RSS
Facebook
Twitter

Friday, 21 May 2010





రోజులు మారాయి. పూర్వపు రోజుల్లో బాంకు నుంచి డబ్బులు తీసుకోవాలంటే బాంకు పనిచేసే
టైములోపలే తీసుకోవాల్సి వచ్చేది. మరిప్పుడో, అర్ఢ రాత్రి, అపరాత్రి మనకు ఇష్టం వచ్చినప్పుడు
డబ్బు తీసుకొవచ్చు.( అదేలెండి ! మన ఖాతాలో బాలన్స్ ఉంటేనే !!). అదేకాదు, మనం ఏ ఊరెల్లినా
అక్కడే డబ్బు తీసుకొనే సదుపాయం వచ్చింది. అదే ఏటీయం.! ఈ యంత్రాన్ని ( ఆటొమేటెడ్ టెల్లర్
మిషన్) జాన్ షెపర్డ్ బారన్ కనిపెట్టాడు. ఓ సారి అత్యవసరంగా బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవాలను
కొంటే బ్యాంకు టైమ్ ఐపోయిందట. బారన్ కు డబ్బును అందజేసే మిషన్ ఉంటే బాగుంటుందనే
ఆలోచన వచ్చింది. 1967 లో మొట్టమొదటి టెల్లర్ మిషను లండనులోని ఒక బ్యాంకు వద్ద ఏర్పాటు
చేశారు. ఒక ప్రత్యేకమైన చెక్కును మిషన్లో ఉంచితే దాని సంకేతక సంఖ్యను సరిపోల్చి నగదును
ఇచ్చేది. తరువాత ప్లాస్టిక్ కార్డులు ప్రవేశించాయి. ఏటీయం లాంటి సదుపాయాన్ని ప్రపంచ ప్రజానీకానికి
అందించిన జాన్ షెపర్డ్ బారన్ గత శని వారం తన 84 ఏట ఉత్తర స్కాట్లాండ్లోని ఓ ఆసుపత్రిలో మరణించాడు.
* * * * * * * * * * * * * *
మన ఖాతాలో డబ్బులు లేక పోతే ఏటీయం ఏటీయియ్యం అంటుంది !!
* * * * * * * * * * * * * *
ఓ సారి అలనాటి నటుడు వంగర వేంకట సుబ్బయ్య ( మాయాబజార్ సినిమాలో అల్లుతో శర్మ,శాస్త్రీ జంట
గా అగుపించారు ) వేషాలకోసం ప్రయత్నిస్తుంటే ," ఏవియం లో ప్రయత్నించక పొయారా ? అని ఒక మితృడంటే
వంగర " వాళ్ళేమిస్తారయ్యా ! స్టూడియో బయట ’ఏవియ్యం ’ అని పెద్ద బోర్డు పెట్టుకున్నారు కదా !" అని
సహజ ధోరణిలో చమత్కరించారట.
+ + + + + + + + + + + + +


2 comments:

  1. ఆ బారన్ మహానుభావుడి దయవల్ల మనం ఈరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డబ్బులు తీసికోగలుగుతున్నాం. అన్నట్టు, ఆయన మన భారతదేశంలోనే (షిల్లాంగ్,మేఘాలయలో...అప్పట్లో షిల్లాంగ్ అస్సాంలో భాగంగా ఉండేదట) పుట్టాడు.

    - అబ్బులు

    ReplyDelete
  2. ATM మీద చక్కటి వ్యాసాన్ని అందించినందుకు మీకు దన్యవాదలు.
    వ్యాసానికి ముగింపులొ వున్న రెండు చలొక్తులు అద్భుతంగా వున్నయండి సురేఖ గారు.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About