భాగవతుల సదాశివ శంకరశాస్త్రిగా ఆగష్టు 31, 1925న జన్మించిన ఆరుద్ర కవిగా,
కధకుడిగా,నవలా రచయితగా,డిటెక్టివ్ కధల కర్తగా,సాహితీ పరిశొధికుడిగా, విమర్శకుడిగా
అర్ధశతాబ్దమ్ వరకూ అక్షరార్ఛన చేసారు.తన రఛనలతో మాజిక్ చేయడమే కాకుండా నిజంగా
'ఇంద్రజాలం'లో ప్రావీణ్యం సంపాదించి'మాస్టర్ ఆఫ్ మాజిక్' అన్న బిరుదుతో బాటు ప్రఖ్యాత
ఐంద్రజాలికుడు పిసీ.సర్కార్నే ఆశ్చర్యపరచి అఖిలభారత మాజిక్ సర్కిల్ బులెటిన్కి సంపాదక
వర్గ సభ్యుడైన ప్రతిభాశాలి శ్రీ ఆరుద్ర. బ్రిడ్జ్ చారితక విషయాలపై,సంగీత శాస్త్రాలపై ఆయన ఎన్నో
పుస్తకాలు వ్రాసారు.ఆరుద్ర మొదటి సారిగా సినీ రచయితగా (సౌదామిని 1951)పరిచయమై
ఘంటసాల 'పరోపకారం'(1953) చిత్రానికి మాటలు, 'బీదలపాట్లు'(1950)పాటలు మొదటి
సారి వ్రాసారు.400 చిత్రాలకు 5000 పైగా పాటలు వ్రాసారు.ప్రఖ్యాత రచయిత్రి వీరి జీవిత భాగస్వామి.
కవిత,త్రివేణి,వాసంతి, లలిత వీరి సంతానం.ఆరుద్ర హేతువాది.నాకు జంద్యంలేదు,నా శ్రీమతికి
మంగళ సూత్రాల్లేవంటూ చమత్కరించేవారు.ఆరుద్రగారూ,మీరు గెడ్డంలో అచ్చం షాజహాన్ లాగున్నారు
అని ఓ మితృడంటే 'గట్టిగా అనకయ్యా! మా ఆవిడ వింటే తాజ్మహల్ కట్టించమంటుంది' అన్నారుట
ఆరుద్ర.'
'త్వమేహం''సినీవాలి','కూనలమ్మ పదాలు''గాయాలు గేయాలు','ఇంటింటి పజ్యాలు',అపరాధ
పరిశోధన నవల 'పలకల వెండిగ్లాసు' మొదలయినవి ఆరుద్ర విశిస్ట రచనలు.ఈ ప్రతిభాశాలి 1998
జూన్ 4న మన నుంచి దూరమయ్యారు.
బాపు రమణలు 'సంపూర్ణ రామాయణం' ఆరుద్ర మాటలతో తీస్తున్నప్పుడు కొందరు ఇలా చెవులు
చాటుమాటుగా కొరుక్కున్నారట.
ఆరుద్ర కమ్యూనిస్ట్
ముళ్లపూడి హ్యూమరిస్ట్
బాపు కార్టూనిస్ట్!
ఐనా ఆ చిత్రం ఎంత అద్భుతంగా వచ్చిందో మనకందరకూ తెలుసు.
1963లో వచ్చిన 'జ్యోతి' పత్రికలో అచ్చుతప్పులపై ఆరుద్ర "ఆరుద్ర బాతాఖూనీ" పేరిట ఓ శీర్షిక
నిర్వహించేవారు. అందులో కొన్ని అచ్చు తుప్పులు చెత్తగించండి!
'చల్ మోహన రంగా ! నీకు నాకు జోడు కరచెను గదరా
చచ్చు బుడ్డి బాగా వెలగదు
డాక్టర్లు రోగుల పర్సు చూసి వైద్యం చేస్తారు!
అక్షరాలు మారటం వల్ల అర్ధం ఎలా మారుతుందో ఆరుద్ర చమత్కారంగా చెప్పారు!
ఆరుద్ర గారి శ్రీమతి గారి పెరు వ్రాయటం మరచిపోయాను.
ReplyDeleteప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి రామలక్ష్మిగారు ఆయన సతీమణి.
ఈ తుచ్చు అప్పుకు క్షమిస్తారు కదూ?!
ధన్యవాదాలు ఆరుద్ర గారు కొన్ని తరములసెపు గుండె వుయ్యలలూపు
ReplyDelete>>డాక్టర్లు రోగుల పర్సు చూసి వైద్యం చేస్తారు!
ReplyDeleteఇది అదిరింది....
శబ్దవిరించి
ReplyDeleteఆరుద్ర గురుంచి
చెప్పిందల్లా మంచి..
ఓ బ్లాగులమ్మా..!
ఆరుద్ర గారు "రాముడికి సీత ఏమవుతుంది" అనే మంచి పుస్తకం రాసారు. బహుసా చాలామందికి ఈ పుస్తకం గురించి తెలియకపోవచ్చు. ఇందులో వివిధ దేశాలలో ప్రాచుర్యంలో ఉన్న రామయణ కథలు, అందులో సీతారాముల సంబంధాల గురించి రాసారు. ఇది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. కొన్ని దేశాల్లో రాముడికి, సీత చెల్లిట. ఇంకో వెర్షన్ లో లక్షణుండు శూర్ఫణకని పెళ్ళి చేసుకుంతాడట. ఆరుద్రగారు ఎంతో పరిశోధన చేసి రాసిన పుస్తకం. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.
ReplyDelete6ద్ర అని రాయాలండి..ఒక "రు" ఎక్కువైంది.
ReplyDeleteకె.కె. గారు,
ReplyDeleteనిజమేనండి. ఒక 'రు' ఎక్కువయింది. 'తచ్చు అప్పు'అని క్షమించేయండి!