RSS
Facebook
Twitter

Tuesday, 26 October 2010

స్వరరాజేశ్వరం



శ్రీ ఎస్.రాజేశ్వరరావు 1936 లో నటుడిగా గాయకుడిగా
చిత్ర సీమలోకి ప్రవేశించారు ఆయన చిత్రరంగంలో చివరి
వరకూ అగ్ర సంగీత దర్శకుడిగానే వెలొగొందారు.జెమినీ
నిర్మించిన "చంద్రలేఖ" చిత్రం ఆయన్ని ఏ రకమైన సంగీత
మైనా అందించగల సంగీత దర్శకుడిగా భారతదేశమంతటా
పేరు సంపాదించిపెట్టింది. లలితగీతాల గాయకుడిగా రాజేశ్వర
రావు ఆలపించిన"తుమ్మెదా! ఒకసారి మోమెత్తి చూడమని
చెప్పవే నామాట రాచిలుక తోడ", "పాట పాడుమా కృష్ణా"పాటలు
బహుళ ప్రాచూర్యాన్ని పొందాయి. "పాటపాడుమా కృష్ణా"
అనే పాట మీద శ్రీ బాపు రాజేశ్వరరావుగారిపై అద్భుతమైన
కార్టూన్ వేశారు. ఆయన 1940 లో నెలకు ఆరువందల
రూపాయలజీతంతో ,19 ఏళ్ళ వయసులో జెమినీలో చేరారు.
జెమినీ నిర్మించిన "చంద్రలేఖ" లోని డ్రమ్స్ డాన్స్ కు సంగీతం
కూర్చడానికి దాదాపు ఒక ఏడాది పట్టిందట. ఆ చిత్ర నిర్మాణ
సమయానికి రాజేశ్వరరావు జీతం రూ1500/-.జెమినీలో
"జీవన్ ముక్తి" , "బాలనాగమ్మ","మంగమ్మ శబదం"," చంద్ర
లేఖ" చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. జెమినీలో
ఆయన చేసిన ఆఖరి సినిమా"అపూర్వ సహోదరగళ్"
బి.యన్.రెడ్డి గారి "మళ్ళీశ్వరి" సినిమాతో రాజేశ్వరరావుగారు
ఎదురులేని సంగీత దర్శకులుగా నిలిచారు. "నందనార్",
"కణ్ణామ్మా ఎన్ కాదలి", "దాసి అపరంజి","విక్రమాదిత్యన్",
"ప్రేమపాశం","పానై పిడిదవిల్ బాగ్యశాలి""అవళ్ యార్"
మొదలైన తమిళ చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం
వహించారు. హేమంత్ కుమార్ సంగీత దర్శకత్వంలో
ఏ.వి.యం వారు "మిస్ మేరీ" హిందీలో(మిస్సమ్మ) నిర్మించినప్పుడు,
రాజేశ్వరరావు అనుమతితో "బృందావనం అందరిదీ" పాట
ట్యూన్ ను ఉపయోగించారు. రాజేశ్వరరావు అన్నపూర్ణా వారి
చాలా చిత్రాలకు సంగీత సారధ్యం వహించారు. "అమాయకురాలు"
సినిమాలో శ్రీ రావి కొండలరావు సంగీతం మస్టారుగా నటించినప్పుడు
రాజేశ్వరరావు ఆయనకు గాత్ర దానం చేశారు!! రాజేశ్వరరావు
శాస్త్రీయ సంగీతంతో బాటు విదేశీ సంగీతాన్నికూడా అద్బుతంగా
మెలొడీగా చేయగల ప్రతిభాశాలి. ప్రఖ్యాత సంగీత దర్శకుడు కోటి,
వాసూరావు ఆయన పుత్రులు. ఈ నాడు ఆ మహామహుడి
వర్ధంతి (26,అక్టోబరు) సందర్భంగా అశేష సంగీతాభిమానులందరి
తరఫున ఆయనకు జోహార్లు అర్పిస్తున్నాను.

3 comments:

  1. As said above S Rajeswara Rao is one of the music best directors. "Padavela Radhika" my all time favorite, infact this song is so well tuned that we feel we are on terrace on a full moon day during spring season and etc.....all the songs in "Iddaru Mithrulu" are melodious.Bakta Prahlad, Dr Chakravarthi are few more, all the music he directed are popular. He also tuned telugu songs on "Bhagavan Ramana Maharshi", these songs are sung by Bengaluru Ramana Kendram Group.Thank you reminding us a great director.

    Mattegunta Nagalakshmi

    ReplyDelete
  2. Thank you very much for posting this. I was searching for the same. please also post the magazine and the year of publication.

    ReplyDelete
  3. రాజేశ్వర్రావుగారిని తలుచుకోవడానికి సందర్భమక్కరలేదనిపిస్తుంది. నన్నయ, తిక్కన, పోతనాదుల కోవలో మన తెలుగువారి దైనందిన జీవితాన్ని సుసంపన్నం చేసిన కారణజన్ములలో ఆయనొకరు. (ఈమాట ఇటీవల తనకి విశాఖపట్టణంలో జరిగిన సన్మానంలో SPB వాడారు - అంతకన్నా మంచి మాట నాకు దొరకలేదు రాజేశ్వర్రావు గారి గురించి అనడానికి).

    - తాడేపల్లి హరికృష్ణ

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About