RSS
Facebook
Twitter

Tuesday, 29 December 2009

దాదాపు నలభై ఆరేళ్ళక్రితం ఆంధ్ర వార పత్రికలో "సరాగమాల" పేరిట వచ్చిన శీర్షికలో సినిమా సంగీతం మంచి చెడులగురించి వ్రాసిన శ్రీ వి.ఏ.కె.రంగారావు గారి పేరు సుపరిచితం.ఆయన పూర్తి పేరు వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు.నాకు మంచి సినిమా సంగీతమంటే అభిమానం వుండటంచేత ప్రతి వారం "సరాగమాల" శీర్షికను చదివేవాడిని.ఐదేళ్ళ క్రితం 2005 జూన్ 7వ తేదీన చెన్నై పైక్రాఫ్ట్ రోడ్ లోని ఆయన రామ్మహల్ ఇంటికి వెళ్ళి కలిసే అదృస్టం నాకు కలిగింది.సరాగమాల శీర్షిక ఆంధ్రపత్రికలో రావడానికి...

Sunday, 27 December 2009

ఈ మధ్య నేను పుస్తక ప్రదర్శన జరుగుతున్న షాపులో 1921లో శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారు వ్రాసిన నాటకం కొన్నాను.ఈ నాటికనే 1939లో సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్టిండియా ఫిలిమ్స్ వారు పుష్పవల్లి,భానుమతి లతో సినిమాగా నిర్మించారు.ఇదే భాను మతి మొదటి చిత్రం.ఈ నాటికలో సింగరాజు లింగరాజు పెళ్ళికుమార్తె తండ్రికి వ్రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ఇలా వుంటుంది! బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి,సింగరాజు...

Wednesday, 23 December 2009

గోదావరమ్మ పాపి(డి) కొండలు

అందాల పాపికొండలు చూడాలంటే రాజమండ్రి కి దగ్గర లోనున్న పట్టిసీమకు వెళ్ళి అక్కడనుంచి లాంచీలో ప్రయాణం చేయాలి.లాంచీలుకూడా రెండస్తులతో క్రింద మన్ఛి రెస్టారెంట్,టాయ్లెట్ సౌకర్యాలతో వుంటాయి.పట్టిసీమ చేరాక వేరే నావలో వెళ్ళి అక్కడ గల శివాలయం చూడవచ్చు.ఆ గుడిని మీరు "మేఘ సందేశం" సినిమాలో చూసివుంటారు.మహా శివుడు వీరభదృడిగా, మహా విష్ణువు భావనారాయణుని పేరిట క్షేత్రపాలకునిగా అవతరింఛారని చెబుతారు.ఆలయంలో శివలింగం నయనానందకరంగా దర్శనమిస్తుంది.తిరిగి లాంచి ఎక్కి ప్రయణిస్తుంటే...

Sunday, 20 December 2009

ఫొటో కార్టూన్లు

పత్రికలలో అప్పుడప్పుడు ప్రచురించే రాజకీయనాయకుల ఫొటోలు,ప్రకటనల కోసం వేసే ఫొటోలు చూసినప్పుడు నాకు వచ్చే ఆలోచనలు ఇలా చూపించడానికి చేసిన ప్రయత్నం ఎలా వుందో మీరు చెప్పం...

Tuesday, 15 December 2009

1933 డిసెంబరు 15న నర్సాపురంలో సత్తిరాజు లక్ష్మీ నారాయణ అనే అబ్బాయి పుట్టినప్పుడు బాపులా మారి అందమైన బొమ్మాయిల సృస్టికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత,గీత రెండూ మారిపోతాయని, తెలుగుజాతి ఖండాంతరాలలో వెలిగిపోయే సినిమాలు తయారవుతాయని ఎవరూ ఊహించివుండరు! ఈ నాడు బాపు అందాల అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లుగా రూపుదిద్దుకున్నాయంటేను,రష్యాలో రాదుగా ప్రచురుణ సంస్ధ "అందాల అఆలు" తెలుగుపుస్తకం ముద్రించారంటేను ఆనంద,ఆశ్చ్రర్యరాలతో పొంగి పోని తెలుగువాడుంటాడా?!ఆయన బికాం అవగానే...

