ఆ తరంవారికి 'బుడుగు' వెంకట రమణగా పిలువ బడే ముళ్లపూడి వారు
        ఈ తరంవారికి కూడా 'కోతి కొమ్మచ్చి' వెంకట రమణగా పరిఛయం అయ్యారు.
        విశాలాంధ్ర వారు 'ముళ్లపూడి సాహితీ సర్వస్వం'పేరిట ఆయన రచనలన్నీ 8
        సంపుటాలుగా యం.బీ.యస్.ప్రసాద్ గారు ఏర్ఛి,కూర్చగా ప్రచురించారు.1,2
        సంపుటాలలో 'కధా రమణీయం',3లో 'బుడుగు',4,5లలో కదంబ రమణీయం
        ఇందులోనే నవ్వితే నవ్వండి జోకులున్నాయి!,6,7లలో సినీ రమణీయం,ఆఖరి
        సంపుటంలో అనువాద రమణీయం వుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయే 'డాక్టర్
        జోకులు కదంబ రమణీయం లోనివి. ముళ్లపూడి మాటల్లోనే"నవ్వితే నవ్వండి,మాకు
        అభ్యంతరం లేదు".
                        * * * * * * *
        డాక్టరు: నిద్దట్లో పీడకలలు అన్నారు, నా మందు తీసుకొన్నాక ఎలా వుంది?
        రోగి  : ఏడిసినట్టుంది.ఇప్పుడు కలలో కూడా నిద్ర రావటం లేదు.
                        * * * * * * *
        ఒక రోగి ఆపరేషన్ బల్ల ఎక్కుతూ--
        మరే ప్రమాదం లేదుగా డాక్టరుగారూ? అన్నాడు.
        చాల్చాల్లేవయ్యా! నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషనెవడు
        చేస్తాడు,బలే వాడివేలే, అన్నాడు.
                         * * * * * * *
        ఓ తల్లి అర్ధ రాత్రి వేళ బిడ్డను తీసుకొని డాక్టరింటికి వచ్చింది, వాతం కమ్మింది చూడమని.
        "ఏం చేసారు? ఏం చేసారు?" అడిగాడు డాక్టర్.
        "మీరిచ్చినదే.పిల్లాడికి నెలకో మాత్ర వెయ్యమన్నారుగా.వాడికి తొమ్మిదో నెలగదా అని తొమ్మిది
         మాత్రలు తెప్పించి వేసాను." అంది.
                          * * * * * * *



 
 
 
 
 
 
 
 
 









డాక్టర్ ..పేషంట్ తో; మీరు సమయానికి నా హస్పిటల్ కి వచ్చారు..లేకపోతె బతికిపొయే వారు.
ReplyDeleteమీ జోకులు హాయిగా ఉన్నాయి. నవ్వితే హాపీ..నవ్వకపొతే బీపీ ..!ఔనా సార్ ..?
అక్ష్రర మోహనం అంటే నే ప్రతిదీ మోహనంగా అగుపించే అదృష్టవంతులన్న మాట.
ReplyDeleteమీకు నా కార్టూనులు, ముళ్లపూడి వారి జోకులు నచ్చినందుకు ధన్యవాదాలు.
--రేఖాచిత్రం*