ఎందుకోగాని ఈ మధ్య ప్రజల్లో చిన్నవాళ్ళకు కూడా భక్తి భావం బాగా పెరిగింది.ఇది
         మంచి శుభ సూచకమే.కాని,కొందరిలో అభద్రతా భావం తప్పులు చేస్తున్నామనే భయం
         కూడా వుందేమోనని అనిపిస్తుంది.మనం సాధ్యమైనంత వరకు తోటి వారికి,మూగజీవాలకు
         అవసరమైనప్పుడు సహాయం చేస్తుంటె భగవంతునికి అంతకన్న ఆరాధన లేదు.పూజలు,
         హోమాల కంటే ఇలాటివే దేముడికి ప్రీతి అని నేనుకుంటాను.
          మనకు గోమాత పూర్వం నుంచి ఆరాధ్య దైవం.కాని మనం ఈ రోజుల్లో ఆవులు ఎండలో
         రోడ్ల మీద తిరుగుతూ, చెత్తకుండీల దగ్గర కూరల చెక్కు నింపిన ప్లాస్టిక్ బాగులు,పేపర్లు
         నములుతూ అగుపిస్తాయి.వాటికి యజమానులుంటారు.సాయంత్రం అవి ఇంటికి చేరగానే పాలు తీసి
         మళ్ళీ రోడ్డు మీదకు తోలేస్తారు.చెత్తకుండిల దగ్గర చూసిన కొంతమంది భక్తులు తోకకు
         దండం పెట్టి చెంపలు వాయించుకుంటుంటారు.ఓ అరటి పండు కొని దాని నోటికి అందిద్దాం
         అని వాళ్ళకు తోచదు.చాలా ఏళ్ళ క్రితం,రాజమండ్రిలో ఆదినారాయణ అని గుర్తు,పచ్చగడ్డి
         మోపులు తెచ్చి కూడలిలో ఆవులకు పేట్టే వారు.ఆయన్ని చూడగానే ఎక్కడెక్కడి ఆవులు
         పరుగు పరుగున వచ్చేచి! తరువాత గుడి అనేది పవిత్రం గా వుండాలి. ప్రతి పేవ్మెంట్ మీద
         ఓ గుడి ఈ కాలంలో మనకు అగుపిస్తూంది.ఉదయం పూజలూ,సాయంత్రం సినిమా స్టైల్
         భజనలు జరుగుతుంటాయి. ఆ ప్రక్కనే ఉమ్ములేస్తూ తిరుగుతుంటారు.ఇంతకన్నా దేముడికి
         చేస్తున్న అపచారముందా?! అందుకనే నే కోరేది, గుడికి వెళ్ళండి.రద్దీగా వుందనుకోండి.
         స్త్రీలకి, పిల్లలకు, పెద్దవారికి దర్శనం చేసుకొనేందుకు సహాయపడండి.ఇది నేటి యువతరం
         పాటిస్తే భగవంతుడు మీ విజయానికి సదా తోడుంటాడు. 



 
 
 
 
 
 
 
 
 









0 comments:
Post a Comment