Tuesday, 8 December 2009

సంగీత సామ్రాజ్ఞీ, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత,భారతరత్న శ్రీమతియం.యస్.సుబ్బులక్ష్మిగతించి ఈ డిసెంబర్ 11 తేదీకి ఐదేళ్ళు గడుస్తున్నాయి.ఆ మహా గాయనికి స్మృతి కవిత పేరిట నవంబర్ 2006 లో కవితాసంకలనం వెలువడింది.అందులో డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం,లకుమ,డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు,తనికెళ్ళ భరణి,డా.శిఖామణి,మొహమ్మద్ఖాదర్ఖాన్ మొదలైన వారి కవితలతో బాటు నేను వ్రాసిన కవిత కూడాచోటుచేసుకొనే అదృస్టం కలిగింది. ఈ సంధర్భంలో ఆ కవితను మీ అందరితోపాలుపంచుకుంటున్నాను.గాన సరస్వతియం.యస్.సుబ్బులక్ష్మి!నేడు...

Sunday, 6 December 2009

రూపాయలు - రూపాంతరాలు

ఈ నాడు డబ్బున్న వాళ్లను జనాలు గౌరవిస్తారు.వాళ్ళకు ఎలాంటిఅవలక్షణాలున్నా అవేవీ అగుపించవు!కాని డబ్బు మనుషులకు అంతవిలువనిస్తున్నా ఆ డబ్బుకు మాత్రం ఈనాడు రోజు రోజుకు విలువ తగ్గిపోతున్నది.ఒక నాడు పెద్దగా వుండే వంద రూపాయలనోటు ఈనాడుచిన్నదవటంమే కాకుండా విలువే లేకుండా పోయింది. వంద దాకా ఎందుకుమా చిన్నతనంలో పది రూపాయల నోటు పెద్దదిగా వుండేది. ఈనాటి వందకంటే ఎంతో విలువా వుండేది.ఆ రోజుల్లో ఒక రూపాయికి నాలుగు అణాలు.ఆంధ్ర పత్రిక వీక్లీ ఖరీదు పావాలా.నెలకి అంటే నాల్గు...

Tuesday, 1 December 2009

హాసం కబుర్లు

నాకు నిత్య జీవితంలో హాస్యంగా మాట్లాడట మంటే చాలా ఇస్టం.బ్యాంకులోకూడా కొలీగ్స్ తో,కస్టమర్ల తో అలానే మాట్లాడే వాడిని.ఒక సారి ఓ కస్టమర్నిడిపాజిట్ వేయమని అడిగితే,"ఎలాగండి, డబ్బంతా ఇంటి మీద పెట్టేసాం,సార్"అని అన్నాడు."అదేంటి?! ఇంటి మీద పెడితే గాలొచ్చినా,వానొచ్చినా ప్రమాదంకదా? దయచేసి మా బ్యాంకులో పెడితే సురక్షితం!"అన్నాను.ఆయన పెద్దగానవ్వి మర్నాడు డిపాజిట్ ఇచ్చాడు.అలానే నే అవార్డు...

Sunday, 29 November 2009

గోదావరి చిత్ర గాన లహరి

అందాల గోదావరికి తెలుగు చిత్ర పరిశ్రమకు మూగమనసులు సినిమాతో అనుబంధం ఏర్పడింది.బాపు రమణలు ఒకరు ప.గో,మరొకరు తూ.గో జిల్లాలకు చెందిన వారు కాబట్టి తమ సినిమాలనుఎక్కువగా గోదావరి తీరంలోనే నిర్మించారు.ఐనా తెలుగు చిత్ర పరిశ్రమ తమ సినిమా పాటలలోగోదావరికి సముచిత స్ఠానం ఇచ్చారు. మొదటి సారి 1952 లో వచ్చిన మరదలు పెళ్ళి లో ఇలా వినిపిస్తుంది. "పిలిచె గోదారొడ్డు,నోరూరించే బందరు లడ్డు" అని శ్రీశ్రీ...

Tuesday, 24 November 2009

నేను -- నాడు... నేడు...

