RSS
Facebook
Twitter

Saturday, 28 August 2010

భలే భలే వెన్నముద్దలు !

జనార్దన మహర్షి గారి వెన్నముద్దలు రుచి చూశారా?
ఈ వెన్నముద్దలు పుస్తకం చదువుతుంటే ఆ నాటి
చిన్నికృష్ణుడు వెన్నముద్దలంటె ఇందుకే అంత ఇష్ట
పడ్డాడేమో అనిపిస్తుంది. ఈ పుస్తకంలో ప్రతి పేజీ
ఓ ఆణి ముత్యమే. పుస్తకం తెరవగానే ఏ ఒక్క పేజీ
చదవకుండానే జనార్దన మహర్షి గారి ఆలోచనకు
అభిరుచికికి అభినందించకుండా వుండలేము.
. ప్రతి పేజీ పైన కుడి వైపున వివిధ రచయితలను
ఫొటోలను వుంచారు. ఇక మొదటి పేజీ నుంచి చివరి
పేజీ వరకు వదలకుండా చదివిస్తుంది. మచ్చుకు కొన్ని,
మధురాతిమధురమైన
వెన్నముద్దలు రుచి చూడండి.
మా అమ్మ
మా ఆవిడ
నా రెండుకళ్ళు
........
కళ్ళు
ఒకదానినొకటి
చూసుకోవు.
- - - - -
అతను ప్రతిదీ
వెంట్రుక ముక్కలా
తీసి పారేస్తాడు.
.........
చిన్నతనంలోనే
బట్టతల వచ్చింది
- - - - -
ప్రేయసిగా ఉన్నప్పుడు
గంట గడపటానికి గగనమయ్యేది
పెళ్ళాం అయ్యాక
గంట భరించడం భారంగా వుంది.
- - - -
ఎందుకా ఏడుపు
ఎవడు పోయాడట.
పక్కింటోడు
ఎదిగిపోయాడట.
-- - - -
చదివారుగా, ఇవి సాంపిలు మాత్రమే.ఇలాఎన్నెన్నో
ప్రతి పేజీలోనూ మిమ్మల్ని అలరిస్తాయి.ఆలోచింప
చేస్తాయి!
ఎమెస్కో బుక్స్ విజయవాడ వారి దగ్గర ఈ పుస్తకం
దొరుకుతుంది.దొరకడం అంటె ఇంత మంచి పుస్తకం
ఎవ్వరూ పారేసుకోరు కాబట్టి కనుక్కుని కొనుక్కోవాలన్న
మాట !!


4 comments:

  1. ఇంత మంచి రుక్కుల బుక్కు - దొరికే అడ్రసు కూడా చెబ్తే సౌకర్యంగా ఉంటుంది.

    ReplyDelete
  2. " మా అమ్మ
    మా ఆవిడ
    నా రెండుకళ్ళు
    ........
    కళ్ళు
    ఒకదానినొకటి
    చూసుకోవు"
    -వా వా! చాలా బాగున్నై.

    ReplyDelete
  3. జనార్దన మహర్షి వెన్నముద్దలు ఎమెస్కో బుక్స్,
    ఏలూరు రోడ్డు,విజయవాడ.ఫోను:0866-2577498,
    2575281 వారికి వ్రాయండి.

    ReplyDelete
  4. bagundi pustakam .....parichayam chesaaru... thanks

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About