మనదేశం లో ఒకేసారి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి పదవిని అలంకరించడమే
కాకుండా ప్రసిస్ధి చెందిన నాగార్జునడామ్ లాంటి భారీ ప్రాజెక్ట్ కు రూపకల్పన
చేసిన నీతిమంతుడయిన ఏకైక ముఖ్యమంత్రి ’ఆంధ్ర కేశరి ’ టంగుటూరి ప్రకాశం
గారు అన్న విషయం ఈ తరం వారికి చాలామందికి తెలియకపోవచ్చు. జాతీయ
స్ధాయిలో గుర్తింపు పొందిన ఆంధృడాయన. ఎంతటి వారినైనా ఎదుర్కొనగలిగిన
ధైర్యవంతుడు. బ్రిటిష్ వారి తుపాకులకు చాతీ చూపిన సాహసి. మద్ర్రాసులో
లక్షల రూపాయలను ఆర్జిస్తున్న లాయరు వృత్తిని తృణప్రాయంగా వదలి రాజకీయల
లోకి ప్రవేసించిన ప్రకాశం పంతులుగారు పుట్టిన ఊరు వేరైనా ఆయన రాజకీయ
జీవితమంతా గోదావరీతీరం, రాజమహేంద్రవరం ( రాజమండ్రి )లోనే సాగింది.ఆయన
పుట్టిన ఊరు కొత్త జిల్లాగా మారినప్పుడు ఆయన పేరిట ’ ప్రకాశం జిల్లాగా పేరు
పెట్టారు. అటువంటి ఉత్తమ వ్యక్తి తమ ఊరి ప్రధమ పౌరుడు కావటం తమకు గర్వ
కారణమని రాజమండ్రి ప్రజానీకం ఆయన్ని తమ నగరానికి చైర్మన్గా ఆనాడు ఎన్ను
కున్నారు. 1901 ప్రాంతంలో రాజమండ్రి పట్టణం తరచు ముంపులకు గురయేది.
ముందు చూపుతో గోదావరి నీరు పట్టణంలోకి ప్రవేశించకుండా గట్టును నిర్మించడానికి
ఆయన సముత నిర్నయం , ఆయన ముందు చూపుకు నిదర్శనం.ఆయన ముఖ్య
మంత్రిగా అధికారం చేబట్టాక కృష్ణా నదిపై కాటన్ నిర్మించిన ఆనకట్ట శిధిలావస్దకు
చేరిందని పుననిర్మాణం చేపట్టాడు. తరువాత ఆ బారేజ్ ప్రకాశం బారేజ్ గా ఈ నాడు
నిలచింది. అలా ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలకే కాకుండా కృష్ణా జిల్లాకు మేలు
చేశాడు. ఆయన లాయరుగా పనిచేస్తున్నప్పుడు వాదనలు సరిగా వినకుండా కునికి
పాట్లు పడుతున్న బ్రిటిష్ న్యాయమూర్తికి చురకలంటించిన ధైర్యశాలి. మరో సారి కందుకూరి
వీరేశలింగంను కూడా బోనులో నిలబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తెగువరి. స్వాతంత్ర
భావాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళడానికి ఆయన ’ స్వరాజ్య ’ అనే పత్రికను ఇంగ్లీష్,
తెలుగు,తమిళ భాషల్లో ప్రచురించారు. కాంగ్రెస్, బ్రిటిష్ వారు వేసిన సైమన్ కమీష్ ను
బహిష్కరించినప్పుడు కాల్పుల్లో ఓ కార్యకర్త మరణించాడు.. అప్పుడు ప్రకాశం ధైర్యంగా
ఆ తుపాకులకు ఎదురునిల్చొని తన చాతీ చూపించి బ్రిటిష్ వాళ్ళని గడగడ లాడించాడు,
సింహం లా ధర్యాన్ని చూపిన ఆయన్ని "ఆంధ్ర కేశరి"గా అభిమానులు పిలచారు. దక్షినాదిన
కాంగ్రెస్ ను నడిపించగల శక్తి ఆయన ఒక్కడికే వుందని అందరూ తీర్మానించారు. 1946
సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. కొన్ని కారణాలవల్ల ఆయన
తన పదవికి రాజీనామా చేసి ప్రజాపార్టీ అనే కొత్త పార్టీని స్తాపించారు. కర్నూలు రాజధానిగా
ఆంధ్ర ఏర్పడినప్పుడు రాస్ట్రాన్ని నడపగల ఏకైక నాయకుడిగా ఆయన్ని ప్రధాని నెహ్రూ గుర్తించి
మొదటి ముఖ్యమంత్రిని చేశాడు. నీతికి నిజాయితికీ నిలబడగలిగిన ఒకే ఒక్క నాయకుడు
టంగుటూరి ప్రకాశం. ఆయన మే, 20, 1957 న మరణించారు. ఆయన ముఖ్యమంత్రిగా
ఉన్నప్పుడు రాజమండ్రి లో మా స్కూల్ యానివర్సరీకి అధ్యక్షులుగా వచ్చారు. అప్పుడు
ఆయన టేబుల్ పై కూర్చొని అధ్యక్షోపన్యాసం ఇవ్వడం నాకింకా గుర్తుంది !!
nice post
ReplyDelete