ప్రజల హృదయాలను చూరగొన్న అసలు సిసలు భారతీయుడు,
శాస్త్రవేత్త , శ్రీ అబ్దుల్ కలామ్. ఆయన జన్మదినం నిన్ననే.15 అక్టో
బరు.. ఆయన తన ఆత్మ కధను "ది వింగ్స్ ఆఫ్ ఫైర్" పేరిట
రచించారు. ఆ పుస్తక తెలుగు అనువాదం ప్రఖ్యాత రచయిత శ్రీ చిన
వీరభద్రుడు చేశారు. ఉపోద్ఘాతంలో శ్రీ కలాం ఇలా అంటారు.
".....చిన్నబస్తీలొ పెరిగిన ఒక పిల్లవాడి కష్టసుఖాల్లో
పాఠకుడికేమన్నా ఆసక్తి ఉంటుందా అనిపించింది.
నేను చదువుకున్న రోజుల పరిస్ధితుల గురించి,
నా స్కూలు ఫీజు కట్టడానికి నేను చేసిన రకరకాల
పనుల గురించి లేదా కాలేజి విద్యార్ధిగా నా ఆర్ధిక
పరిమితులవల్ల నేనొక శాకాహారిగా మారవలసి
రావడం గూర్చి వినడానికి సాధారణశ్రోతకు ఏమి
ఆసక్తి ఉంటుంది? కాని ఆలోచించగా,చివరకు,నాకు
ఇవన్నీ చెప్పుకోవల్సిన జ్ఞాపకాలేననిపించింది"
శ్రీ కలాం ని మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా,పీపుల్స్ ప్రెసిడెంట్
అని భారతదేశ ప్రజలు ఆభిమానంతో పిలుస్తారు. భారతరత్న
పురస్కారాన్ని అందుకొన్న మేధావి ఆయన. రామేశ్వరంలో
ఓ పేద కుటుంబంలో 1931, అక్టోబర్ 15 న జన్మించిన
కలామ్ పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం.
చదువుకొనే రోజుల్లో దిన పత్రికలను పంచడంలాంటి పనులు
చేసి కష్టపడి పైకి వచ్చారు. పరిస్థితులకు ఎదురొడ్డి ఏరోనాటికల్
ఇంజనీరింగ్ పూర్తి చేసారు.డిఆర్డివో,ఇస్రోలలో ఉద్యోగం చేసారు
తొలి దేశీయ ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎసెల్వీత్రీ) రూపకల్పనలో
ప్రముఖపాత్రవహించారు దేశవిదేశాల్లొని ముఫైపైగా విశ్వవిద్యా
లయాలనుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.ఆయన రచించిన
"ఇగ్నైటెడ్ మైండ్స్","ఇండియా 2020" ప్రతి యువత తప్పక
చదివితీరవలసినవి.ఇక్కడి ఫొటొలు, శ్రీకలాం తండ్రి జనులాబ్దిన్,
ఆయన సన్నిహిత మితృడు పక్షి లక్ష్మణశాస్త్రి(రామేశ్వరం దేవా
లయంలో ప్రధాన అర్చకులు),మసీదు వీధిలోని కలాం ఇల్లు.
ఈ చిత్రాలు కలాం ఆత్మకధ పుస్తకం సౌజన్యంతో.
0 comments:
Post a Comment