RSS
Facebook
Twitter

Saturday, 12 February 2011

విధి-విచితం !! !


నేను విధిని నమ్ముతాను. నేనాడూ ఇలా బ్లాగును స్వంతంగా నిర్వహిస్తానని,
ఎక్కడో పూనాలో వుండే ఫణిబాబు గారు రాజమండ్రికి వచ్చి కొంతకాలంగడపటం,
ఆయన మా హాసం క్లబ్ కువచ్చి అటు తరువాత మా ఇంటికి వచ్చి నా చేత
బ్లాగును ఓపెన్ చేయించి నా గురించి చి"సౌ"జ్యోతిగారికి చెప్పి నా బ్లాగును
వ్రాయటానికి సహకారం అందించడం , ఇవన్నీ నిజంగా ఊహకు అందని
నిజాలు. నేను బ్లాగుని ప్రారంభించాక ఎందరో బ్లాగరులు ఆప్త మితృలయ్యారు.
శ్రీ కె.శివరామప్రసాద్,శ్రీ బి.విజయవర్ధన్,శ్రీరాధేశ్యాం , శ్రీ కర్లపాలెం హనుమంత
రావు గారు ఇలా ఎందరో, మహానుభావులు. అలానే బాపు రమణగార్లు,
శ్రీ జయదేవ్, శ్రీ సరసి నాలాంటి మామూలు వ్యక్తిపై చూపించే అభిమానం
నాకు దేముడిచ్చిన వరం. అసలు ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, పాత
ఫొటోలు చూస్తుంటే పై ఫొటో అగుపించింది. మూడేళ్ళ వయసున్న నన్ను
ఎత్తుకున్నది ఎ.నరసింహమూర్తి అనే ఆయన. అప్పుడు ఆయన మా నాన్నగారు
పనిచేస్తున్నబ్యాంకులో ( ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)మెసెంజరుగా
పనిచేసే వారు. విధిఅనండి, లేకపోతే మరోటో ఏదైనా అనండి, నేను, ఆయన
కలసి ఒకే చోట ఉద్యోగం చేస్తామని ఆయన, ఊహించి వుండరు. 1972
లో నేను రాజమండ్రి (ఇన్నీసుపేట) స్టేట్ బ్యాంకులో అక్కౌంటెంట్ గా , ఆయన
హెడ్ మెసెంజరుగా పనిచేశాము. నన్ను అపురూపంగా , నాకు బ్యాంకులో ఏ మాత్రం
అసౌకర్యం కలగకుండా , చిన్నప్పుడు ఎంత ప్రేమతో చూసుకొనే వాడో అలానే చూసే
వారు. నన్ను బ్యాంకులో అబ్బాయిగారు అనే పిలచేవారు. ఓ సారి బ్రాంచిమేనేజరు
అలా పిలవటం విని "అలా పిలవకూడదు, నరసింహమూర్తి" అంటే, 30 ఏళ్ళనుంచి
అలానే పిలుస్తున్నాను. ఇప్పుడు ఎక్కౌంటెంట్ గారూ అని పిలవలేనండి అనేవారు.
ఆ రోజుల్లో ఆప్యాయతలు అలా వుండేవి. ఆ ఫొటో చూడగానే నా మదిలో మెదలిన
ఆనాటి ఆలొచనలు మీతో పంచుకుంటున్నాను.
.

3 comments:

  1. గురువుగారూ,

    మీరు చెప్పింది అక్షరసత్యం అండి. అసలు మిమ్మల్ని కలిసి పరిచయం చేసికోవడమే, విధివిచిత్రం. మీ దగ్గరున్న అపూర్వసంపద అందరితో మీ టపాలద్వారా పంచుకోవాలని ఆ భగవంతుడు ఎప్పుడో వ్రాసి పెట్టాడు. అందులో నేను చేసినదేమీ లేదు.ఊరికే గుర్తుచేశానంతే. దానికే, నాకు అంత క్రెడిట్ ఇచ్చేయడం, మీ సహృదయత.

    ReplyDelete
  2. ఫణిబాబు గారు, ధన్యవాదాలు. విధి విచిత్రం కాకపొతే నేను శిర్షికలో
    తప్పు రాస్తే మీరు ఆ మాట చెప్పక పోవడమేమిటి?! నాకూ ఈ ఉదయం
    వరకూ ఆ అచ్చు తుప్పు కనిపించక పోవడమేమిటి? అంతా విధి విచితం,
    తప్పు తప్పు విధి విచిత్రం !!

    ReplyDelete
  3. గురువు గారూ,

    "తుప్పు కనిపించక" ఏమిటండి బాబూ? ఏమిటో పెద్దవారిలో 'తప్పులు' కనిపెట్టడం ప్రారంభిస్తే మరి ఇలాగే ఉంటుంది...!!

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About