RSS
Facebook
Twitter

Tuesday, 3 August 2010

బొమ్మబొరుసూ




బొమ్మ బొరుసూ
బాపు గారి బొమ్మకి, రమణగారి రచనకి 50 ఏళ్ళు
(15-6-1995) వచ్చిన సంధర్భంగా, ఆ సంతోషానికి
గుర్తుగా నవోదయావారు బొమ్మ బొరుసూ పుస్తకాన్ని
అచ్చొత్తారు. బాపురమణలు అమెరికా చికాగోలో జరిగిన
ఆ నాటి సభకు ఈ పుస్తకాన్ని కానుకగా సమర్పించారు.
ఇందులో పత్రికలలో తప్ప పుస్తకంగా రాని రమణగారి
రచనలూ బాపుగారు ఎప్పుడో రాసిన రెండు కధలూ
(మబ్బూ _వానా _మల్లె వాసనా, అమ్మ _బొమ్మ)
వివిధ రచనలకు గీసిన బొమ్మలు చోటు చేసు
కున్నాయి. అన్నీ కలసి "బొమ్మాబొరుసూ" అయింది.
ఆంధ్రసచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వార పత్రిక, జ్యోతి ,రచన
లనుంచి ఈ రచనలను సేకరించి ప్రచురించారు. ఇంకా
ఇందులో 1945 "బాల " పత్రికలో బాపుగారు వేసిన మొదటి
బొమ్మ, రమణ గారి తొలి రచన కూడా మనం చూడోచ్చు!!
ఇలా ఈ అమూల్య రత్నాలను ఏర్చి కూర్చినది ప్రఖ్యాత రచయిత
శ్రీ యమ్బీయస్.ప్రసాద్ గారు..
ముక్తాయింపుగా ఇందులోని శ్రీ వెంకట రమణ గారి జోకు :
* * * * * * * * * * * * * * * * * *
కుర్రాయన : మా ఆవిడ పెళ్ళయిన కొత్తలో హార్మనీ
వాయించేది. పిల్లలు పుట్టాక మానేసింది.
పెద్దాయిన : సంతానం వల్ల కొన్నిసుఖాలు లేక పోలేదోయ్ !
* * * * * * * * * * * * * * * * * *

0 comments:

Post a Comment

  • Blogger news

  • Blogroll

  • About