ఈ పెన్సిల్ పోట్రయిట్స్ చూసారుగా! వీటిని ఇంత అద్భుతంగా
గీసింది శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు. సత్తిరాజా, ఈ ఇంటి
పేరెక్కడో విన్నట్టుంది కదూ! నిజమే నండి.! ఆ ఇంటి పెరు గల
ఆంధ్రుల అబిమాన చిత్రకారుడు శ్రీ బాపు అనే సత్తిరాజు లక్ష్మీ
నారాయన. ఆయన తమ్ముడే ఈ శంకరనారాయణ గారు.
ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాక
ఆయన పోట్రైట్ చిత్ర రచనకు మరింత పదును పెట్టారు. ఆయన
ప్రముఖుల ముఖచిత్రాలను జీవకళ ఉట్టిపడేటట్లు చిత్రించారు.
అల్లు నుంచి ఆలీ దాకా, జానీవాకర్ నుండి జానీలీవర్ దాకా,
బాలసరస్వతి నుంచి బాలూ దాకా, బర్మన్ నుండి రెహ్మాన్ దాకా
ఎంతో మంది రేఖా చిత్రాలను శ్రీ శంకరనారాయణ వేశారు వాటిల్లో
కొన్ని మీరిక్కడ చూడొచ్చు. శ్రీ శంకరనారాయణ ముళ్లపూడి
వెంకట రమణ గారి వియ్యంకులు కూడా!! శ్రీ శంకర్ గీసిన బొమ్మలను
బాపు బొమ్మ.కామ్,తెలుగునిధి .కామ్, టోటల్ టాలీవుడ్.కామ్ లలో
చూడొచ్చు." హాసం బుక్స్" వారు "హాసరేఖలు" పేరిట దాదాపు
80 బొమ్మలతో ( హాస్య-సంగీత కళాకారులు) శ్రీ యస్వీ.రామారావు,
యమ్బీయస్.ప్రసాద్ పరిచయాలతో ప్రచురించారు
,
"జీవం" అనే పదార్థాన్ని పెన్సిల్లోనుంచి కూడా చెవులు మూసి చావగొట్టి బయటకు తీయొచ్చని శంకరనారాయణ నిరూపించారు...అందుకు వారికి సహస్ర కృతజ్ఞతలు....అవి మాకు అందించిన మీకు శతసహస్రాలు...
ReplyDeleteభవదీయుడు
వంశీ