ఆగస్ట్ ఒకటివ తేదీ స్నేహితుల రోజట ! మరి మిగతా రోజుల
మాటేమిటి ? మనకు మంచి స్నేహితులు ఏడాది పొడుగునా
కావాలి.
తీయనిదీ, విడతీయనిదీ స్నేహం !
ఆ స్నేహానికి ఏడాదికి ఒక రోజా ? !
బంధాలతో ఏర్పడేది బంధుత్వాల అనుబంధం !!
కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహానుబంధం !!
ఎన్నో ఏళ్ళ బాపు రమణల మైత్రీ బంధం !!
అలాటి ఎన్నెన్నో స్నేహాలకి ఏడాదికి ఒక రోజా ?
అందిద్దాం ఆ స్నేహానికి ప్రతి రోజూ ఓ రోజా ! !
విజయాధిపతులు చక్రపాణి, నాగిరెడ్డి జంటను ఈ సంధర్భంగా
స్మరించుకుంటూ , స్నేహానికి గుర్తుగా గత ఆగస్టులో నాకు
కానుకగా "స్వాతి కార్టూన్ల " పుస్తకాన్ని కానుకగా అంద
చేసిన ఇద్దరు మితృలు శ్రీ బాపు, శ్రీ ముళ్లపూడి వెంకట రమణ
గార్లకు, ప్రియ మితృలు , ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్
గారికి నన్ను అమితంగా అభిమానిస్తూ నన్ను కలవడానికి
ప్రత్యేకంగా రాజమండ్రి వచ్చిన బ్లాగర్ మితృలు శ్రీ కప్పగంతు శివ
రామ ప్రసాద్ గారికి, నా చేత బ్లాగును ప్రారంభింపజేసిన మరో
మితృలు శ్రి భమిడిపటి ఫణిబాబు దంపతులకు, నా బ్లాగును
అందంగా తీర్చిదిద్దటంలో సహకారం అందజేసిన దేవుడిచ్చిన
మరో అమ్మాయి చి.సౌ.జ్యొతివలబొజుకి మా "హాసం క్లభ్"
మితృలు దినవహి వెంకట
హనుమంతరావు, ఖదర్ ఖాన్ లకు, బ్లాగర్ మితృలకు
స్నేహాభినందనలు !
meeku kuDaa
ReplyDeleteమిమ్మలిని ఎక్కడో చూసాననుకుంటున్నా.. ఇప్పుడు తెలిసింది స్వాతి పుస్తకం లో చూశానని. చాలా ఆనందంగా ఉంది మీ బ్లాగ్ చూసాక. నమస్కారమండి.. చాల బాగుంది మీ బ్లాగు..
ReplyDelete