ప్రతి మనిషి ఎప్పటికప్పుడు ఈరోజు నేనేంటి అని కాక నిన్న ఎలా ఉన్నాను. ఇపుడు ఎలా ఉన్నాను.రేపు ఎలా ఉండాలి అని విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. నాడైనా, నేడైనా ప్రతీ అనుభవం ఒక జీవితపాఠంలా మలుచుకుని సాగిపోతూ ఉండాలి. ముప్పై నాలుగేళ్ల క్రిందటి చిత్రాన్ని చూసుకుంటే అప్పటి ఆలోచనలు, పోరాటాలు, లక్ష్యాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడుతాయి....

Sunday, 22 November 2009

ఈ తరం పిల్లలు రకరకాల కార్టూన్లను తనివితీరా(పాపం వాళ్ళకు హొమ్ వర్కు భారంతో అంత టైమూవుండటంలేదు) చూస్తున్నారు.మేం చదువుకునే రోజుల్లో మాకు శెలవులు,మరింత ఆటవిడుపు వున్నా ఇంట్లో చూడటానికి టీవీలు లేవు.కార్టూన్లు చూడాలంటే రెగ్యులర్ ఇంగ్లీష్ సినిమాలతో బాటు ఓ ఐదు నిముషాలు చూసి సంతోషడేవాళ్ళం!మరో విషయం ఆ రోజుల్లో ఇంగ్లీష్ సినిమాలు ఆదివారం ఉదయం ఆటలుగా వేసేవారు.ఆ రోజు నాన్నాగారికి బ్యాంకు శెలవు కాబట్టి మమ్మల్ని తీసికెళ్లేవారు. మెయిన్ పిక్చర్కి ముందు ఐదు నిముషాల్లో...

Saturday, 21 November 2009

నేను ఆడవాళ్ళ సాంప్రదాయాల గురించి వ్రాయటం ఏమిటని అనుకోకండి!మన అభ్యున్నతికి తొడ్పడేది ముందుగా ఆడవాళ్ళే అన్నమాట కాదనలేం.కొందరు ఉద్యోగాలకు బైటకు వెల్తున్నా మన సాంప్రదాయాలను చక్కగాపాటిస్తున్నారు.ఇంట్లో పూజలు,లలితా పారాయణం లాంటివి జరుపుకుంటున్నారు.మన సాంప్రదాయంలో కాళ్ళకు పసుపు రాసి బొట్టుపెట్టి తాంబూలం ఇవ్వటంమంచి అలవాటు.పసుపు మంచి యాంటీ సెప్టిక్ గుణాలు కలిగివున్న విషయంఅందరికి తెలిసిన...

Thursday, 19 November 2009

ఈ ఫొటో నేను రాజమండ్రి యస్.ఆర్.సిటీ.హైస్కూల్లో SSLC చదువుకునేటప్పుడు మార్చి 1956 లో తీసినది. ఇందులో నేను పైనుంచి రెండవ వరుసలో కుడివైపు నుంచి నాల్గవ వాడిని! ఆ వరుసలో మొదట వున్నది నక్కిన శ్రీరామమూర్తి. ఇక్కడే క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు.అదే వరుసలో ఎడమవైపున మొదట వున్నది భాగవతుల మంగశర్మ.భిలై స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ గా రిటైరై ఇక్కడే వుంటున్నారు.తరచు కలుస్తుంటాము.ఆయన సతీమణి భాగవతుల...

Monday, 16 November 2009

నేనప్పుడప్పుడు కవితలు?! స్దానిక దినపత్రిక "సమాచారం" లో ప్రతి ఆదివారం వ్రాస్తుంటాను.మీరు నా ఎదురుగా లేరు కాబట్టిధైర్యంగా కొన్ని కవితలు చూపిస్తాను. "సమ్"గీతమ్ పాత పాటలు ఎంతో మధురం! మంచి పాట ఈ నాటి తెలుగు తెరకు దూరం!! ఎప్పుడో ఎక్కడో మంచి పాటల సంగీతం!! ఇప్పుడు వినిపించేది మాత్రం "సమ్"గీతం!!॰ ...

