మనసుకవి ఆత్రేయ
శ్రీ కిళాంబి వేంకట నరసింహాచార్యులు నెల్లూరు జిల్లా మంగళంపాడులో 7-05-1921 తేదీన
జన్మించిన ఆయన పేరులోని ఆచార్య,గోత్రంలోనిఆత్రేయ, రెండూ కలిపి ’ఆచార్య ఆత్రేయ" గా
పేరు పొందారు. ఆత్రేయ నెల్లూరు మున్సిఫ్ కోర్టులో గుమాస్తాగా, "జమీన్ రైతు" పత్రికలో
సహాయ సంపాదకుడిగా పనిచేసారు. ఆయన గౌతమ బుద్ధ, అశోక సమ్రాట్, పరివర్తన,వాస్తవం,
ఎన్జీవో,ఈనాడు, విశ్వ శాంతి,కప్పలు,భయం,మనసువయసు మొదలైన నాటకాలు రచించారు.
ఆయన "దీక్ష" ( 1951) సినిమాతో పాటల రచయితగా "పోరా బాబూ పో..." అనే పాటతో సినిమా
రంగంలో ప్రవేసించారు. ఆనాటి నుంచి తిరుగులెని గీత రచయితగా దాదాపు నాలుగువందల
చిత్రాలకుపైగా మాటలు ,పాటలు రచించారు. ప్రేమనగర్,డాక్టర్ చక్రవర్తి,మాంగల్యబలం, మనుషులు
మమతలు, విచిత్రబంధం,అర్ధాంగి,అదృష్టవంతులు,ఆత్మబలం,చిలిపికృష్ణుడు,బంగారు బాబు,పునర్జన్మ,
చక్రవాకం,మంచివాడు,మూగమనసులు ( ఈ చిత్రంలో కొన్ని మాటలు ముళ్లపూడి రచించారు),జీవన
తరంగాలు మొ" పేరుతెచ్చిన చిత్రాలు.
’తోడి కోదళ్ళు’ చిత్రంలో ఆయన రాసిన ’కారులో షికారు కెళ్ళే’ పాటను చాలామంది శ్రీశ్రీ రచన
అని అనుకోవడం జరిగింది పాటలు సరైన టైముకి వ్రాసి ఇవ్వక నిర్మాతలను, వ్రాసాక శ్రోతలను ఆత్రేయ
ఏడిపిస్తారని ఆయన గురించి పరిశ్రమలో చమత్కరించే వారు. 13-9-1989 న ఆయన మద్రాసులో
కీర్తిశేషులయ్యారు.
ఈ రోజు , మే 7 వ తేదీ ఆయన జయంతి నాడు మనసుకవిని స్మరించుకొందాం.
వోల్గా వీడియోస్ సౌజన్యంతో ప్రేమనగర్ చిత్రం లోని ఓ ఆత్రేయ గీతం మీకోసం.
marchipoleni roju
ReplyDeleteఆత్రేయగారి గురించి మీరు వ్రాసిన చిరువ్యాసం బాగుంది, సురేఖ గారూ! చాన్నాళ్ళనుంచి మీ బ్లాగు చదువుతూ, బొమ్మలు చూస్తూ ఆనందిస్తున్నాను. మీకు నా ధన్యవాదాలు!
ReplyDelete"తోడి కోడళ్ళు" చిత్రంలో ఆత్రేయగారి "కారులో షికారుకెళ్ళే" పాట శ్రీశ్రీ గారిదే అని పొరబడినట్టే, "డాక్టర్ చక్రవర్తి" చిత్రంలో శ్రీశ్రీగారి "మనసున మనసై" పాట ఆత్రేయగారిదని అనుకుంటారు చాలామంది. నిజానికి ఈ రెండు పాటలు ఎన్నిసార్లు విన్నా, ఆయన పాటలో ఈయన ముద్ర, ఈయన పాటలో ఆయన ముద్ర కొట్టొచ్చినట్టుగా కనబడతాయి.
భవదీయుడు,
అబ్బులు
మనని ఏళ్ళ తరబడి ఆనందపరచిన వాళ్ళని తలుచుకుంటే అది వాళ్ళ సుక్రుతమో మనసుక్రుతమో అర్ధము కాదు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
ReplyDelete