ఇప్పుడు అన్నీ దినాలే! అదేనండి ఒక్కొ సంధర్భానికి ఒక్కో
రోజు.! డాక్టర్ల రోజు, అలానే ఒక్కో రోగానికీ ఒక్కోరోజు.!
స్నేహితుల రోజు,ప్రేమికుల రోజు అలాగే ఈ వేళ అక్టోబరు
ఒకటో తేదీ, సీనియర్ సిటిజన్స్ రోజట! ఈ మధ్యే సీనియర్
సిటిజన్స్ ఫొరమ్ అని రాజమండ్రిలో ఏర్పాటు చేసారు. ఈ
ఒకటొ తేదీన ఓ సీనియర్ సిటిజన్ కు సత్కారంచేస్తారట.!
ఎన్నయినా చెప్పండి, ఎవరైనా నన్ను ముసలాయన అంటే
అసలు పడదు. వయసు పెరగొచ్చు కాని మనసుకు మాత్రం
ముసలితనం అనేది లేదని నా నమ్మకం. ఇంతకు ముందు
ఎవరైనా రిటైరయితే వాళ్ళ ఆఫీసు వాళ్ళు సత్కారం చేసి
ఓ చేతి కర్ర, భగవద్గీత పుస్తకం ఇచ్చేవారు. బజార్లో కూడా
రకరకాల చేతి కర్రలు అమ్మేవారు. ఇప్పుడు రోజులు మారాయి.
పూర్వం రిటైరయిన వాళ్లంతా ఏ పురాణ కాలక్షెపం దగ్గరో
రోజూ కలిసే వారు. ఇప్పుడో వాళ్ళంతా సాయంకాలం బిజీగా
వుండే పార్కుల్లో కలుసుకుంటున్నారు.పరిస్థితులు మారాయి.
ఆయుర్దాయం పెరిగింది. దృక్పధం మారింది. దూరంగా వున్న
పిల్లల దగ్గరకు వెళ్ళి వస్తూ హాయిగా కాలం గడుపుతున్నారు.
నా మట్టుకు నాకు బాంకులో ఉద్యోగం చేస్తున్నప్పటి కంటే
ఇప్పుడే బిజీ లైఫ్ గడుపుతున్నాను. నేను పదవీ విరమణను
మూడేళ్ళ ముందే తీసుకున్నాను. నన్ను కౌన్సిలింగ్ చేయ
డానికి జోనల్ ఆఫీసుకు పిలిపించి మా డీజీయం, "రిటైర్మెంట్
నిర్ణయం ఇంట్లో చెప్పారా?" అని ఏదో మన కారుకు అడ్డం వచ్చిన
వాడిని, ఇంట్లో చెప్పే వచ్చావా? అని అడిగినట్లు, అడిగారు. నేను
చెప్పిన సమాధానం " Sir, I want to live some more time
happily even after my retirement" అని. వెంటనే ఆయన
ఓకే అనేశాడు. తరువాత, నే విన్నది, మూడు నెలల తరువాత
ఆయనా అదే నిర్ణయం తీసుకున్నాడని!.మంచి పుస్తకాలు,
సంగీతం, ఎదో ఓ హాబీ ని అలవాటు చేసుకోవడం, హాస్య రచనలు
చదవడం లాంటి అలవాట్లను చేసుకుంటే ముసలి తనం మన
దగ్గరకు చేరడానికి భయపడుతుంది!
షరా మామూలుగా ఓ చిన్న ముళ్ళపూడి వారి జోకు..
యాభై ఐదేళ్ళు పైబడ్డ ఒహాయన రాత్రి పడుకో
బోయేటప్పుడు "నవజీవన యవ్వన గుళికలు"
ఆబగా ఓవర్ డొస్ పుచ్చేసుకున్నాడు.తెల్లారాక
భార్య లేపగా, లేపగా,చివరకు మేలుకొన్నాడు.
"అబ్బ, ఏంటే అప్పులే నిద్దర్లేపుతావు, నే నివ్వాళ
బలికెళ్ళను" అని గారాలు పోయాడు.
....రసికజన మనోభిరామము నుండి
>>>>>>>>>>>>>>>>
బాపు గారి కార్టూన్ "జ్యొతి" మాస పత్రిక సౌజన్యంతో..
పార్కులొ కూర్చున్న ఓ పెద్దాయనతొ మందు
లమ్ముతున్న మనిషి "మహత్తర యవ్వన
గుళికలు బాబూ,ఒక్క బుడ్డి సేవిస్తే పదేళ్ళు
వెనక్కి వెడతాయి" అంటే
ఆ పెద్దాయన అంటాడు" బానేవుందిగానీ నా
పించను కేం ఇబ్బందిరాదు కదా..,."అని.
( బొమ్మలో అక్షరాలు బాగా అగుపించవేమోనని
వ్రాశా, పెద్దాయనకు ఏమిటీ చాదస్తం అనుకోకండేం!")
0 comments:
Post a Comment