దామెర్ల రామారావు, అడవి బాపిరాజు,వరదా వెంకటరత్నం,
అంకాల వెంకట సుబ్బారావు,కె.వేణుగోపాలరావు వంటి
కళాకారులెందరో తెలుగు చిత్ర కళకు ఎనలేని పేరు
ప్రఖ్యాతులు తెచ్చారు. ఇలానే శ్రీకాకుళం లో సెప్టెంబరు
10,1921 లో జన్మించిన శ్రీ వడ్డాది పాపయ్య ప్రముఖ
వర్ణచిత్ర కళాకారుడు. మన బ్లాగులో ఈయన గురించి
ఒక సారి చెప్పుకున్నాం .మరో సారి ఆయనను స్మరించు
కోవడం తెలుగు వారిగా మన ధర్మం. చందమామ
పత్రిక ముఖచిత్రాలుగా ఈ నాటికీ ఆయన చిత్రాలు చూసే
అదృష్టం కలుగుతున్నది. ఆనాటి "యువ" మాస పత్రిక
ముఖచిత్రాలుగా, అట్ట లోపలి పేజీలలోను వడ్డాది చిత్రాలు
కనుల పండుగ చేసేవి. యువ దీపావళి సంచికల ముఖ
చిత్రాలు మరీ ప్రత్యెకం. ఇక్కడ మీరు ఆ నాటి ముఖచిత్రాలను
కొన్నిటిని చూపించడానికి ప్రయత్నించాను.
వడ్డాది గారు స్వాతి వారపత్రికకు కూడా ముఖచిత్రాలు గీసేవారు.నేను వారి అభిమానిని.ఆయనకు రావల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది.నా దగ్గర ఆయన పాత ఇంటర్వ్యూ ఒకటుంది.వీలు కుదిరినప్పుడు బ్లాగులో update చేస్తాను.
ReplyDelete