.
గెడ్దాలగురించి కొంచెం చెప్పాలనివుంది. హాస్యబ్రహ్మ
జ్యంధ్యాలగారి ఓ సినిమాలో ఈ డైలాగుంటుంది. పంజాబ్
వెళ్ళి బార్బర్ షాపెట్టినట్టు అని. మరో విషయం మీకు
తెలుసా, సిక్కయినా, శిఖ్ఖయినా గెడ్డం పెంచుతారు.
ఈ మధ్యనే మా హాసం మితృడు హనుమంతరావు
సకుటుంబంగా కాశీ వెళ్ళి సిక్కయ్యాడు. హిందువుగా
వెళ్ళి శిఖ్ఖయి వాచ్చారన్నమాట అన్నాను. పూర్వం
ఋషులందరికీ గెడ్డాలు, మీసాలు తప్పక వుండేవి.
ఎక్కడో అరణ్యాలలో ముక్కుమూసుకొని తపస్సు చేసు
కొనే వారికి మీసాలు,గెడ్డాలు పెరగక మానవు గదా!
ఇప్పటీకీ కొందరు నిష్టగా ఆచారాలు పాటించేవారు
గెడ్డం చేసుకోవడానికి వారం వర్జ్యం పాటిస్తుంటారు.
. అప్పటి రోజుల్లో ఇప్పటి లా ఉద్యోగాలు చేసే
అవసరం అంతగా లేక పోవటం చేత గెడ్డాలు పెంచు
కున్నా ఇబ్బంది లేదు. కానీ ఈ రోజుల్లో మాసిన గెడ్డంతో
ఆఫీసుకు వెళితే అదోలా చూస్తారు. కొందరు మొగాళ్ళకు
గెడ్డమే అందం.ఆరుద్ర గారు తన "ఇంటింటి పజ్యాలు"లో
మగాడి గెడ్డం గురించి ఇలా వ్రాశారు.
" రోజూ గీసుకోని మగాడి గెడ్డం
మోజున్న సరసానికొస్తుందా అడ్డం ?"
ఆరుద్ర అనుభవంమీదే చెప్పుంటారు. ఏ మంటే ఆయనా
గెడ్డం పెంచేవారని మీకు తెలుసుగా! నాకు స్టూడెంట్ గా
వున్నప్పుడు ఓ సందేహం వచ్చేది. శ్రీరాముల వారు,
లక్ష్మణ స్వామి అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళు క్లీన్
షేవ్ తో అగుపించేవారుకదా, ఎలాగా అని. ఆ విషయాన్ని
మా నాన్నగారిని అడిగితే బాణం ములుకుల్ని ,ఇప్పటి మన
బ్లేడుల్లా ఉపయోగించివుంటారు అని సమాధానం చెప్పారు.
నిజమే కావొచ్చు గదా?! ఇక గెడ్దం తో వుండే ప్రముఖులు
దేశ విదేశాల్లో ఎంతోమంది వున్నారు. అదేమిటొ సైంటిస్టులకు,
ప్రొఫెసర్లకు తప్పక గెడ్డం వుండి తీరుతుంది. చార్లెస్ డార్విన్,
అబ్రహంలింక్లన్,రవీంద్రనాధ్ ఠాగూర్ ఇలా ఎందరొ! మన గత
తెలుగు సినిమాల్లో హీరో మారువేషం కోసం ఓ గెడ్డం పెట్టు
కొనే వాడు. అదేం విచిత్రమో విలన్, హీరోయిన్ ,మరెవరూ
కూడా హీరోను గుర్తుపట్టరు.!! అర్జనుడుకూడా గెడ్డం పెట్టుకొనే
మారు వేషంలో సుభద్రను కలుస్తాడు. సినిమాల్లో,నాటకాల్లో
గెడ్డంవేషాలువేసేవారికి ఓ ప్రత్యేక గమ్ తో గెడ్డాలు, మీసాలు
అతికిస్తారట. "మాయాబజార్" తమిళ వెర్షన్ లో బలరాముడు
పాత్రధారికి ఆ గమ్ ఎలర్జీ అవటం వల్ల గెడ్డం లేకుండానే
అగుపిస్తాడట!!