Sunday, 15 November 2009

కీ"శే"వడ్డాది పాపయ్య వర్ణ ఛిత్రాలు చూడనివారు,అభిమానించని వారు ఎవ్వరు ఉండరు.కాని దురదృస్ట వశాత్తు ఆయన గురించి సరైన ప్రచారం జరగలేదని పిస్తుంది.చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన చందమామ,యువ మాస పత్రికల ముఖచిత్రాలు, లోపలి కధలకు బొమ్మలు ఆయన వేలాదిగా వేసారు. చందమామకు ముందు బాలన్నయ్య,బాలక్కయ్యల "బాల" పత్రిక(1947)లో ఆయన లటుకు-చిటుకు శీర్షికకు,పోలికలు అనే బొమ్మలు,కార్టూన్లు వేసారు.ఆ బొమ్మలు (బాల) కూడా మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను.శ్రీ వడ్డాది శ్రీకాకుళం లో 1921...

Thursday, 12 November 2009

కోతి కొమ్మచ్చిలో నేను

నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే బాపు రమణల కోతి కొమ్మచ్సిలో చిన్న మాట చెప్పడం అదృష్టంగా భావిస్తున్నా...

Wednesday, 11 November 2009

తెలుగువారికి ఒక ప్రత్యేకత వుంది.కొన్ని కొన్ని లక్షణాలనుబట్టి ఎంత మందిలో వున్నా తెలుగువాడిని ఇట్టే పసిగట్టవచ్చు.ఉదాహరణకు :- మీ దోవన మీరు పోతుండగా,ఎవడైనావచ్చి,మీ చెయ్యి మెలిపెట్టి మీ వాచీలో టైము చూసుకొని వెళ్ళిపోతే, వాడు ఖచ్చితంగా తెలుగువాడే అయివుంటాడు. రోడ్డు కడ్డంగా నుంచుని,కార్లు,సైకిళ్ళు,రిక్షాలు,ఆవులు మొదలైన వేటినీ లెక్క చేయకుండా గంటల తరబడి రాజకీయాలు,సినిమాలు చర్చించే...

Tuesday, 10 November 2009

దేశోద్ద్హారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారిచే బొంబాయి లో 1908న వార పత్రిక గా స్ద్హాపించ బడిన ఆంధ్రపత్రిక 1914 లో దినపత్రిక గా మద్రాసు నుంచి వెలువడింది.వార పత్రిక ఈనాటి జిల్లా అనుభంధం సైజులో వెలువడుతూ వుండేది.తరువాత ఇప్పుడు మనం చూస్తున్న వార పత్రికల సైజు లోకి మార్చారు. ఆ రోజుల్లో పత్రిక భాష గ్రాంధికంగా వుండేది. మచ్చుకి 1937 డిసెంబర్ 16వ తేదీ పత్రికలోని అడ్వర్టయిజ్మెంట్ చూడండి: హాయిగా నుండును "మైసూరు చందనము సబ్బు యెంత శ్రేష్టమైనదో: మీగడగా వచ్చు...

Monday, 9 November 2009

గోదావరి నది పై ఇప్పుడు వున్న రెండు వంతెనలలో ఒకటి ఆసియాలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన.పైనున్న రోడ్డు మీదనుంచి వాహనాలు,క్రింద రైళ్ళు,ఆ క్రింద నది పైన నావలు,లాంచీలు వెల్తుంటాయి.వీటన్నిటి కంటే ముందుగా 1900 లో ప్రారంభించిన హావలాక్ బ్రిడ్జి 100 సంవత్సరాలపైన పనిచేసి మూడో వంతెన నిర్మించాక విశ్రాంతి తీసుకొంటున్నది. మూడో బ్రిడ్జి అర్ధచంద్రాకారపు ఆర్చీలతో గొదావరికి కొత్త అందాలు ఇచ్చింది.ప్రతి...

