RSS
Facebook
Twitter

Thursday 8 April 2010



'భరాగో' అనే భమిడిపాటి రామగోపాలం గారు వ్లిశాఖపట్టణం లో నిన్న పరమంపందించారనే
వార్త తెలుగు హాస్యకధా ప్రియులకు మరువలేని వేదనను కలిగించింది. ఐదేళ్ల క్రితం ఆయన
కలం నుండి వెలువడిన రెండు సంపుటాల తెలుగు సినిమా పాటల వివరాలతో (1940-1985),
ప్రధానమైన పాటలు,అరుదైన చిత్రాలు,వివరణలతో ఆ పాటల రెండు సీడీ లతో పుస్తకాలు 'నూట
పదహార్లు' 'మరో నూట పదహార్లు' కోసం ఆయన ఇంటికి వేళ్ళాను.ఎంతో ఆదరనతో ఎన్నో విషయాలు
చెప్పారు. ఆ పుస్తకాలు కొని శెలవు తీస్కుని బయలుదేరబోతుండగా వెనక్కి పిలిఛి ఆ అలమారు పైనున్న
సరదా కధలు పుస్తకం తీసుకోండి అన్నారు. ఖరీదు చెల్లించబోగా, వద్దు ఆ పుస్తకం నా 'కానుక' అన్నారు.
ఐతే సంతకం చేసి ఇవ్వండి అంటే "నేను కదలలేను. ఆర్త్రిటిస్ తో నా వళ్ళు స్వాధీనంలో లేదు.సంతకం
చేయలేను"అన్నారు.1932, ఫిబ్రవరి 6న విజయనగరం జిల్లా ఆలమండ మండలం అన్నమరాజు పేటలో
'భరాగో' జన్మించారు.160 పైగా కధలు, మూడు నవలలు, అనేక వ్యాసాలు రచించారు.కుండపెంకులు,
వంటొచ్చిన మొగాడు,వెన్నెల నీడ, కధన కుతూహలం కధా సంపుటాలు వెలువడ్డాయి.తన ఆత్మకధను
'ఆరామ గోపాలం' పేరిట వ్రాసారు.పాలువాయి భానుమతి మొ" ప్రముఖుల పై సచిత్ర పుస్తకాలను
వ్రాసారు
ఆయన్ని కలిసినప్పుడు ఆయన నాతో ఈ నాటి సినిమా తారల గురించి చెబుతూ" ఆ నాటి
తారలు భానుమతి,సావిత్రి మొ" చూసినప్పుడు ఇలాటి సోదరో, భార్యో వుంటే ఎంత బాగుంటుంది అనే
భావన కలిగేది.ఇప్పటి వాళ్ళని చూస్తుంటె ఏ మనిపిస్తుందో వేరే చెప్పాలా"

భరాగో గారి ఆత్మకు శాంతి కలగాలనీ ప్రార్ధిస్తూ,,,


3 comments:

  1. మంచి కథా రచయితని కోల్పోయాము. మీకు ఆయనని కలిసే అదృష్టం కలిగినందుకు సంతోషం.

    ReplyDelete
  2. వారి చేతి సంతకము నా దగ్గర ఉన్న పుస్తకము లో ఉంది. హైదరాబాదు నుంచి పనిమీద విశాఖ వెళ్లి ఆయనను కలుసుకున్నందుకు, ఆయన మెచ్చి, రెండు గంటలు మాట్లాడి, నాకు ఇచ్చిన బహుమతి అది. అంతకంటే విలువైన సలహా, ఒక పుస్తకము వ్రాయాలంటే, నేను (అంటే ఆయన) 5000 పుస్తకాలు చదవాలి తెలుసా? అంచేత, చదవండి, అందినాన్ని పుస్తకాలూ చదవండి అని..

    అప్పుడు, ఆయన శ్రీ గొల్లపూడి వారి పుస్తకాన్ని ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు. మూడేళ్ళ క్రితం నాటి మాట ఇది. ఇవ్వాళ వారు కాలంలో కలిసిపోయారంటే, ఆత్మీయుడిని పోగొట్టుకున్నంత బాధ, కంట నీరు....

    భవదీయుడు,

    సీతారామం

    ReplyDelete
  3. భరాగో లెరంటే ఎలాగో ఉంది.నవ్వుల్ని కోల్పోయినట్లుగాఉంది.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About