ఇక గెడ్డాల మీద నానుడులూ వున్నాయి. "అడ్డాలు నాడు
పిల్లలు కాని, గెడ్డాలు దాకా కాదుకదా" అనేది ఒకటి. ఇప్పటి
యువ హీరోలు చిరు గెడ్డం ( చిరంజీవి గెడ్డం కాదు) తోనే అగు
పిస్తున్నారు. అదో ఫాషన్ ఈ కాలంలో.ఇలా గెడ్డాల గురించి
వ్రాయాలంటే ఎంతైనా రాయొచ్చు.పూర్తయేటప్పటికిమనకు
గెడ్డాలు మీసాలూ పెరగటం ఖాయం.ఆ భయం చేతే ఫుల్ స్టాప్
పెట్టేస్తున్నాను.
ఆదిలోనే హంస పాదంలా "గెడ్డం" ఇబ్బంది పెట్టింది. "గెడ్డం" బదులుగా
ReplyDelete"గెడ్దం" అని పడింది. గెడ్డం పట్టుకు బతిమాలుతున్నా "అచ్చుతుప్పు"
క్షమించేయండి.
ముందు మీరు మీసాలు గడ్డాలు ఎందుకు మొలుస్తాయో తెలుసుకొని వాటిగురించి చెప్పండి
ReplyDeleteవెంట్రుకలనేవి శరీరానికి అనుబంధ అవయవం ఇవి శరీరం నుండి విడుదలయ్యే నాల్గవ రకం విసర్జనానికి వాహకాలు గా పని చేస్తాయి
మూత్రపిండాలు, వూపిరితిత్తుల వలె సమర్ధవంతంగా పనిచేయవలసిన ఈ రోమాలను గెడ్డా లు మీసాలు అంటూ వాటిని తేలికగా విలువలేని వ్యర్ధ పదార్ధాలుగా భావించే వారి కి నా ఈ వివరణ కొంత మాత్రమైనా ఉపయోగపడుతుందని నా ఆశ
ధన్యవాదాలు
బహ బాగా చెప్పారు.
ReplyDeleteమన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వేసినన్నిగెడ్డపు వేషాలు మరెవరూ వేసి వుండరేమోనట..
(బలరాముడు,దూర్వాసుడు, పరశురాముడు,దశరధుడు..ఇలా చాలా..)
కొందరికి కింద పెదవి కింద ఈగ వాలినట్టుంటుంది.. తీరా చూస్తే చిరుగెడ్డం అన్నమాట..
ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది..!అదేసార్ .. మీ కార్టూన్..!! చూడగానే ఫక్కున నవ్వొచ్చింది.
మీరు ఇంకా ఇంకా ఇలాటి నవ్వులు పూయించాలని కోరుతూ..
ధన్యవాదాలతో..
-రాధేశ్యాం
మిత్రులు శ్రీ అప్పారావు గారికి,
ReplyDeleteహాస్యాంజలి
మీ గెడ్డానికి నా గెడ్డం, పాపం కాశీలాంటి
పుణ్యక్షేత్రానికి పోయిన ఈ అమాయక
ప్రాణితో సంబంధం పెట్టుకున్న పాపానికి,
మీకు అడ్డం వచ్చిందా? పాపం మరీ
అలా బ్లాగుతారా? అయినా నా గెడ్డం మీ
హాస్యానికి అడ్డం కాదు...అందర్నీ నవ్వించింది
కూడా. thanks మై డియర్ గడ్డమా......
శలవు.....దినవహి.
గెడ్డాన్ని అడ్డం పెట్టుకుని చాలా సరదాగా రాసారు. మీ వ్యాసం లోనుంచి కొన్ని పాయింట్లు ఎప్పుడో నాకు తెలియకుండానే నా రచనల్లోకి కాపీ అయిపోతాయేమో ..భయంగా కూడా వుంది సార్!
ReplyDelete