ఈ నెల 13 న పుట్టిన రోజు జరుపుకున్న మితృలు
డాక్టర్ జయదేవ్ బాబు గారికి ఆయన అశేష అభిమానుల
తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నలభై
ఎనిమేదేళ్లకు పైగా వేలాది కార్టూన్లు గీసిన ఈ మంచి
మనసున్న తెలుగు వెలుగు మన జయదేవ్ బాబు గారు.
బెల్జియం దేశం వాళ్ళు నాక్ హీస్ట్ లో నిర్వహించే అంతర్జాతీయ
పోటిలకు పదేళ్ళు వరుసగా కార్టూన్లు పంపి, ప్రశంసలందుకోవడమే
కాకుండా, చివరకు ఆ కార్టూన్ పోటీలకు జడ్జి గా నియమింప బడ్డ
తెలుగు తేజం మన జయదేవ్. ఆయన గీతలు ఎన్ని సార్లు చూసినా
తనివి తీరదు. ఆ గొప్ప వ్యక్తి నాకూ ఆత్మీయుడయినందుకు ఆ
భగవానునికి నమోవాకాలర్పిస్తూ ఆయన గీసిన అద్భుత కార్టూన్లు
కొన్ని మీ కోసం. ఈ కార్టున్లను నా బ్లాగులో ఉంచడానికి పెద్ద
మనసుతో అనుమతించిన శ్రీ జయదేవ్ బాబుకి కృతజ్ఞతలతో.
నేను తెలుగు వికీపీడియాలో జయదేవ్ గారి గురించి వ్యాసం వ్రాసి, "తెలుగు ప్రముఖులు" అన్న టాగ్ ఉంచాను. కాని అక్కడ నిర్వాహకుడిగా ఉన్న నిరక్షరాశ్యుడెవరో ఆ టాగ్ తొలగించారు. జయదేవ్ వంటి ప్రముఖ తెలుగు కార్టూనిస్టు "తెలుగు ప్రముఖుడు కాకపోతే మరింకెవరు ప్రముఖులు అవుతారో, ఆ వికిపీడియాలో ఉన్న నిర్వాహకులికే తెలియాలి. అందుకే వత్తులు పొల్లులు దిద్దితే చాలు నిర్వాహకుడయిపోయే అక్కడ వ్రాయటం మానేశాను. .
ReplyDelete