ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రొగ్రాములు గంటసేపు జరిగేవి. కధలు, నాటికలు,
పాటలు ఎన్నో..అవి అయ్యాక బాలన్నయ్యగారు అందరికీ స్వీటు హాటు కూల్ డ్రింకూ,
పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు కాఫీ,టీ యిప్పించే వారు-ఆ టిఫిను ప్రొగ్రాంకి నేనూ,
అన్నయ్యగారి అన్నయ్యగారబ్బాయి రాఘవా,తమ్ముడు గోపాల్ ఇన్చార్జిలమి. ప్రొగ్రాం
రిహార్సిలు అవుతుండగా పిల్లలెందరో పెద్దలెందరో లెక్క రాసుకొని కాంటీనుకి వెళ్ళి ఇన్ని
టిఫిన్లు,ఇన్ని కాఫీలు అని ఆర్డరు చెప్పేవాళ్ళం,ఆ రకంగా పిల్లల్లో మొతుబర్లం కాబట్టి
కాంటీనువాడువాడు మా నేస్తం. మేము ఒక వడ,రెండు కూల్ డ్రింకులు,కలర్ షోడా-తాగేసే.
వాళ్ళం.దొంగలెక్కలు అన్నమాట-సాయంత్రం బిల్లులో కలిపేసే వాళ్ళం.ఓసారి కలర్ తాగుతూ
జోకేసుకొని నవ్వాం-నాలుగు చుక్కలు తుళ్ళి చొక్కాలమీద పడ్డాయి-మేమూ చూసు
కోలేదు.ఆ రోజు సాయంత్రం ప్రొగ్రాం అయిపోయి టిఫినులు తినేసి అందరం వాన్
ఎక్కుతుండగా అన్నయ్యగారు రవణా,రాఘవా అని పిల్చారు-కొచెం దూరంలో చెట్టు
కిందే ఒక్కరే నిలబడ్డారు-ఎందుకో అని వెళ్ళాము.
"మీరు ఇవాళ ఒక తప్పు చేశారు-ఇప్పుడు నిజం దాస్తే రెండు తప్పులు-అబద్ధం చెప్పితే
మూడు తప్పులవుతాయి-చెప్పండి" అన్నారు అన్నయ్యగారు-మా రంగుల మచ్చల మీద
మునివేళ్లతో నిమురుతూ.
మేం ఒకళ్లనొకళ్ళను చూసుకున్నాం.కళ్లవెంట నీరు తిరిగింది.దండాలు పెట్టేశాం-
"క్-క్కలర్ సోడాలు తాగాం"అనేశాం
"గుడ్-వెరీ గుడ్"అన్నారు అన్నయ్యగారు మా తలలు నిమురుతూ-మేం ఆశ్చర్య
పడిపోయాం.
"కలర్ సోడాలు తాగినందుకు కాదు-నిజం ఒప్పుకున్నందుకు" అని హహహహ అని
నవ్వేశారు.
"నవ్య" వార పత్రిక సౌజన్యంతో...............
(రేడియో అన్నయ్య గారంటే మొట్టమొదటి పిల్లల పత్రిక "బాల" వ్యవస్ఠాపకులు శ్రీ న్యాయపతి
రాఘవరావు గారు)
ఒకసారి నా బ్లాగు లో కొత్త పోస్ట్ అదేనండీ నా శతోపమాన నివాళి పోస్టు చూసి తప్పొప్పులు చెబ్దురూ. ఆయన మీద భక్తితో చేతికొచ్చింది రాసేశా. ఏమయినా పొరపాట్లుంటే మన్నించండి
ReplyDeletebagundandi.
ReplyDeleteకొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి
ReplyDeleteకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి
ఇంకొన్ని అద్భుతం అనిపిస్తాయి
మరికొన్ని ఈ మూడింటినీ కలిపి ఇస్తాయి
ఇలాంటి ఒకటి రెండు చిత్రాలు మాత్రమే
వాటన్నింటినీ మించినవిస్తాయి
ఇది అపూర్వమూ అపురూపమూ అయిన ఛాయా చిత్రం
వాళ్ళిద్దరూ స్నేహానికి ఏక వచనం
అంతే కాదు
మైత్రికి బహువచనం కూడా
చిన్నప్పుడు బాపు రాసేవారనీ రమణ గీసేవారనీ విన్నాను
తరవాత తమ స్నేహానికి గుర్తుగా
రాతవారు గీతకీ
గీతవారు రాతకీ
మారారని తెలుసుకున్నాను
గీత రాతగా మారినా
రాత గీతగా మారినా
ఆ బ్రహ్మ రాతా
ప్రాకృతిక గీతా
మారేవి కావు
ముత్యాల ముగ్గయినా అంతే
మురిపాల బుగ్గయినా అంతే
ముది వగ్గు కాక తప్పదు
చివరికి బుగ్గి కాకా తప్పదు
అయినా సరే
ఈ ఛాయా చిత్రాలు మాత్రం
తన ఛాయలనే
వెలుగు కిరణాలుగా మార్చుకొని
జీవిస్తూ ఉంటాయి
జీవిస్తూనే ఉంటాయి
- జె ఎస్ ఆర్ మూర్తి
శంకర్ గారు, చదివాను.తప్పులా?! తప్పు తప్పు ప్రతి పదమూ మెప్పులే!
ReplyDeleteచాలాబాగా వ్రాశారు. శ్రీ రమణగారితో నాకున్న సాన్నిహిత్యంవల్ల
తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని చెప్పుకోలేని బాధ. బాపురమణ
గార్ల పుస్తకాలున్న రాక్ దగ్గరికి వెళ్ళాలంటే, ఏ పుస్తకం తెరిచినా
ఆయన అభిమానంతో మొదటి పేజీలో ఆయన స్వహస్తాలతో
వ్రాసిన మాటలు, సంతకం నన్ను కలచి వేస్తున్నది.