శ్రీ ముళ్లపూడి వేంకట రమణ గారు ’స్వాతి’లొ వారం వారం ఆయన వ్రాసే ’కోతి కొమ్మచ్చి’లో
               ఆయన భాషలోనే ’అడ్డమైనరాతలు’ వ్రాస్తున్నారు. ఈ వారం అయన వ్రాసిన ’అడ్డమైన రాతలు’
               నాకు విపరీతంగా నచ్చేసి, ఇక్కడ నేను గీసిన ఓ ’అల్లరి బుడుగు’కార్టూన్తో బాటు, ముళ్లపూడి
               వారి అపురూపమైన ఫొటో ( రచన శాయి గారి సౌజన్యంతో) కూడా చేర్చి ఆ ’రాతలు’ఇక్కడ మీ
               కోసం, మరో సారి.
                   విన్నావా ముళ్లపూడి వెంకట రమణా !
                తల్లిని తండ్రినీ ఎవరన్నా తిట్టిపోస్తే-అదీ దేశవాళి భాసలో ఎవ్హడూ సహించడు.
                కాని-మనందరికీ తల్లి లోకమాత సీతమ్మతల్లినీ,చదువులతల్లి సరస్వతిని,రామ
                భక్త హనుమాన్ జీని నీచాతి నీచంగా బొమ్మలు వేసి ఆ బొమ్మలతో సొమ్ములు
                నొల్లుకునే వాళ్ళని మనం  ఏమీ అనం.విశాలదృష్టితో వారి భావ ప్రకటనా 
                స్వాతంత్ర్యాన్ని సహిస్తాం. వారిని ఎవరన్నా ధైర్యంచేసి ఏమన్నా అన్నా-మనం
                రొమ్ములు విరుచుకుని- వారి సంకుచిత బుద్ధిని ఖండిస్తాం.’మేధావుల-సంతకాల’
                ఉద్యమాలు నడుపుతాం. ఎడిటోరియల్స్ రాస్తాం. కాని
                        మీ యిష్టదేవుళ్ళ మీదా, ప్రవక్తల మీదా ఒఖ్ఖ బొమ్మన్నా వేసే దమ్ముందా మీకు?
                అని అడిగే దమ్ము మనకు లేదు.
                      మరోటి..
                తిరుమల వేసవి కొండమీద-ఎండలో నెత్తిమాడుతున్నా కింద కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్నా
                -పసిపిల్లలయినా ముసలివాళ్ళయినా వట్టి కాళ్ళతోనడవాల్సిందే.పందిళ్ళయినా వేయ్యరు-
                కనీసం ఆ కాస్త నేలయినా తడపరు.
                     భక్తులు గోవిందా అని మొరలుపెడుతున్నారు.
                     కాని- కారుగల వారు మాత్రం-మహాద్వారం వరకూ అసూర్యం పశ్యులుగా ఎండపొడ
                పడకుండా వెళ్ళవచ్చు.
                     అందువల్ల- ఓ పేదలారా-అందరూ కార్లు కొనుక్కోండి-ప్రసాదాలు కూడా పుష్కలంగా
                పెడతారు.
                     నడిచి వెళ్తే ప్రసాదాలు కొనుక్కోవాలి-ట !
                విన్నావా ముళ్లపూడి వెంకటరమణా !
                     నిజంగా ఇవి ’అడ్డమైన రాతలు’ అనుకోవాలని వీటిని మాత్రం పేజీకి అడ్దంగానే వేయించారు
                 మన రమణ గారు. దటీజ్ ముళ్లపూడి !!



 
 
 
 
 
 
 
 
 









"..........తిరుమల వేసవి కొండమీద-ఎండలో నెత్తిమాడుతున్నా కింద కాళ్ళు కాలి బొబ్బలెక్కుతున్నా -పసిపిల్లలయినా ముసలివాళ్ళయినా వట్టి కాళ్ళతోనడవాల్సిందే.పందిళ్ళయినా వేయ్యరు-కనీసం ఆ కాస్త నేలయినా తడపరు....."
ReplyDeleteనిజం నిజం. ఒక అద్భుతమైన విమర్శ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇది చూసైనా అటువంటి ఏర్పాటు చేస్తే, వెంకన్న గుడి మొత్తం బంగారంతో మళ్ళీ కట్టిచినంత ఫలితం వస్తుంది అని తెలుసుకోగలరు. ముళ్ళపూడివారి దృష్టి కోణానికి జేజేలు. ఒక్క పత్రికవాడూ వ్రాయలేదు ఏ టివి వాడు చూపలేదు భక్తుల ఈ కష్టాన్ని.
తరువాత మీ కార్టూన్ చూస్తే నాకు భయం వేసింది సురేఖగారూ.