" పోగో" చానల్లో అగుపించే "మిస్టర్ బీన్", యానిమేటెడ్
రూపంలోనూ, నటుడు రోవన్ అటిక్సన్ నటించిన మూవీ
గానూ వస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నది. హడావిడిగా
స్నానం చేసి ఆ తువ్వాలుతోనే కారెక్కి, డ్రైవ్ చేస్తూనే
సూటేసుకోవడం, పోస్ట్ బాక్సులో ఉత్తరంవేస్తూ అందులో
ఇరుక్కుపోవడం లాంటి చిలిపి చేష్ఠలు చేసి ఆబాలగోపాలాన్నీ
నవ్విస్తాడు.మిస్టర్ బీన్ పాత్రను అద్భుతంగా పోషించిన అటిక్
సన్ బ్రిటన్ ప్రధాన మంత్రి టోనీ బ్లయర్ చదువుకొన్న స్కూల్లో
చదువుకొన్నాడు.ఏదైనా తను అనుకొన్న విధంగా జరగక పోతే
ముఖాన్ని విచిత్రంగా పెట్టేవాడట. తరువాత ఆక్స్ ఫర్డ్ యూని
వర్సీటీలో చదివే టప్పుడు ఓ బొమ్మ వేస్తే అది చూసిన స్నేహితుడు
ఈ పాత్రను పెట్టి ఓ కధ రాద్దామా అన్నాడట. ఆ ఆలోచనతోనే
1980 లోనే మిస్టర్ బీన్ పుట్టాడు. ఆ కధను నాటికగా ప్రదర్శించాలని
అనుకొని, ఆ పాత్రను అటిక్సన్ ధరించాడు. ప్రేక్షకులను ఆ కధ
విపరీతంగా ఆకర్షించింది. బ్రిటన్ లోని టీవీలు ఆ కధను ప్రసారం
చేయడానికి పోటీ పడ్డాయి. చివరకు 1990 లో మిస్టర్ బీన్ టీవీ
తెరపైకి వచ్చింది. అటు తరువాత మిస్టర్ బీన్ యానిమేటెడ్ చిత్రాలు
మొదలయ్యాయి."మిస్టర్ బీన్-అల్టిమేట్ డిసాస్టర్" అనే సినిమా ఇరవై
రెండుమిలియన్ డాలర్లతో నిర్మిస్తే, రెండువందల ముప్పై డాలర్లను వసూలు
చేసిందట! అసలు కధకు పెట్టిన పేరు, మిస్టర్ వైట్.అది బాగాలేదని
రకరకాల కూరగాయల పేర్లు ఆలొచించి చివరకు మిస్టర్ బీన్ పేరును
నిశ్చయించారు. ఈ పేరే అందరికీ నచ్చింది.
ఇక " పోగో" చానల్ పేరులో ఓ గమ్మత్తు గమనించారా?! తెలుగులో
"పో" అన్న మాటకు ఇంగ్లీషులో "గో" అంటాం గదా. ఆ రెండు మాటలను
కలిపితే "పోగో" అయింది!ఇది నాకు తట్టిన తమాషా ఆలోచన!!
bavundandi
ReplyDeletepogo channel naku kuda ishtam baga comedy enjoy cheyochhu
ReplyDeleteమీ పో-గో ఆలోచన తమాషా గా ఉంది. మాకు తట్టనే లేదు. మిష్టర్ బీన్ అంటే మాకూ చాలా ఇష్టం.
ReplyDeletehttp://vennelalu.blogspot.com