నేను హిందువును, మితృడు ఖాన్ ముస్లిమ్,శ్రీ
విన్ఫ్రెడ్ రాయ్ (ఒకప్పటి మా మేనేజర్) క్రిష్టియన్
అనుకుంటుంటాము గానీ అందరి హృదయాలు
ఒకటే! ఇది నా అనుభవం. బ్యాంకులో పెర్సనల్
మేనేజరుగా నేను బిజీగా వుంటే పని వత్తిడి
తగ్గగానే నన్ను తన చాంబర్లోకి పిలిచి కబుర్లు
చెప్పి కాఫీ ఇచ్చి పంపేవారు మా బ్రాంచి మేనేజర్
శ్రీ రాయ్. ఇది నే నెలా మర్చిపోగలను. అలానే
మరో ముస్లిమ్ జనాబ్ యమ్.ఏ.ఖాన్ మా ఇన్నీస్
పేట (రాజమండ్రి) బ్రాంచి మానేజరుగా జాయిన్
అయిన రోజునే స్వయంగా బజారుకు వెళ్ళి లక్ష్మీ
దేవి ఫొటో ( అంతకుముందు బ్రాంచిలో దేముడి
బొమ్మలుగాని, శుక్రవారం పూజలుగాని లేవు)
కొని తీసుకొని వచ్చి ప్రతి శుక్రవారం సాయంత్రం
పూజకు ఏర్పాటు చేసిన విషయం ఇంకా నా మనసు
లోంచి (ఇది జరిగింది 1973లో) ఇన్నేళ్ళు గడిచినా
చెరిగిపోలేదు. ఇక మా "హాసం క్లబ్" మితృడు ఖాదర్
ఖాన్ హిందువులన్నా ,సాంప్రదాయాలన్నా అమితంగా
అభిమానిస్తారు. వినాయకుడి పై మరీ విపరీతంగా
వేసే కార్టున్లపై ఆయన మండి పడతారు.శవ యాత్రలలో
భగవద్గీతను మైకులో వినిపించడం చూసి స్ఠానిక
పత్రికలో ఓ వ్యాసం వ్రాస్తూ పవిత్రమైన గీత విన్నప్పుడాల్లా
విషాద తలంపు గుర్తుకొస్తున్నది, ఈ పద్ధతిని మానా
లని వ్రాశారు.
ఇటీవలే ఆయన కలం నుంచి జాలువారిన ఈ అద్భుత
కవిత చదవండి. అందరం,అన్నీమతాలు ఒకటే అని ఒప్పు
తప్పకఒప్పుకుంటారు.
"కలసిపోవలసింది ఒక మట్టిలోనే"
శర్మగారింటి పులిహోర ఖాన్ గార్కి పండగ!
ఖాన్ గారి సేమ్యా శర్మ గారికి ఈద్ !!
ఉస్మాన్ గార్కి సుమూహూర్తం సిద్ధాంతి గారే పెట్టాలి
సిద్ధాంతి గారి చెల్లి దడుసుకుంటే
ఇమామ్ గారు తావీదు కట్టాలి
ఇమామ్ గారి తల్లికి కామెర్లొస్తే
ఆచారి గారి పసర్లు పడి తీరాలి!
మిలాల్ బిర్యాని వీర్రాజు లాగించేస్తే
వీర్రాజు సాంబారిడ్లీ మిలాల్ ఊదేస్తాడు!
వెంకన్నగారి ప్రక్కన బీబీనాంచారమ్మ తల్లుంటే
అయ్యప్పగుడికి ముందే బాబాగారి సమాధి
మస్తాన్ మటన్ తిని నారయ్య కుండ నీరు తాగి
నాగూర్ పరుపు పై వాలి దుర్గయ్య దుప్పటి వాడి
ఆలీ హాస్యం చూస్తూ బాలూ పాటలు వింటూ
రహ్మాన్ సంగీతం ఆస్వాదిస్తూ
సిరివెన్నెల సాహిత్యం ఆనందిస్తూ
ఆనందంగా అభిమానంగా ఉండక
మందిరం మసీదు అంటూ
ఎందుకీ మల్లగుల్లాలు !!!
ఎడమొగం పెడమొగంతో
ఎందుకీ అల్లకల్లోలాలు!
బతికి ఉంటే మసలవలసింది
ఒక ఇంటిలోనే
కన్నుమూస్తే కలసిపోవలసింది
ఒక మట్టిలోనే !!
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
మనకు ముస్లిమ్ సోదరులకు ఒకటే తేడా,
మనం ఇల్లా అంటే వారు అల్లా అంటారు !!
ఈ పేరు చూడండి! మూడు మతాల పేర్లున్నాయి !!
వెంకటేసుర్లా ! (వెంకట, ఏసు,అల్లా కలసిలేవూ?!)
( "జ్యోతి" అలనాటి మాస పత్రిక సౌజన్యంతో)
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
మాఇంట్లో ఏసు క్రిస్తు బొమ్మ చూసి మీరు మతం
తీసుకొన్నారా అనిచాలా మంది అడుగుతుంటారు.ఆ బొమ్మను
యాభైఏళ్ళ క్రితం కరిగించడానికిఎవరో ఓ ఇత్తడి షాపులోఅమ్మితే
ఆ బొమ్మను, మరో బొమ్మను మా నాన్నగారు చూసిఆ ఇత్తడికి
వెలకట్టి కొని, చెక్కతో స్టాండును చేయించారు.ఆ బొమ్మల ఫొటోలు
చూడండి. ఎంతో కళాత్మకంగా ఉన్నాయి .
మతములన్నియు మాసిపోవును
ReplyDeleteవివాదములు సమసిపోవును
మమతలదీప0 నిలిచి వెలుగును