Wednesday, 4 November 2009

గ్రీటింగ్ కార్డుల కధ

ఈనాడు ఆ మైల్ పోయి ఈ మైల్ వచ్చాక ఒకరికి ఒకరు ఉత్తరాల ద్వారా పలుకరించుకోవడం తగ్గిపోయింది.ఇక బజారుకు వెళ్ళి మనకు నచ్చిన గ్రీటింగు కార్డులు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపిక,తీరిక ఉండటంలేదు.నెట్ నుంచి 123 అన్నంత తేలికగా 123 గ్రీటింగ్స్ రకరకాలు మితృలకి ,ఆప్తులకి క్క్షణాల్లో పమ్పిస్తున్నాము.ఐనా మొట్టమొదటి గ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకోడం,జ్ఞాపకం చేసుకుందాం!...

Monday, 2 November 2009

ఫిల్మ్ ఫేర్,ఫెమినా లాంటి పత్రికలను ఎన్నో ఏళ్ళుగా ప్రచురిస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రఛురణల సంస్ద బెనెట్ కోల్మన్ కంపెనీ ఇది వరలో ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే వార పత్రికను ప్రచురించేది. ఎందుకోగాని ఆ పత్రిక ప్రఛురణ చాలా ఏళ్ళ క్రితం నుంచి మాని వేసింది.ఆ పత్రికలో గొప్ప భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్,శిల్పాలు,ఫొటోలు ప్రఛురించేవారు.మా నాన్న గారు ఆ పత్రికలోని అపురూప...

Sunday, 1 November 2009

అపురూపకథ - తిట్టు మాటలు

అలనాటి చందమామ లోని అపురూప కధ తిట్టు మాటలు గాడిద,ఎద్దు,దున్నపోతు కలసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి "దేవా! మానవులు మా చేత ఎంతో చాకిరీ చేయించుకుంటూ వాళ్ళ తోటి మనుషులను,"అడ్డగాడిదా అని,ఎద్దులాగున్నావు, బుద్ది లేదా అని, ఒరే దున్నపోతా!! అని మా పేర్ల తో తిడుతుంటే మాకు చాలా బాధ కలుగుతున్నది.మీరు ఆ మానవులకు చెప్పి తిట్లలో మా ప్రస్తావన లేకుండా చూడండి" అని మొరపెట్టుకున్నాయి.అప్పుడు బ్రహ్మ...

Wednesday, 28 October 2009

బొమ్మల కొలువు

ఇప్పుడు బొమ్మల కొలువులు పెట్టే సాంప్రదాయం తగ్గుతున్నది. ఏమంటే ఈ రోజుల్లో లివింగ్ రూముల్లో ఓ అద్దాల కాబినెట్ కట్టించి అందులో ఇంట్లో ఉన్న బొమ్మలన్నిటినీ పాపం వాటిని ఊపిరాడకుండా ఉంచేస్తున్నాము.ఐనా ఇప్పటికి విజయదశమికి సంక్రాంతికి బొమ్మల కొలువులు పెట్టే అలవాటును కొంతమందైనా పాటిస్తున్నారు. తమిళనాడు లో బ్యాంకుల్లొ కూడా ఈ కొలువులు ఏర్పాటు చేస్తున్నారు. మా రాజమండ్రి లో శ్రీమతి అంబరుఖానా నాగలక్ష్మి,వారి అమ్మాయి శివ దీపిక ప్రతి సంక్రాంతికి పెట్టే...

Tuesday, 27 October 2009

పుస్తకాలే మంచి నేస్తాలు

నేను నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను,అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లొ దొరుకుతాయి కాబట్టి, అలానే నా పాత పుస్తకాలు కూడా ఎవ్వరికీ ఇవ్వను! ఏమంటే అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి అనే నా మాటలు ఛాలా మంది మిత్రులకు కోపంతెప్పిచ్చాయి! అయినా నేను నా మాటకే కట్టుబడి ఉంటున్నాను . అదే మాట పుస్తకప్రియులందరు పాటించాలని నా కోరికనేను చాలా కాలం క్రిందట 1941 సం" ఆంధ్రపత్రిక దినపత్రిక (నే పుట్టిన...

