ఈ రోజుతో నా బ్లాగు మొదలుపెట్టి ఏడాది పూర్తయింది.
నా బ్లాగు ఇంతకాలం విజయవంతంగా నిర్వహించడానికి
సాయం చేసినముగ్గురు త్రిమూర్తులకు నా ధన్యవాదాలు
తెలియజేయడంనా కనీస ధర్మం.
పూనాలో నివాసముంటున్న శ్రీ భమిడిపాటి ఫణిబాబు,
శ్రీమతి లక్ష్మి దంపతులు.కొంతకాలం గోదావరీ తీరంలో
(వారిది మా గోదావరి జిల్లాయే) గడపాలనే సదుద్దేశంతో
రాజమండ్రి వచ్చి ఇటీవలే తిరిగి పూనా వెళ్ళారు. ఇక్కడ
వుండగా ఓ మూడో ఆదివారం మా "హాసం క్లబ్" కు నవ్వులు
పంచుకోడానికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నా పుస్తకాలు,
అలనాటి చందమామలు, గ్రామఫోన్ రికార్డులు చూసి అమితంగా
ముచ్చట పడటమే కాకుండా నన్నో బ్లాగు ప్రారంభించమని
ప్రోత్సహించారు. కంప్యూటర్లో ఈ మైల్ ఇవ్వడ తప్ప నాకు
మరేమీ తెలియదు మహప్రభో అంటే వినకుండా వారింటికి
వెళ్ళినప్పుడు బ్లాగులో నా ఖాతా తెరిచి జ్యోతి గారికి( గారు
అంటే మా చి"సౌ"జ్యోతికి మా చెడ్డ కోపం వస్తుంది) పరిచయం
చేశారు. నేను బొమ్మలు,ఫొటోలు, కధనాల్ని మైల్ చేస్తే జ్యొతి
గారు, సారీ అమ్మాయి జ్యోతి అందంగా నా బ్లాగులో వుంచేవారు.
సాహిత్య అభిమాని,మన తెలుగు చందమామ బ్లాగులను
అద్భుతంగా నిర్వహించే శ్రీ శివరామప్రసాద్ గారు బెంగళూర్ నుండి
విజయవాడ వస్తూ నన్ను కలవడానికి జనవరి 17 వ తేదీన
రాజమండ్రి వచ్చారు. నా కీ గ్రామఫోన్ ఫొటో తీసి నా చేత ఆ
రోజు బ్లాగును పోస్ట్ చేయించారు.అలా ఆయనా నా గురువు
గారే! తరువాత కూడా ధైర్యం చాలక బ్లాగు మేటర్ చి.జ్యోతికి
మెయిల్ చేస్తుండేవాడిని. ఒక రోజు ధైర్యం చేసి నేనే పోస్ట్
చేయడం ప్రారంభించా. నా బ్లాగు ప్రారంభించాక ఎందరో
బ్లాగర్లు మితృలయ్యారు. వారిలో "చిత్రచలనం" బ్లాగును
నిర్వహించే శ్రీ బి.విజయవర్ధన్ ఒకరు. నాకు పుస్తకాలు
కార్టూన్లంటే ఇష్టమని The cartoon Craft of R.K.Laxman
and Bal Thakeray అనే పుస్తకాన్ని కానుకగా పంపించారు.
ఈ పుట్టిన రోజు సంధర్భంగా దేశవిదేశాల్లో వున్న బ్లాగర్
మితృలందరికీ నా శుభాభినందనలు.
ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు మా ఇద్దరమ్మాయిలు
చి.సౌ.మాధురి,చి.సౌ.మాధవి, దేముడిచ్చిన మా మూడో
అమ్మాయి చి.సౌ.జ్యోతి.వి ( ఓ సారి మీకు శ్రమిస్తున్నాను
అని వ్రాస్తే "అలా ఐతే నే వ్రాయనంతే" అంటూ మా అమ్మాయిలను
గుర్తుచేసారు). మిగిలిన రెండు ఫొటోలు శ్రీ భమిడిపాటి దంపతులు,
శ్రీ శివరామప్రసాద్ మా ఇంటికి వచ్చినప్పటి తీపి గుర్తులు!
బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు.రేఖాచిత్రాలతో మమ్మల్నెప్పుడూ అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ గురుబ్రహ్మ గురుఃవిష్ణు గురుదేవో మహేశ్వరులకు వందనాలు.
ReplyDeleteచాలా సంతోషం అండీ. అభినందనలు
ReplyDeleteMany more happy returns of the day..
