మీకు కొన్ని చిలిపిగా, కొంటెగా వుండే ట్రిక్కు ప్రశ్నలను వేస్తున్నాను.
జవాబులు ఊహించండి. తరువాత క్రింది జవాబులు చూడండి.
>>>>>>>>>>>>>>>>>>>>>>
1: ఆరుకు ఏడంటే ఎందుకు భయం?
2: రెండుపుల్లలతో నిప్పు పుట్టించగలరా?
3: లెక్కల పుస్తకం ఎందుకు విచారంగా వుంటుంది?
4: టెలీఫోన్ డైరెక్టరీలోగల సుబ్బారావనే పేరుగల వాళ్ళందరి
దగ్గర ఒకే వస్తువు తప్పక వుంటుంది. అదేమిటి?
5: కంప్యూటరులు దేనిని తినడానికి బాగా ఇష్టపడతాయి?
6: సముద్రం లేక పోయినా హాయిగా సాగిపోయే షిప్పేది?
7: తీసే కొలది పెరిగేది ఏమిటి?
8.:ఈ డ్రెస్ మీదగ్గరున్నా వేసుకోలేరు ఏమిటా డ్రెస్?
9: శుభ్రం చేసినప్పుడు నల్లగా, మురికిగా వున్నప్పుడు
తెల్లగా వుండేది ఏమిటి?
10: రేపు శలవు రావాలంటే ఈ రోజు ఏం అవ్వాలి?
11: న్యూయార్క్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నిలబడే ఎందుకు
వుంటుంది?
ఎన్నింటికి జవాబులు వెంటనే తెలిశాయి?. మీ
జవాబులను క్రింది సమాధానాలతో సరి చూసుకోండి.
<<<<<<<<<<<<<<<<<<<<<<<<<
v v v v v v v v v v v v v v
v v v v v v v v v v v v
v v v v v v v v v v
v v v v v v v v
v v v v v v
v v v v
v v
v
జవాబులు: 1: "సెవెన్ ఏట్ నైన్" కాబట్టి !!
2: అగ్గిపుల్లలతో
3:ఆ పుస్తకం నిండా పాపం" ప్రోబ్లమ్స్" కదా!!
4: టెలిఫోన్
5: చిప్స్
6: ఫ్రెండ్ షిప్
7: గొయ్యి
8: ఎడ్రెస్
9: బ్లాక్ బోర్డ్
10: ఈ రోజు శనివారం అవ్వాలి
11: కూర్చోలేదు కాబట్టి!
మీరన్నిటికీ కరెక్ట్ జవాబులు చెప్పేసే ఉంటారు లెండి !!
బాగున్నాయండీ. నాకైతే ఒక్కదానికి కూడా సమాధానం తట్టలేదు. కింది సమాధానాలు చూసి నవ్వుకున్నాను. సంతోషం!
ReplyDeleteనమస్కారం సార్! రిటైరయ్ కూడా మీరు ఇంత వుత్సాహంగా ఇంత ఉల్లా సమయిన బ్లాగ్ నడుపుతున్నారు.అభినందనలు సార్! మీ బ్లాగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
ReplyDeleteమీరిలా జవాబులివ్వకుందా కాస్త సస్పెన్స్ లో పెట్టాల్సింది.
ReplyDeleteనాకు నాలుగింటికి జవాబులు తట్టాయి.
ధన్యవాదాలండి,హనుమంతరావు గారు, నేను మా మితృడు
ReplyDeleteదినవహి హనుమంతరావు(హాస్యవల్లరి) తో కలసి గత ఐదేళ్ళుగా
రాజమండ్రి లో ప్రతినెలా మూడో ఆదివారం "హాసం క్లబ్" నిర్వహిస్తున్నాం
ఇద్దరికీ కాస్త ఆరోగ్యం బాగోలెక ఈ రెండు నెలలు మాత్రం నెల తప్పాం.
నా బ్లాగు మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.