Sunday, 25 October 2009

నిప్పుకోడి -సిరాబుడ్డి

ఇది నిప్పుకోడి బొమ్మ కాదు సుమా! పాత కాలంనాటి సిరా బుడ్డి!!ఈ నిప్పుకోడి బొమ్మచూసారా! మొదటి బొమ్మ రెక్క మూసి ఉంచినప్పుడు మామూలు బొమ్మగా అగుపిస్తున్నది. రెక్కని పైకి తీస్తే నిప్పుకోడి బొమ్మ కడుపులో సిరా పోసుకోవచ్చన్న మాట!. కలం పెట్టుకోడానికి చిన్న స్టాండు వుంచబడింది. ఈ బొమ్మ మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి వుంది.మా నాన్న గారు అప్పటి ఇంపీరియల్ బ్యాంకు లో(ఇప్పుడు స్టేట్ బ్యాంక్...

Saturday, 24 October 2009

బాపూ రమణీయం

బాపు రమణ గార్ల తో నా పరిచయంనాకు కార్టూన్లను గీయాలనే అభిలాషను,హాస్య రచనలు చదవటం,హాస్యంగా మాట్లాడటం నేర్పింది ఇద్దరు మహానుభావులు! వారు ఒకరేమో శ్రీ లక్ష్మీనారాయణ,మరొకరు శ్రీ వెంకటరమణ.1956 నవంబరు నుంచి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర వార పత్రికలో వచ్చిన "బుడుగు-చిచ్చుల పిడుగు" (అప్పుడు నాకు 15 ఏళ్ళు)నా లాంటి అశేష పార్ఠకులను విశేషంగా ఆకర్షించింది.బుడుగు సీరియల్ పూర్తయ్యే వరకు ఛదువరులెవరికీ...

Thursday, 22 October 2009

ప్రముఖ కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ బాబు గారితో నా మొదటి పరిచయం రాజమండ్రిలో 1980 మే నెలలో.అప్పుడు ఆయన బాపుగారి తో "వంశవృక్క్షం"షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చి నాకు ఉత్తరం ఇలా వ్రాసారు."నేను మీ ఊళ్ళోనే వున్నాను.మిమ్మల్ని కలిసే అవకాశం నాకివ్వండి" అప్పటికే ఆయన జూయాలజీ ప్రొఫ్ఫెస్స్రర్ చెస్తూ కార్టూనిస్ట్ గా...

Wednesday, 21 October 2009

మంచి మాట

ఉ(త్త)మ సలహాలు మనము ఇష్టపడి ఏదైనా వస్తువుకొనుక్కొని ఇంటికి వచ్చిన ఏ మిత్రుడికో చూపించామనుకోండి, "ఆ! ఇది కొన్నావా? మాకు తెలిసినవాళ్ళు ఇదే కొన్నారు. రెండు రొజుల్లో పాడైపోయింది" అంటూ కామెంట్ చేస్తుంటారు.మనకు వెంటనే మనసు చివుక్కు మంటుంది. ఒక వేళ కొనేముందు అలాటి సలహాలు (నిజమై తేనే ) ఇవ్వచ్ఛు కాని ఎంతో ఉత్సాహంగా కొన్న వస్తువు చూపించినప్పుడు ఇలాటి ఉత్త సలహాలు ఇచ్చే...

Monday, 19 October 2009

చోద్యం కాకపొతే ...

మా అళ్ళుల్లు మా అమ్మాయి ల మాటలు చక్కగా వింటారు! మా వెధవే వాళ్ళావిడ ఎంత చెబితే అంత!!కార్టూనిస్ట్ శ్ర్ జయదేవ్ గారు మెచ్చిన నా కార్టూ...

Sunday, 18 October 2009

నా పుస్తకం నుంచి

శ్రీముళ్లపూడి వెంకటరమణ గారు మెచ్చిన నా కార్ట...

గోదావరి అందాలు

గోదావరి మాత ఒడిలొ పాపికొండలు.గోదావరి అందాలు పాపికొండలులో చూద్దాం రండి.రాజమండ్రి నుండి పదకొండు గంటల లాంచీ ప్రయాణం గోదావరి అందాలు చూస్తూ పకృతి ఆస్వాదిస్తూ మనసు పులకిస్తు వుంటె సమయం పదినిముషాలలోనే గడిచిపోయిన అనుభూతి కలుగుతుంది. ...
  • Blogger news

  • Blogroll

  • About