RSS
Facebook
Twitter

Thursday 22 April 2010

అందాల గోదావరిని చూడాలంటే మనం రాజమండ్రి వెళ్ళాలి.లేకుంటే కోనసీమ
వెళ్ళాలి. ఎక్కడికీ వెళ్ళకుండా మనం ఎక్కడున్నా,చివరకు ఏ అమెరికాలాటి
విదేశాల్లో వున్నా ప్రముఖ దర్శకులు శ్రీ వంశీ సినిమా చూస్తే చాలు అందాల
గోదావరి బిరాబిరా వచ్చి మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఆ కమనీయ నదీ తీరంలో
రకరకాల మనుషుల్ని వాళ్ళ మాట తీరును మనం వాళ్ళతో గడిపినంత నిజంగా
ఆయన సినిమాల్లో ఓ రెండున్నర గంటల్లో చూసి ఆనందించవచ్చు. తూర్పు గోదావరి
జిల్లా పసలపూడిలో పుట్టి పెరిగిన శ్రీ వంశీ ఆ గోదావరి అన్నా, అక్కడ పుట్టిపెరిగిన
వాళ్ళన్నా ఎంతో అభిమానిస్తారు.వెన్నెల్లో గోదావరి ఎంత అందంగా వుంటుందో, అ
గోదావరి ఇసుకతిన్నెలకంటే వంశీ కలానికే తెలుసు. ఆయన వ్రాసిన ’మా పసలపూడి
కధలు’, ఇప్పుడు ’స్వాతి’లొ వ్రాస్తున్న’మా దిగువ గోదావరి కధలు’ చదివిన, చదువు
తున్న వాళ్లకి ఆయన గోదావరిని ,ఆ ప్రజలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. గోదావరి
తరచూ తన సినిమాల్లో చూపించే వంశీ ’గోపి గోపిక గోదావరి’లొ ఆ నదికీ పాత్ర హోదా
ఇచ్చారు. ఈ రోజుల్లో పాపికొండలకు టూరిస్ట్ లాంచీలు వచ్చాక ప్రతి వాళ్ళకీ పాపికొండల
అందాలు చూసే అవకాశం వచ్చింది కాని, రాజేంద్రప్రసాద్ ను సోలో హీరోగా పరిచయం చేసిన
’ప్రేమించి పెళ్ళాడు’లో మొట్టమొదటి సారిగా పాపికొండలను చూసే అదృష్టాన్ని ప్రేక్షకులకు
కలిగించారు. ఇప్పుడు వంశీ ’అల్లరి’నరేష్ తో మా రాజమండ్రి పరిసరాల్లో " సరదాగా కాసేపు"
సినేమా తీస్తున్నారు.ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఈ సినిమా ఎక్కడెక్కడో వున్న గోదావరి అభిమానులను
అలరిస్తుందని ఆశిద్దాం ! ఆయన ప్రయత్నం మరో సారి విజయం సాధించాలని ఆశీర్వదిద్దాం !.

2 comments:

  1. వంశీకీ గోదావరికీ ఏ జన్మల బంధమో ! గోదావరి ఊసెత్తకుండా అసలు వంశీ ఒక్క వాక్యమయినా రాయగలడా అని అనిపిస్తుంది.
    నా చిన్న నాటి నేస్తానికి అభినందనలు. అతను తీస్తున్న కొత్త చిత్రం ఆంధ్ర ప్రేక్షకులను పిచ్చి పిచ్చిగా అలరిస్తందని ఆశిస్తున్నాను.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About