ReplyDeleteగురువు గారూ,
ReplyDeleteముందుగా మీ 'పుట్టిన రోజు' శుభాకాంక్షలు.అందులో నేను చేసినదేమీ లేదు.అదేదో సామెత ( తాటిచెట్టుమీద కాకి వాలగానె తాటిపండు కిందకు పడితే, ఆ ఘనత అంతా తనదే అనుకుందిట ఆ కాకి) చెప్పినట్లుగా, వ్రాసేది మీరూ
ఘనంత అంతా మాకూ ఇవ్వడంలోనే చూపించారు మీ గొప్పతనం.మీ దగ్గర ఉన్న అపార సాహిత్యసంపద ని అందరితోనూ పంచుకోవాలని కోరుతున్నాను.ఆ మధ్య మీ (మన) దేముళ్ళు శ్రీ బాపు,రమణ గార్లతో ఇదే విషయం ప్రస్తావించాను.
వారి దగ్గరకంటె మీదగ్గరే వారిద్దరికీ సంబంధించిన సాహిత్య సంపద ఉందని చెప్పాను.
ఇదంతా బాగానే ఉందీ, అసలు ఈ విజయానికి వెనుక, మిమ్మల్ని 'భరిస్తున్న' శ్రీమతి పద్మ గారిని అభినందించాలీ అంటోంది మా ఇంటావిడ లక్ష్మి.
ఎంతో అభిమానంతో మరో సారి నాకు ఉత్సాహాన్ని
ReplyDeleteకలిగించిన మీ అందరికీ పేద్ద టాంక్సులు!
"....వ్రాసేది మీరూ, ఘనంత అంతా మాకూ ఇవ్వడంలోనే చూపించారు మీ గొప్పతనం..."
ReplyDeleteహరేఫలగారు చక్కగా చెప్పారు. మీ దగ్గర ఉన్న సాహితీ సౌరభాన్ని అందరితో పంచుకునే మీ సంస్కారమే మీ బ్లాగు విజయానికి కారణం. మీరు, మీ బ్లాగు ఇలా కలకాలం, మూడు పోస్టులు, ఆరు "పనికి వచ్చే" వ్యాఖ్యలతో, ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన చర్చలతో విలసిల్లాలని, బ్లాగ్.కాం వారిని ప్రార్ధిస్తున్నాను. ఆ భగవంతుడు ఎప్పుడూ మీ పక్షం, కాబట్టి ప్రత్యేకంగా ఆయనకు చెప్పవలసినది లేదు.
బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteశుభాకాంక్షలు. మీలాంటి గొప్ప కార్టూనిస్ట్‌ని ఇలా బ్లాగు ద్వారా కలుసుకోవడం మాకు ఆనందదాయకం. మీ బ్లాగు దినదినప్రవర్థమానమై వెలుగొందాలని ఆశిస్తున్నాను.
ReplyDeleteశుభాకాంక్షలండీ... మీ బ్లాగు ఇలాగే మూడు టపాలు, ఆరు వ్యాఖ్యలతో కలకాలం వర్ధిల్లాలి...
ReplyDeleteఓ బ్లాగును బహు బాగుగా బ్లాగీకరిస్తూ ' బ్లాగు దినోత్సవం'
ReplyDeleteజరుపుకోవడం..............
' శ్లాఘనీయ బ్లాగు ' గా ఆమోదముద్ర వేయించుకోవడమనేది అంత ఆషా-మాషీ యవ్వారం కాదు. అందుకే అందుకోండి నా అభినందన బ్లాగాభి వందనములు . మీ బ్లాగు ఇలాగే నవ్వులు పంచుతూ సాహిత్య వనములో ఆనంద పువ్వులు పూయించాలని మనసారా కోరుకుంటూ ...........
మీ అభిమాని , తోటి బ్లాగరి
డా. కె.వి . రమన మూర్తి
( మధురమే సుధాగానం )
Congratulations from Krishna Sai, Nagalakshmi, Kaustubh
ReplyDeleteKoduku, Kodalu, Manavadu
Mumbai
మీ టపాలు అన్నీ చదవటానికి హాయిగా వుంటాయి. పైగా మీ దగ్గర వున్న "సంపద" మాతో పంచుకుంటున్నందుకు మీకు అనేక ధన్యవాదాలు. మీ బ్లాగు ఇలాగే హాయిగా కొనసాగాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteమీ రేఖా చిత్రాలు మమ్మల్ని ఇంకా ఎంతో అలరించాలని కోరుకుంటూ మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు :-)
ReplyDeleteబ్లాగు జన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteశుభాకాంక్షలు
ReplyDeleteబ్లాగు జన్మదిన శుభాకాంక్షలు.. మీ నిధినిక్షేపాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు..
ReplyDeleteబ్లాగు జన్మదిన శుభాకాంక్షలు .
ReplyDeleteశుభాకాంక్షలు .
ReplyDeleteశ్రీ అప్పారావు( సురేఖ) గారికి..
ReplyDeleteచాలా సంతోషం అండి.. మీ బ్లాగులు వినోదం, విజ్ఞానం కలగలసిన రేఖా చిత్రాలు..
మీరు ఇలాంటి పుట్టిన రోజులు మళ్లీ మళ్లీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ..
say love (సెలవు)
మీ బ్లాగు కి జన్మదిన శుభాకాంక్షలు....
ReplyDeleteబ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలండి.
ReplyDelete