RSS
Facebook
Twitter

Monday 12 April 2010

కాశీమజిలీ కధల కధ !


ఇది వరలొ మనకు 'బాల','చందమామ' పత్రికలు లేనప్పుడు
రాజమండ్రికి చెందిన మధిర సుబ్బయ్య దీక్షితులు వ్రాసిన 12 భాగాల
కాశీమజలీ కధలు చదివి, అమ్మమ్మలూ, తాతయ్యలు తమ మనవలకు,
మనవరాళ్లకు చెప్పేవారు.
19 శతాబ్దంలో ఆ నాటి పాఠకులను ఈ కధలు ఉర్రూతలూగించాయి.ఈ
కాశీమజిలీ కధలు దక్షిణ కాశీ అని పిలవబడే రాజమండ్రిలోనే పుట్టాయి.
కాశీకి వెళ్లడం అంటే కాటికి వెళ్లడం అనుకొనే రోజులవి.పూర్వం కాశీ వెళ్ళడం
అంటే అలా అలా అడవుల మధ్య నుంచి ఊళ్ళను దాటుకుంటూ, మధ్యలో
ఆహారం దొరకదని ఆహర పదార్ధాలను మూటలు కట్టుకొని కాలినడకను వెళ్ళే
వారు.ఎప్పటికి చేరేవారో,తిరిగి ఎప్పటికి ఇంటికి చేరేవారో దేముడికెరుక!
మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా 1896లో ఈ కధలను రచించారు.
అప్పటి నుంచి ఈ నాటి వరకు ఆ కధలు ప్రచురించబడుతూనే ఉన్నాయి.
శ్రీ సుబ్బన్న దీక్షితులు నివసించిన ఇల్లు ఇప్పటికీ రాజమండ్రి ఉల్లితోట వీధిలో
ఉంది.చాలా కాలం వరకు ఆ ఇంటి పై కశీమజిలీ భవనం అనే అక్షరాలు ఉండేవి.
ఆ కధలన్నీ గొలుసుకట్టుగా,పురాణ కధలు, దైవ మహత్యాలు,నీతులు,నియమాలు,
ధర్మాలు,సాహసాలు ఇలా సాగిపోతుంటాయి.కాశీకి శిష్యులతో ప్రయాణిస్తూ గురువు
ప్రతి మజిలీలోను చెప్పే ఆశక్తికరమైన కధలే ఈ కధలు.అవకాశం దొరికితే ఈ కధలను
తప్పక చదవండి.పిల్లలకు చెప్పండి.వాళ్ళు చదివే, చూసే హారీపాటర్ ,క్లాష్ ఆఫ్ ది
టైటాన్స్ కన్నా అద్భుతంగా ఉంటాయి!

2 comments:

  1. మంచి పుస్తకాన్ని చెప్పారు...నాకు ఈ కథలంటే చాలా ఇష్టం..మొన్న book exhibitionలో అడిగితే 6 VOLUMES,800 అన్నాడు....కాని నాకు తెలిసి నేను ఇంతకు ముందు చదివింది ఒకటే పుస్తకం...నిన్న విజయవాడ పాతపుస్తకాల కొట్లో కొన్నాను...ఒకటే పుస్తకం..మొత్తం ఇరవయ్యేడు మకాములు....మరి ఈ 6 volumes లో ఏం వేశాడో అర్థంకాలేదు...షాపు వాడేమో సెట్ విప్పి చూడనివ్వలేదు...వీటిలో గనుక ఎక్కువ కథలుంటే తెలుపగలరు..

    ReplyDelete
  2. జవాబు; కౌటిల్య గారు, ఈ పుస్తకాలు ఒక్కో పుస్తకంలో 2 భాగాలు, 6 వాల్యూములుగా
    మొత్తం 12 భాగాలుగా వెలువడింది.వేరువేరు కధలు ఉంటాయి.ఒక్కో పుస్తకం ఖరీదు రూ.125/-.
    సెట్ ఖరీదు రూ.750/-.డిస్కౌంట్ కూడా ఇస్తారు.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About