నిన్నటి "ఈనాడు" లో శ్రీధర్ కార్టూన్ చూడగానే ఆయన గురించి నా
భావాలు మీతో మరో సారి పంచుకోవాలనిపించింది. ఈ రోజుల్లో ప్రతి
ఉద్యోగి అతను నిర్వహించే శాఖ ఏదైనా మంచి జీతభత్యాలకోమరోదానికో
తను పని చేసే సంస్ఠలను వదలి మరో సంస్థకు వెళ్ళడం పరిపాటి. కాని
శ్రీధర్ దాదాపు ఆనాటి నుంచి ఈనాటివరకు తన సంస్థను వదలలేదు.
ఉదయాన్నేఏ వార్తాపత్రిక చూసినా రాజకీ(చ)య నాయకుల
వికృత చేష్టలు, మాటలు, ఘోరాలు చదివి వికారం పుట్టిస్తున్న ఈ
రోజుల్లో శ్రీధర్ కార్టూన్ చూడగానే ఎంతో రిలీఫ్ కలుగుతుంది.
"ఈనాడు కార్టూన్లు" పేర 1999 ప్రచురించిన శ్రీధర్ కార్టూన్ల
పుస్తకంలో అయన ఇతర కాంగ్రెస్ నాయకులతొ బాటు ఎన్టీయార్
పై సంధించిన వ్యంగ్య బాణాల కార్టూన్లు కడుపార మనల్ని నవ్విస్తాయి.
ముఖ్యమంత్రి అయిన ఆతరం నటుడి పైన , ముఖ్యమంత్రి
అవాలనుకొంటున్నఈ తరం నటుడి పైన శ్రీధర్ గీసిన నవ్వుల బొమ్మలను
చూడండి. బాగున్నాయి కదూ?!
కార్టూన్లు శ్రీ శ్రీధర్, ఈనాడు సౌజన్యంతో
శ్రీధర్ బొమ్మల్లో పలికే హాబవభావాలు అద్భుతంగా ఉంటాయండీ! ఇందిరా గాధీ కొనతేలిన ముక్కు, ఎంటీయార్ గడ్డం, ఎంత బాగా వేశారో చూడండి. కొంగు దోపుకుని నిలబడ్డ లక్ష్మీ పార్వతి,..ఎంత నవ్వొచ్చేలా ఉన్నాయో! ఏ రోజు కారోజు ఫ్రెష్ గా ఉండేవి శ్రీధర్ కార్టూన్లే! శ్రీధర్ రాజకీయ కార్టూన్లకి నేను వీరాభిమానిని అనుకోండి
ReplyDeleteI am a fan of his cartoons.
ReplyDeleteనిజమేనండీ...శ్రీధర్ గారి కార్టూన్లు చూడగానే పెద్ద రిలీఫ్ వస్తుంది...నేనైతే రోజూ ఈనాడు పేపరు తప్పకుండా చూస్తా ఆయన కార్టూన్ల కోసం.
ReplyDeleteమొదటి రెండు కార్టూన్ ఎంత బావున్నాయో చూడండి...నర్మగర్భంగా ఎంతటి సందేశాన్ని తెలియజేస్తున్నాయో.... too good, excellent!
ఆ బుక్ ఎక్కడైనా దొరుకుతుందా....
ReplyDeleteఈనాడు తీసుకోగానే మొదటగా చూసేది శ్రీధర్ కార్టూన్ కోసమే.. Thanks for sharing this..
ReplyDeleteఅభిప్రాయాలు తెలియ జేసిన మీ అందరికీ ధన్యవాదాలు. "ఈనాడు కార్టూన్లు
ReplyDelete-శ్రీధర్" పేరిట 1999 లో ఉషోదయా పబ్లికేషన్స్ వారు మంచి బైండింగ్ తో
8X6 పెద్ద సైజులో రూ.70/- రూపాయలకు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.
అప్పుడు ఈనాడులో ప్రకటన చూసి లోకల్ ఈనాడు ఏజెంట్ ద్వారా తెప్పించు
కొన్నాను. ఇప్పుడు దొరుకుతున్నట్లు లేదు.
ఈ పుస్తకం గురించి పుస్తకం.నెట్ లో నేను వ్రాసిన రివ్యూ...
ReplyDeletehttp://pustakam.net/?p=2451
నేనూ శ్రీధర్ గారికి వీరాభిమానినే.మా స్నేహితులతో మాట్లాడుతూ రేపు శ్రీధర్ ఏ విషయం మీద కార్టూన్ వేస్తాడని చర్చించుకోవడం, చాలాసార్లు మేమూహించిన విషయమ్మీదే కార్టూన్ రావడం జరిగేది.అంజయ్య కాళ్ళకు హెలికాప్టర్(యాదగిరి) కట్టినా,రాశేరె,సూరీడు ద్వయం మీద కార్టూన్ వేసినా పొద్దున్నే కొన్ని లక్షలమంది ముఖాల మీద చిరునవ్వులు పూయాల్సిందే.
ReplyDelete