శ్రీ సంక్షోభకృన్నామ సంవత్సర సగంపూర్ణశాస్త్రీయ
జ్యోతీ పన్చాంగమ్
1963 బాపు రమణగార్లు తమ మిత్ర బృందంతో ప్రారంభించిన "జ్యోతి" మాసపత్రిక ఉగాది
సంచికలో అనుభందంగా ఇచ్చిన పేరడీ పంచాంగం చదవడానికి చాలా సరదాగా వుంటుంది.
బాపురమణల ’ఇంకోతి కొమ్మచ్చి’లో ఈ పంచాంగం వేశారు. జ్యోతిలో ఆనాడు వేసిన
పంచాంగంలో వేసిన ప్రకటనలు కూడా నవ్వులు కురిపిస్తాయి. అలాటి ఓ ప్రకటన మచ్చుకి
చదవండి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * **
బహుమతి ! బహుమతి ! !
అద్భుత మాయా స్పెషల్ సత్తు ఉంగరం
ఇది చేతి వేలుకు పెట్టుకొని, తలకు మందు రాసుకొన్నచో తలనొప్పి
పోవును. కోర్టులో జయము, అందమగు స్త్రీలు వశమూ,కీళ్ళ నొప్పులు
బస్సు కు డబ్బు లేనివారికి కాళ్ళ నొప్పులు, వీణ సితారు విధ్వాంసులకు
వేళ్ళ నొప్పులు . ఉంగరం వెల బేడ. స్పెషలు పావలా, ఎగస్ట్రా స్పెషలు
ఆరణాలు ! రెండు ఉంగరములు కొనినవారికి పదిహేను రూపాయల రోలీ
కెమేరా, ఇరవై ఐదు రూపాయల రిస్టువాచీ ఉచిత బహుమతి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
ఈ పేరడీ ప్రకటన లాగానే ఇప్పుడు టీవీ చానల్లలో వస్తున్న తాయెత్తుల ప్రకటనలూ
వుంటున్నాయ్!!
అన్నట్లు మీకు ఈపాటికి తెలిసే వుంటుంది. భాపు రమణుల "కోతికొమ్మచ్చి" తెలుగు
అర్ధమై చదవటం రాని తెలుగువాళ్ళకోసం ఎస్ఫీ బాలు మధుర గాత్రంతో ఆడియో సిడీలు
గా విడుదలయ్యాయని.!!
సురేఖ గారూ,
ReplyDeleteమీ బ్లాగు భలే పసందుగా ఉంది! చిన్నప్పటి రోజులన్నీ తిరిగొచ్చినట్టుంది. మా ఇంటినిండా జ్యోతులూ, విజయలూ, యువలూ,వనితలు ఇలా ఎన్నెన్నో పత్రికలుండేవి. కొన్నాళ్ళకి అవన్నీ మాయమైపోతాయని తెలీక దాచుకోలా!
మీ పుణ్యమా అని అవన్నీ ఇప్పుడు తల్చుకుంటున్నా!