బాపు గారు గీసిన ఈ కార్టూన్ చూసారా?! నిజంగా మన నిత్య జీవితంలో జరుగుతున్న
           విషయాలను ఎంత బాగా చూపించారు కదూ? ఇంతటి మంచి నవ్వుల బొమ్మని గీ(వే)సిన
           బాపుగారికీ, స్వాతి బలరాం గారికీ కృతజ్ఞాతాభివందనాలు తెలియచెస్తున్నాను. మన ఇంటికి
           అతిధులు వచ్చేటప్పుడు, ముఖ్యంగా వాళ్ల బుడుగులను తీసుకువస్తున్నప్పుడు ఓ ఫోన్ కొట్టి
           వస్తే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడతాం.నా అనుభవంలో ఇలాటివి ఎన్నో జరిగాయి.
           ఓ మితృడి కుమార రత్నం నా చిన్ననాటి గోపాల కృష్ణుడి బొమ్మ పించం అమాంతమ్ విరి
           చేసాడు.నాకు నా మెడ విరిచినట్లనిపీంచింది.తరువాత కస్టపడి వైట్ సిమెంట్తో రెపైర్ చేసుకున్నాను.
           డెకరేటివ్ గా పెట్టిన బొమ్మలు తీస్తుంటే , పెద్దవాళ్ళు వాళ్ళ ఘనకార్యాన్ని నవ్వుతూ చూస్తుంటారే
           తప్ప, తప్పు అని చెప్పరు. పైగా వాళ్ళ పిల్లలకున్న క్యూరియాసిటీని మనకు గొప్పగా చెప్పటం
           మొదలెడతారు.పిల్లలే కాదు,కొందరు పెద్దలూ అంతే.  పుస్తకాలను తీసి పేజీలను గబగబా
           తిప్పేస్తుంటారు. అసలే ఏ నాటి పుస్తకాలో,కాగితాలు బ్రిటిల్గా వుండి చినిగి పోయే ప్రమాదం
           ఎక్కువ.మరికొందరైతే గట్టి అట్ట లేని పుస్తకాలనైతే గొట్టంలా చుట్టడం మొదలెడతారు.మా
           చుట్టాలాయిన వచ్చి టేబుల్ మీదున్న చందమామను కాలెండర్లా చుట్టి కబుర్లు చెప్పడం మొదలెట్టాడు.
           ఆ పుస్తకం నా ప్రాణం.అలా పాడు చేయకండి అని తెగించి నేనంటే 'రేపు తూకానికి అమ్మే పేపరు
           ఈయనకు ప్రాణంట' అంటూ వెకిలి నవ్వు నవ్వాడు.మరి కొందరు చదివిస్తాం అంటూ పుస్తకాల్ని
           అడుగుతారు.ఇస్తే తిరిగి రాదు.వచ్చినా రూపం కురూపం అయి వస్తుంది.
           పిల్లలైనా పెద్దలైనా మరో చొటికి వచ్చినప్పుడు మంచిగా వ్యవహరించడం నేర్ఛుకోవాలి.పిల్లలకు
           మంచి అలవాట్లు నేర్పాలి.పుస్తకాల రేక్ లో వున్న పుస్తకాలను చూడాలనుకొంటే "ఆ పుస్తకం
           నే చూడవచ్చా" అని అడిగి తీయడం కనీస మర్యాద.కాదంటారా? ఏమంటారు?



 
 
 
 
 
 
 
 
 









కాందటాను।
ReplyDeleteపిల్లలు దేవుని స్వరూపం - అని అందరూ అంటే నాకు అర్థమయ్యేది కాదు। కానీ ఇప్పుడు అర్థమవుతుంది।
మనము జీవితంలో అడ్డమైనవన్నీ పోగుఁజేసుకుంటాము। ప్రతీ వస్తువునూ నాది చేసుకోవడానికి ప్రయత్నిస్తూంటాము। మహామాయలోఁబడి మమకారాన్ని పెంచుకుంటాము। మనది కాని శరీరం మొదలు మట్టి బొమ్మలవరకూ నాది అనే ష్టిక్కరు అంటించి వాటిని దుఃఖహేతువులుగా మార్చేస్తాం। అప్పుడు ఆదియోగి శివుఁడు పసిపిల్లలరూపంలో మన ఇంటికి వచ్చి, మనకు బుద్ధి చెబుతాడు। అంతా మట్టి, ఇందులో ఏది నీదని నిలదీస్తాడు।
పెద్దల విషయమై నాకు తెలియదు। :)
రాకేశ్వర రావు. totally agree with you. పుస్తకాలు, పిచ్చి బొమ్మలు, స్టాంపులు, నాణాలు ఇయ్యన్నీ సేకరించటం దండగమారి పని. పిల్లలకు ఏ వస్తువును ఏమి చేయాలో బాగా తెలుసు. సార్. మీరు ఈ వయసులో ఇంక సేకరించినవి అన్నీ పిల్లలకు ఇచ్చెయ్యాండి. less luggage more comfort.
ReplyDeleteరాకేశ్వర రావు గారు, బాగా చెప్పారండి.వస్తువుల మీద వున్న వున్న ప్రేమలో కొంచమైనా పిల్లల మీద చూపిస్తే బాగుంటుంది.
ReplyDeleteevari istam vaaridi andi.I support the author of this article.Well said
ReplyDelete