నవ్వుల బొమ్మల డా" జయదేబాబు గారుప్రొఫెసరుగా
జూయాలజీ పాఠాలు చెప్పేసి ఈ నాటికీ తన అభిమాన
పాఠకులకు నవ్వుల బొమ్మలు అందిస్తూ గ్లాచ్చు మీచ్యూ
అంటూ తన కధలు,మితృల కధలుచెప్పారు. ఆ పుస్తకం
నిన్ననే ఆయన కానుక గా పంపించారు.. సరిగ్గా 30
ఏళ్ళ నాడు ఆయన నాకు ( 26 May,1980) ఓ
ఉత్తరం ఇలా వ్రాసారు.
" నేను మీ వూళ్ళోనే వున్నాను.
మిమ్మల్ని కలిసే అవకాశం నాకివ్వండి.
ఉంటాను.
మీ
జయదేవ్"
ఆనాటికే ఆయన సర్ త్యాగరాజ కాలేజీ లో జూయాలజీ
ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన కార్టూనులు బెల్జియం,
జెకొస్లోవేకియా వంటి యితర దేశాల పత్రికలలోబాటు,రీడర్స్
డైజెస్ట్, కార్వాన్, శంకర్స్ వీక్లీ లాంటి ప్రముఖ పత్రికలలోప్రచురించ
బడ్డాయి. అప్పుడప్పుడు కార్టూనులు గీసే నాకు ఆయన అలా
ఉత్తరం వ్రాసారంటే శ్రీ జయదేవ్ వ్యక్తిత్వం ఎలాటిదో వేరే చెప్పాలా!
నిన్న సాయంత్రం ఆయన దగ్గర నుంచి పుస్తకం అందగానే ఆ
పుస్తకం ఆసాంతం చదివే పడుకున్నాను. శ్రీ ముళ్ళపూడి కోతి
కొమ్మచ్చిలో మనల్ని ఎన్నికొమ్మల పైకి తీసుకొని వెళ్ళి దూకించారో
అలాగేశ్రీ జయదేవ్ ప్రతి పేజీలోనూ మనల్ని గ్లాచ్చు మీచ్యూ అంటూ
ఆత్మీయంగా పలకరించారు. ప్రతి పేజీ చదువుతుంటే ఏడాది క్రితం
మద్రాసులో ఆయనింటికి నే వెళ్ళినప్పుడు కలిగిన మధురానుభూతి
కలిగింది. శ్రీమతి మాలతీ చందూర్ గారన్నట్టు ఆయన వర్ణించిన
మద్రాసులోని చాకలిపేట వీధి,ఆ ప్రక్క వీధిలో నున్న దుకాణాలు,
అరటాకులు అమ్మే కొట్లు ఇలా ఒకటేమిటి ప్రతిదీ కళ్ళకు కట్టినట్లు
వ్రాసి చూపించారు. నాకు ఆంధ్రవారపత్రిక ఎంతో ఇష్టమైన పత్రిక.
