలి టీ, కాఫీ హాట్ హాట్ గా !
ఉండాలి పేపర్,టీవీల్లో వార్తలు హాట్ హాట్ గా ! !
సిన్మాల్లో సీన్లు కనిపించాలి హాట్ హాట్ గా ! !
ఐనా సూరీడు మాత్రం తన ప్రతాపం చూపకూడదు హట్ హట్ గా ! !
ఇలా హాట్ హాట్ గా రాసి బుర్ర వేడెక్కి ఓ కప్పు కాఫీ ఇమ్మంటే శ్రిమతి ఏమందో నా కార్టూన్లోనే
చూడండి మరి. ఇక కట్ అంటూ కరెంట్ కట్టయింది ! ఉంటా టా టా టా !!

4 comments:

  1. బాగుంది మీ టపా స్వీటు స్వీటు గా,,

    ReplyDelete
  2. సురేఖ గారూ..., ఈ ఎండాకాలం ఎప్పుడు ఎండవుతుందో ! అంటూ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళూ రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. ఐనా మనకు ఏ కాలం నచ్చుతుంది చెప్పండి. వర్షాకాలం వచ్చా_____________________అలా ఆ సీన్లు ని మా కళ్ళ ముందు ఆవిష్కరించారు.ఇప్పుడే వరుసగా మీ టపాలు చదువుతున్నా

    ReplyDelete
  3. సార్ !
    మరీ ఇంత ఎండాకాలం ......ఇంత వరకు చూడలెదు . సరిగంగ స్నానాలు చేయడానికి .....యె గొదారీ లెదు ( మా వూర్లో ఐతే సాయంత్రం మొత్తం గోదాట్లోనె వుండే వాళ్ళము ). షవరు కింద చెయాలంతే బొబ్బలెక్కి.....తత లేచేలా వుంది . ఓ సారి మా గొదారి వైనం చూడండి.
    http://ramanafm.blogspot.com/

    ReplyDelete
  4. సారీ.........ముద్రా రాక్షసాలు సరిచూసుకోగలరు .

    చేయాలంటే (చెయాలంతె )

    తాట (తత )

    http://ramanafm.blogspot.com/

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About