ముళ్ళపూడి వారి "బుడుగు-చిచ్చులపిడుగు" సీరియల్ గా అందులోనే
వచ్చింది. నా మొదటి కార్టూన్ కూడా అందులోనే అచ్చయింది. ఆంధ్ర
పత్రిక ఆఫీసుకు శ్రీ జయదేవ్ మొదటి సారి వెళ్ళి సంపాదకులు
రాధాకృష్ణ గారితో కలసిన విశేషాలు, అక్కడి పేపరు వాసన వర్ణించిన
తీరు నేను ఆంద్రపత్రిక ఆఫీసు చూడకపోయాననే తీరని కోరికను
తీర్చింది. ఇంకో విషయమం , " మిమ్మల్ని కలిసే అవకాశం నాకివ్వండి"
అంటూ ఆయన వ్రాసిన ఉత్తరం గురించి ఇంతకు ముందు చెప్పాను
"వంశవృక్షం" షూటింగ్ కోసం యూనిట్తో ఆయన రాజమండ్రికి వచ్చి
ఆయన బస చేసిన హోటల్ మేడూరి, రూమ్ నాంబరు 135, సెకండ్
.ఫ్లోర్. నేను మా పెద్దమ్మాయి మాధురిని(ఇప్పుడు పెళ్ళయి మద్రాసులోవుంది)
తీసుకొని వెళ్ళి ఆయన్ని కలిసాను. అప్పుడే రూములోకి తెల్ల షర్టు,
తెల్లపాంటు వేసుకొని వచ్చిన తెల్లని సన్నని అబ్బాయిని, "ఈయనే
హీరో అనిల్ కపూర్ " అని జయదేవ్ పరిచయం చేశారు. ఇవన్నీ రాత్రి
వంశవృక్షం షూటింగు-అనిల్ కపూర్ తో తెలుగు తంటా (102) పేజీ
చదవగానే గుర్తుకొచ్చాయి. క్రోక్విల్ శంకు గారు మా కార్టునిస్టులందరికీ
ఆత్మీయులు. శంకుగారి ఇంటికి వెళ్ళే అదృష్టం నాకూ కలిగింది.జయ
దేవ్ గారి ప్రత్యేకత ఆయన గురించి రాసుకొన్న పుస్తకమైనా ఆయన
మితృల గురించి వాళ్ళు సాధించిన ప్రతిభా విశేషాలను విపులంగా
వివరించడం గొప్ప విషయం. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ ఆర్కే లక్ష్మణ్ మద్రాసు
వచ్చినప్పటి కబుర్లు, ముఖ్యంగాఆయన "Everybody is famous
here?" అనడగటం, చంద్ర గారు " I am the only famous Cartoonist
here" అని జవాబివ్వటం విని,మిగతా వారంతా పక్కకి తిరిగి నవ్వుకుంటే
నేనది చదివి కడుపారా తృప్తిగా నవ్వుకున్నాను. చిన్నప్పటి విశేషాలు,
కర్రకు ఆ చివర కట్టిఅమ్మే జిగురులా సాగే మిఠాయి, ఇత్తడి గిన్నెలకు
కలాయి వేసేవాళ్ళ గురించి చదివి ఆనాటి రోజులు గుర్తుకొచ్చాయి. బడి
దగ్గర ఈ మిఠాయిలతో వాచీలు అవీ తయారు చేసి చేతికి తగిలించే వారు.
అలానే ఇత్తడి పాత్రలకు కళాయి పూసే వాళ్ళ గురించి బాగా గుర్తు చేసారు.
ఇలా ఈ పుస్తకం చదివిన వాళ్ళు "గ్లాచ్చుటు రీడ్యూ" అని ఈ పుస్తకంతో
తప్పక అంటారు. ఈ పుస్తకంలో మరో కొత్తదనం ప్రతి పేజీకార్నరులోనూ
అద్భుత మైన కార్టూన్లుండటం! 59 పేజీలోని కార్టూను నాకు చాలానచ్చింది.
నేటి కాలం "ప్రేమ" గురించి అమ్మాయి దృష్ఠి, అబ్బాయి దృష్ఠి అద్భుతంగా
జయదేవ్ ఈ చిన్న కార్నర్ బొమ్మలో చూపించారు. ఈ సారి
బుక్ స్టొర్ కి వెళ్ళినప్పుడు ఈ పుస్తకం తీసి"కొని" చదివితే మీరు" గ్లాచ్చు
మీచ్యూ" అని తప్పక అంటారు.
ఇక్కడ బొమ్మల్లో జయదేవ్ గారి కార్టూన్స్ (స్వాతి పబ్లికేషన్స్,
1983) ,జయదేవ్ కార్టూన్లు( మీడియా హౌస్ పబ్లికేషన్స్),గ్లాచ్చుమీచ్చూ
(వియన్నార్ బుక్ వరల్డ్ ,చౌడెపల్లి) పుస్తకాలు, నేను గత ఏడాది జయదేవ్
గారిని మద్రాసులో వారింటిలో కలిసినప్పటి ఫొటో, మా ఎస్బీఐ ఎవార్డు
ఎంప్లాయీస్ అస్సోసియేషన్ వారికి వేసిన "KEY TO INTERNAL STORY"
అన్న బుక్లెట్ వున్నాయి.
I still remember his excellent cartoons in vijaya monthly.
ReplyDelete